ఐన్ స్టీన్ జీవిత కాలక్రమం

*🔥ఐన్ స్టీన్ జీవిత కాలక్రమం🔥*


1879: జర్మనీ దేశంలోని వుర్టెంబర్గ్ రాజ్యంలోని ఉల్మ్ లో జన్మించారు.

1884–1894: మునిచ్ లోని కాథలిక్ ప్రైమరీ పాఠశాల కు, లుయిట్పోల్డ్ గ్యమ్నసిం పాఠశాలలో చదువుకున్నారు.

1894–1895: ఇటలీలోని పవియాకు వెళ్ళారు.

1895–1896: సిట్జర్ ల్యాండ్ లోని ఆరయులో మిట్టెల్ స్కులే పాఠశాలలో మాధ్యమిక విద్య అభ్యసించారు.

1896: వుర్టెంబర్గ్ పౌరసత్వం వదులుకున్నారు.

1896–1900: జురిచ్ లో పాలిటెక్నిక్ చదువుకున్నారు.

1901: స్విస్ పౌరసత్వం లభించింది.

1902–1909: స్విట్జర్ ల్యాండ్ లోని బెర్నెలో స్విస్ పేటెంట్ కార్యాలయంలో పనిచేశారు.

1902: ఇటలీలోని మిలాన్ లో ఆయన తండ్రి హెర్మన్ ఐన్ స్టీన్ మరణం.

1903: మిలెవా మారిక్ ను పెళ్ళి చేసుకున్నారు.

1905: నాలుగు శాస్త్రీయ పత్రాలను ప్రచురించారు.

1905: స్విట్జర్ ల్యాండ్ లోని జురిచ్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి అందుకున్నారు.

1907–1916: సాధారణ సాపేక్షిత సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు.

1908–1909: బెర్న్ విశ్వవిద్యాలయంలో లెక్చెరర్ గా పనిచేశారు.

1909–1911: జురిచ్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశారు.

1911–1912: ప్రేగ్యులోని చార్లెస్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు.

1912–1914: ఎథ్ జురిచ్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు.

1914: బెర్లిన్ కు తన కుటుంబంతో సహా వెళ్ళిపోయారు ఐన్ స్టీన్. కొన్ని నెలల తరువాత వారి ఇద్దరు కుమారులను తీసుకుని ఆయన భార్య మిలెవా మరిక్ ఆయన వదిలి తిరిగి జురిచ్ కు వెళ్ళిపోయారు (అప్పటికి వారి ఇద్దరు కుమారులు 4, 10 ఏళ్ళ వారు).

1914: స్విస్ పౌరసత్వంతో పాటు, జర్మన్ పౌరసత్వం కూడా లభించింది ఆయనకు.

1914–1933: ప్రషియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో సభ్యుడయ్యారు.

1914–1932: బెర్లిన్ లోని కైసెర్ విల్హెల్మ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజిక్స్ కు అధ్యక్షునిగా అయ్యారు.

1914–1917: హంబొల్డ్ యూనివర్శిటీ ఆఫ్ బెర్లిన్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు.

1916–1918: జర్మన్ ఫిజికల్ సొసైటీకి అధ్యక్షనిగా వ్యవహిరించారు.

1919: మిలెవా మారిక్ కు విడాకులు ఇచ్చిన ఐన్ స్టీన్, తన కజిన్ ఎల్సా లోవెంథాల్ ను వివాహం చేసుకున్నారు.

1920: బెర్లిన్ లోని ఐన్ స్టీన్ గృహంలో ఆయన తల్లి పౌలిన్ మరణించారు.

1921: భౌతికశాస్త్రంలో ఆయన చేసిన కృషికి నోబెల్ బహుమతి అందుకున్నారు.

1933: జర్మన్ పౌరసత్వం వదులుకుని అమెరికా వలస వెళ్ళిపోయారు.

1933–1955: అమెరికాలోని న్యూజెర్సీ, ప్రిన్స్ టౌన్ లో ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్వాన్సెడ్ స్టడీలో ప్రొఫెసర్ గా పనిచేశారు.

1936: ఆయన రెండో భార్య ఎల్సా మరణించారు.

1940: స్విస్ పౌరసత్వంతో పాటు అమెరికా పౌరసత్వం కూడా లభించింది.

1951: ప్రిన్స్ టౌన్ లోని ఆయన ఇంటిలో సోదరి మజా ఐన్ స్టీన్ మరణించారు.

1998: ప్రిన్స్ టౌన్ లో ఐన్ స్టీన్ మరణించారు






no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv