*🔥వైరస్🔥*
*ఈ వ్యాసం జీవజాలంపై దాడి చేసే అతిసూక్ష్మమైన కణాల గురించి. ఇతర వాడుకల కొరకు, వైరస్ (అయోమయ నివృత్తి) చూడండి*.
*వైరస్ అనే పదము లాటిన్ భాష నుండి ఉద్భవించింది. లాటిన్‌లో వైరస్ అంటే టాక్సిన్ లేదా విషము అని అర్థం. వైరస్‌లు అతి సూక్షమైనవి (సుమారుగా 15-600 నానోమీటర్లు). ఇవి ఇతర జీవుల కణాలపై దాడిచేసి వ్యాధులను కలుగజేస్తాయి. ఈ దాడి ముఖ్య ఉద్దేశము వైరస్‌ల సంతతిని పెంచుకోవడముతో ముడిపడి ఉంటుంది. వైరస్‌లు వాటంతట అవి విభజన చెందలేవు. విభజన చెందాలంటే వేరే జీవకణం తప్పనిసరి. వైరస్‌లలో అతి సరళమైన జన్యుపదార్థం ఒక రక్షణ కవచంచే సంరక్షించబడుతూ ఉంటుంది. ఈ రక్షణ కవచం ప్రోటీనులతో చేయబడి ఉంటుంది, దీనిని క్యాప్సిడ్ అంటారు. వైరస్‌లు చాలా రకాల జీవులపై దాడి చేయగలవు (బాక్టీరియా, జంతురాజ్యము, వృక్షరాజ్యంతో పాటు శిలీంధ్రాలు, ప్రొటిస్టాకి చెందిన జీవులు కూడా వీటి దాడికి గురవుతుంటాయి). బాక్టీరియాపై దాడిచేసే వైరస్‌ను బాక్టీరియోఫేజ్ (సరళత కొరకు ఫేజ్) అని అంటారు. వైరస్‌ల అధ్యయనాన్ని వైరాలజీ అని, వీటిని అధ్యయనం చేసే వారిని వైరాలజిస్టులని అంటారు*
*🔥వైరస్‌ల చరిత్ర🔥*
*వైరస్‌ల వల్ల వచ్చే వివిధ రకాల వ్యాధులు మానవజాతిని తరతరాలుగా పీడిస్తూ వచ్చాయి. వీటిలో ముఖ్యమైనవి ఎయిడ్స్, ఆటలమ్మ, మశూచి, తట్టు, పోలియో, యెల్లో ఫీవర్, రేబీస్ వంటివి. ప్రాచీన ఈజిప్టు రాజ్యంలో పోలియో ఉన్నట్టు వారి చిత్రాల ద్వారా విశదమవుతుంది. 1717 సంవత్సరములో, ఒట్టోమన్ రాజ్యంలో ప్రజలు ఆటలమ్మకు వ్యతిరేకంగా వారి పిల్లలను వ్యాధి కారకాలకు గురి చెయ్యడాన్ని (ఇనాక్యులేట్), ఒక బ్రిటీష్ రాయబారి భార్య అయిన మేరీ మాంటెగూ అనే ఆవిడ గమనించింది. 18 శతాబ్దాంతంలో ఎడ్వర్డ్ జెన్నర్, సారా నెల్మ్స్ అనే పాలవ్యాపారిని పరీక్షిస్తుండగా ఆవిడకు ఇంతకు ముందు మశూచి (కౌపాక్స్) రావడంవల్ల ఆ తరువాత మశూచి రాలేదని కనిపెట్టాడు. ఆ తర్వాత జెన్నర్ 1879లో మొట్టమొదటి టీకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మశూచి నిర్మూలనోద్యమంలో వాడాడు*.
*🔥వైరస్‌లను కనుగొన్న వైనం సవరించు🔥*
*19వ శతాబ్దాంతంలో చార్లెస్ చాంబర్లాండ్ పోర్సలీన్ ఫిల్టర్ని కనుగొన్నాడు, దీని ద్వారా అన్ని బాక్టీరియాలను జల్లించడానికి వీలయ్యేది కాని వైరస్‌లు మాత్రం వేరుచేయబడేవి కాదు. దిమిత్రి ఇవనోవ్‌స్కీ ఈ ఫిల్టర్ సహాయంతో పొగాకు మొజాయిక్ వైరస్ (Tobacco Mosaic Virus) ను అధ్యయనం చేసాడు. పొగాకుల సారాన్ని (ఎక్స్‌ట్రాక్టుని) వడపోసిన తర్వాత కూడా ఆ ఎక్స్‌ట్రాక్టుకు వ్యాధిని ప్రబలింపజేసే గుణం ఉన్నదని ఆయన తన పరిశోధనల ద్వారా తెలియజేసాడు. అదే సమయంలో, వడపోసినా చిక్కని వ్యాధి కారకాలు కొన్ని ఉంటాయని, ఇతర ప్రయోగాల వల్ల బాక్టీరియాలు, వైరస్‌లు వేర్వేరని ఇతర శాస్త్రవేత్తలు నిర్దారించారు. అంతేకాక వైరస్‌లు కూడా బాక్టీరియాల వలె వ్యాధులను కలగజేస్తాయని కనుగొన్నారు. మరికొన్ని ప్రయోగాల తర్వాత వైరస్‌లు బాక్టీరియాల కంటే సూక్ష్మమైనవని నిర్ధారించబడింది. వైరస్ అనే పదాన్ని డచ్ సూక్ష్మజీవ శాస్త్రవేత్త (మైక్రోబయాలజిస్ట్) మార్టినస్ బీజెరింక్ ప్రతిపాదించాడు*.
*💐వైరస్‌ల అధ్యయనం సవరించు*
*వైరస్‌లు బాక్టీరియాపై దాడి చేయగలవని 20వ శతాబ్ద ప్రారంభంలో ఫ్రెడెరిక్ త్వార్ట్ కనుగొన్నాడు. ఫెలిక్స్ డి'హెరెల్, వైరస్‌ను కలిగిన ప్రిపరేషన్ను పలుచటి కణాలు వర్ధిల్లుతున్న మేట (కల్చర్) కలిగిన అగార్ ప్లేట్ పైన వేయగా, వైరస్‌లు ఉన్న ప్రదేశంలోని కణాలు చనిపోయాయని గుర్తించాడు. చనిపోయిన ప్రదేశాలను లెక్కించి సస్పెన్షన్లో ఉన్న వైరస్‌ల సంఖ్యను లెక్కకట్టాడు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఆవిష్కరించబడిన తర్వాత మొట్టమొదటి సారిగా వైరస్‌లను చూడగలిగారు. 1935లో వెండెల్ స్టాన్లీ, టొబాకో మొజాయిక్ వైరస్‌ను స్ఫటికీకరించి (క్రిస్టలైజ్), అందులో అత్యధిక శాతం ప్రోటీన్లే (మాంసకృతులే) నని నిర్ధారించాడు. 1939లో మాక్స్ డెల్‌బ్రూక్ మరియు ఇ.ఎల్.ఎల్లిస్ ఒకే దశలో ఫేజ్‌లు ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయని కనుగొన్నారు*.
*వైరస్‌లను మామూలుగా ఇతర కణాలను కల్చర్ చేసినట్టు చేయడం వీలయ్యేది కాదు అందువల్ల జంతువులపై ఈ వైరస్‌లచే దాడి చేయించేవారు. ఇలాంటి ప్రయోగాలు అప్పటి వైరాలజిస్ట్‌లకు ఎదురైన ఇబ్బందుల్లో ముఖ్యమైనవి. 1931లో ఎర్నెస్ట్ విలియం గుడ్ పాశ్చర్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ను పరిపక్వమైన కోడి గుడ్డులో పెంచాడు. కాని అన్ని రకాల వైరస్లు కోడి గుడ్లలో పెరగలేదు, అందువల్ల ఇంకా ఎక్కువ వాడకం కల పద్ధతి అవసరం ఏర్పడింది. 1949లో జాన్ ఫ్రాన్క్లిన్ ఎండర్స్, థామస్ హెచ్.వెల్లర్ మరియు ఫ్రెడరిక్ చాప్మన్ రాబిన్స్ కలిసి పోలియో వైరస్‌ను సజీవమయిన జంతు కణాల కల్చర్‌లో పెంచారు. అప్పటి నుంచి వారి పద్ధతిలో చిన్నాచితకా మార్పులు చేస్తూ మిగతా వైరస్‌లను కూడా సెల్ కల్చర్‌లలో పెంచడం మొదలయింది*.

EmoticonEmoticon