_*☕ప్రశ్న: ఇన్స్టెంట్ కాఫీని ఎలా తయారు చేస్తారు?☕*_
👉జవాబు: మనం ఒక కప్పు ఇన్‌స్టెంట్ కాఫీని తయారు చేస్తున్నామంటే ఆ కాఫీని రెండవ సారి మరిగిస్తున్నామన్నమాటే. ఎందుకంటే కాఫీ తయారీతోనే ఈ పొడి ఉత్పాదన మొదలవుతుంది. ముందుగా కాఫీ గింజలను వేయించి, పొడి చేసి, ఆ పొడిని నీటిలో కలిపి అధిక ఉష్ణోగ్రత వద్ద సలసలా మరగబెడతారు. ఈ ప్రక్రియలో నీరు చాలా వరకూ ఆవిరైపోయిన తర్వాత గింజల భాగాలను తొలగించగా మిగిలిన చిక్కని ద్రవాన్ని ఒక సన్నని నాజిల్ ద్వారా స్ప్రే రూపంలో వేడిగా, పొడిగా ఉండే గాలి ప్రవహిస్తున్న ఒక డ్రయింగ్ టవర్ లోకి పంపిస్తారు. ఇందులో కాఫీలో ఉన్న తేమంతా ఆవిరైపోయి పొడిగా ఉండే ఇన్‌స్టెంట్ కాఫీ పౌడర్ మిగులుతుంది. మార్కెట్లో దొరికే ఈ పొడిని వేడి పాలలో కానీ, నీటిలో కానీ కలిపితే తక్షణ కాఫీ సిద్ధం.
💟💟💟💟💟💟💟💟💟💟

EmoticonEmoticon