AP TET/DSC - CHILD DEVELOPMENT AND PEDAGOGY - యత్నదోష అభ్యసన సిద్ధాంతం


యత్నదోష అభ్యసన సిద్ధాంతం
(ట్రైల్ అండ్ ఎర్రర్ థియరీ)
సిద్ధాంతాన్ని అమెరికాకు చెందిన .ఎల్ థారన్డైక్ ప్రతిపాదించాడు.
* దీనికి ఉన్న ఇతర పేర్లు సంసర్గవాద సిద్ధాంతం / సంధానవాద సిద్ధాంతం / ఉద్దీపన-ప్రతిస్పందన సిద్ధాంతం / బంధ లేక బాందు సిద్ధాంతం / సుఖదుఃఖాల సిద్ధాంతం, ఎస్-ఆర్ ప్రాధాన్యత సిద్ధాంతం.
 * ప్రేరణ, ప్రతిస్పందనల మధ్య దృఢమైన బంధం ఏర్పడటం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు కలుగుతుంది.
* జంతువుల పై అనేక ప్రయోగాలు చేసి, 'ఆభ్యసన ప్రక్రియను' ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య ఏర్పడే బంధంగా వివరించారు.

థారన్ డైక్ ప్రయోగం




·         ఆకలితో ఉన్న పిల్లిని బోనులాంటి పజిల్ పేటికలో పెట్టాడు .
·         దానికి ఆవల కొద్ది దూరంలో పిల్లికి కనిపించే విధంగా ఆహారం ఉంచాడు.
·         పజిల్ పెట్టి తలుపు తెరుచుకోవాలంటే లోపల మీటను నొక్కాలి.
·         వ్యర్ధమైన తప్పులతో కూడిన అనేక అనవసర కదలికలు చేసింది. త్వరితగతిన అటూ ఇటూ తిరుగుతూ పంజాలతో ఊచలను లాగడం, పళ్లతో కొరకడం వంటి ఎన్నో కదలికలు చేస్తూ విఫలమవుతూ అనుకోని రీతిగా పిల్లి మీటను తన పంజాతో తీగను నొక్కిన ఫలితంగా, తలుపు తెరుచుకోగా బయటకు వచ్చి ఆహారం తిన్నది.
·         విధంగా ప్రయత్నంలో చాలా తప్పులు చేస్తూ, కొంత సమయం తర్వాత లక్ష్యాన్ని చేరుకుంది.
·         తిరిగి విధంగానే పిల్లిని బోనులాంటి పెట్టెలో  ఉంచారు. రెండో ప్రయత్నంలో దోషాల సంఖ్య తగ్గించుకుని, గతంలో కంటే కొంత సమయం ముందుగానే పిల్లి తలుపు  తెరచి, ఆహారాన్ని తిన్నది.
·          ఇలా ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ,దోషాల సంఖ్య  గణనీయంగా తగ్గి, త్వరితగతిన ఇంకా తక్కువ కాలంలో  విజయవంతంగా మీటనొక్కి తలుపు తెరుచుకుని, ఆహారాన్ని చేరుకోవడం అనేది.. అభ్యసనం ద్వారా జరుగుతున్న  విషయాన్ని రుజువు చేస్తుంది.

·         ప్రయోగం వల్ల కొత్త విషయం నేర్చుకోవడం ఒక్కసారిగా కష్టసాధ్యమని, నాలుగైదు యత్నాలు చేయాలని, యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గి, అభ్యసనంలో పట్టు సాధిస్తామనే అంశం తెలిసింది.
ఉదా : సైకిల్ తొక్కడం, ఈత, ఏదైనా క్రీడలో నైపుణ్యం , తొలిదశలో పలకపై రాత మొదలైనవి.
·         విధంగా జరిగే అభ్యసనాన్ని 'విజయపథ పరణరీతి  అభ్యసనం' అని కూడా అంటారు.
·         ముఖ్యంగా చలన ఆభ్యసనం యత్నదోష పద్ధతిలోనే సాధ్యం .
·         థారన్ డైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమాలను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి..
·         1. అభ్యసన ప్రధాన నియమాలు (మేజర్ లాస్ ఆఫ్ లెర్నింగ్)
·         2. అభ్యసన అనుబంధ నియమాలు (మైనర్ లాస్ ఆఫ్ లెర్నింగ్)
·         3. ఫలిత నియమం (లా ఆఫ్ ఎఫెక్ట్)
1. సంసిద్ధతా నియమం (లా ఆఫ్ రీడ్లీనెస్)
·         ఆభ్యాసకుడు శారీరకంగా, మానసికంగా సంసిద్ధుడుగా ఉన్నప్పుడు అభ్యసనానికి అనుమతించాలి.
·         శారీరకంగా, మానసికంగా అభ్యాసకుడు  అభ్యసించడానికి సిద్ధంగా లేనప్పుడు అభ్యసనానికి అనుమతించకూడదు.
·         ప్రయోగంలో పిల్లికి 'ఆకలిగా ఉండడం వల్ల పజిల్ బాక్స్ బయటికి రావడానికి సంసిద్ధంగా ఉంది.
·         'గుర్రాన్ని నీళ్ల తొట్టి వరకూ తీసుకెళ్లవచ్చుగానీ దానితో నీళ్లను  తాగించలేము' అనే సామెతతో సంసిద్ధతా నియమాన్ని పోల్చవచ్చు.
సంసిద్ధతా నియమం తరగతి గది అన్వయం

1. ఆభ్యాసకుడు అభ్యసనా కృత్యం చేయడానికి తగిన శారీరక, మానసిక పరిపక్వత ఉండాలి.
2. ఆభ్యాసకుడికి అభ్యసనం పట్ల అభిరుచిని కలిగించాలి.
3. ఆభ్యాసకుడు అభ్యసనం పట్ల అవధానం నిలపాలి.
4. ఆభ్యాసకుడిలో ఉపాధ్యాయుడు అంతర్గత, బహిర్గత, సాధనా ప్రేరణ కలిగించాలి.
5. ఆభ్యాసకుడి అవసరాలకు తగిన సిలబస్, కరికులమ్ ప్రవేశపెట్టాలి.
6. పాఠ్య పథకంలోని ప్రవేశిక చర్యలో భాగాలైన పూర్వజ్ఞానం పరిశీలించడం, ఉన్ముఖీకరణం, శీర్షికా ప్రకటన సంసిద్ధతా సుత్రానికి సంబంధించినవి.
7. హెర్బర్ట్ బోధనా సోపానాలలో సన్నాహం' అనే సోపానం సంసిద్ధతా సూత్రంతో పోల్చవచ్చు.
8. బోధనలో ఉన్ముఖీకరణ (మోటివేషన్) సోపానం అవసరం అనే విషయాన్ని తెలియజేస్తుంది.
2. అభ్యాస నియమం (లా ఆఫ్ ఎక్సర్సైజ్) :
అభ్యాస నియమంలో రెండు ఉపనియమాలున్నాయి.
1. ఉపయోగ నియమం : తరచుదన లేదా పౌనఃపున్య ఉపయుక్త సూత్రం ఏదైనా ఒక కృత్యాన్ని పదే పదే ఆచరించడం వల్ల ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య సంధాన బలం పెరిగి, అభ్యసనం జరుగుతుంది.
ఉదా : టైప్ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే దానిలో నైపుణ్యం వస్తుంది.

2. నిరుపయోగ నియమం : ఏదైనా ఒక కృత్యాన్ని పదే పదే ఆచరించకపోవడం వల్ల ఉద్దీపనకు, ప్రతిస్పందనకు మధ్య సంధాన బలం తగ్గి, అభ్యసనం జరగదు. ఉదా : ఇది చలన కౌశలాలకు వర్తించదు. మెదడు సంబంధిత అంశాలకు మాత్రమే వర్తిస్తుంది.
ఒకసారి చదవడం ద్వారా నేర్చుకున్న విషయం తిరిగి ఉపయోగించకపోతే మరచిపోతాము. (ఇది మెదడు
సంబంధిత అంశం). నోట్ : అభ్యసనం మనిషిని నిష్ణాతుణ్ణి చేస్తుంది.
* ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ టూ పర్ఫెక్ట్ అనే సామెతను,
'అనగ అనగా రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ'
అనే వేమన పద్యాన్ని, అభ్యాసం కుసు విద్య, సాధనాత్ సాధ్యతే సర్వమ్ ను అభ్యాస సూత్రంతో పోల్చవచ్చు.
అభ్యాస నియమం తరగతి గది అన్వయం
1. విద్యార్థితో డ్రిల్ చేయించడం
2. విద్యార్థి ఒక నైపుణ్యాన్ని పదే పదే ఆచరించడం
3. విద్యార్థి ఒక కృత్యాన్ని పదే పదే పునశ్చరణ చేసుకోవడం
4. విద్యార్థి మననము (రెసిటేషన్) చేసుకోవడం

3. ఫలిత నియమం (లా ఆఫ్ ఎఫెక్ట్)
థారన్డైక్ ప్రకారం ఆభ్యసనా సూత్రాలన్నింటిలో ఆతి ప్రధానమైన ఫలిత నియమాన్ని అనేక పర్యాయాలు మార్పులు చేశాడు. 'నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్' అనే సామెత నియమానికి చెందుతుంది. ఫలిత నియమంలో రెండు ఉపనియమాలున్నాయి.
1. సంతృప్తికర నియమం : ఆభ్యాసకుడికి అభ్యసన ఆనుభవాలు
సంతృప్తికరంగా ఉంటే ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య సంధాన బలం పెరిగి, అభ్యసనం జరుగును.
* మంచి మార్కులు సాధించిన విద్యార్థికి బహుమతి ఇస్తే మరింత బాగా రాణిస్తారు.
2. అసంతృప్తికర నియమం : ఆభ్యాసకుడికి అభ్యసన అనుభవాలు సంతృప్తికరంగా లేనప్పుడు ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య సంధానబలం తగ్గి, అభ్యసనం జరగదు.
ఉదా: మంచి మార్కులు సాధించినా బహుమతి అందకపోతే విద్యార్థి తర్వాత బాగా చదవడు.
ఫలిత నియమం తరగతి గది అన్వయం
* ఫలిత నియమం ప్రకారం తరగతిలో ఏర్పరిచే అనుభవాలు సంతృప్తికరంగా ఉండాలి.
* విద్యార్థులకు అభ్యసించడానికి తగిన ప్రేరణ ఉండాలి. ప్రేరణ లేనిదే సక్రమమైన ఆభ్యసనం జరగదు.
* విద్యార్థుల అవసరాలకు తగినట్లు బోధనాంశాలను సవరించాలి. తాము నేర్చుకునే విషయాలు జీవితంలో తమకు ఉపయోగపడతాయని విద్యార్థులు తెలుసుకున్నప్పుడు అభ్యసనం సక్రమంగా జరుగుతుంది.
* విద్యార్థులకు విజయంతో కూడిన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు అభ్యసనం సక్రమంగా జరుగుతుంది.
* విద్యార్థులు సక్రమమైన అభ్యసనం చేసినప్పుడు  బహుమతులు, ప్రశంసలు ఏర్పాటు చేయాలి.
* విద్యార్థులకిచ్చే నియోజనాలు ( సైన్మెంట్స్) వారు సాధించగలిగేవిగా ఉండాలి.
* విద్యార్థి చేసిన పనిని ఉపాధ్యాయుడు మెచ్చుకున్నప్పుడు విద్యార్థి సంతోషిస్తాడు. అది సంతృప్తిని కలిగిస్తుంది.
* 'జాయ్ ఫుల్ లెర్నింగ్' ఆభ్యసన పరిస్థితులలో జరిగే అభ్యసనం పరిష్టంగా ఉంటుంది.
* బోధన ఆనందకరమైన కార్యక్రమంగా ఉండాలి.
* ఉపాధ్యాయుడు ఆభ్యసన సామర్ధ్యం చూపిన వెంటనే బహుమతులివ్వాలి.
* ఉపాధ్యాయుడు ఆభ్యాసకుడిని పొగడ్త రూపంలో ప్రోత్సహించాలి.
* అభ్యాసకుడు దక్షత చూపించిన వెంటనే ప్రోత్సాహకాలు, గ్రేడింగ్, బంగారు పతకాలు, పాయింట్లు ఇవ్వాలి.
2. అభ్యసనం అనుంబంధ నియమాలు

1. కాల వ్యవధి నియమం (లా ఆఫ్ టైమ్ ఫ్యాక్టర్)
అభ్యసనంలో సామర్ధ్యం చూపడానికి, బహుమతి పొందే అంశాలకు మధ్య కాలవ్యవధి పెరిగితే ఆభ్యసన సామర్థ్యం తగ్గుతుంది.
* అభ్యసనంలో సామర్ధ్యం చూపడానికి, బహుమతి పొందే అంశాలకు మధ్య కాలవ్యవధి తగ్గితే అభ్యసన సామర్థ్యం పెరుగుతుంది.
* అభ్యసన సామర్ధ్యం - కాలవ్యవధి విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి.
* ఉపాధ్యాయుడు : విద్యార్థి ప్రతిభ చూపిన వెంటనే ప్రోత్సాహకాలు, బహుమతి ఇవ్వాలి.



no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv