భారతదేశం - భౌగోళికశాస్రం - నదులు - గంగానది

*🖊📗గంగా నది🖊📘*

*భారతదేశంలో ప్రవహించే ముఖ్యమైన జీవనది*

*💐గంగానది (హిందీ భాష: गंगा ; ఆంగ్లం: Ganges River) భారతదేశంలోను, బంగ్లాదేశ్‌లోను ప్రధానమైన నదులలో ఒకటి. భారతదేశం ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడివడి ఉన్నాయి. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. "గంగమ్మ తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగా భవాని" అనీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు. "నీరు" అన్న పదానికి సంస్కృతంలో "గంగ" అన్న పదాన్ని వాడుతారు*.

*నదీముఖద్వారం*
బంగాళాఖాతము

*పొడవు*
2,525 కి.మీ.

*గంగా నది మొత్తం పొడవు సుమారు 2,525 కి.మీ. (1,557 మైళ్ళు). గంగ, దాని ఉపనదియైన యమున కలిసి విశాలమైన మైదానప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. సారవంతమైన ఈ "గంగా-యమునా మైదానం" ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌లలో విస్తరించి ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో 8.5 % ప్రజలకు (ప్రతి 12 మందిలో ఒకరికి) ఈ మైదానం నివాసస్థానం. ఈ కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రమైన ఆర్థిక, పర్యావరణ, సాంఘిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి*


*🔥భౌగోళికం🔥*

*🌐ఉత్తరాఖండ్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీనదం (Glacier) లో భాగీరధి నది ఉద్భవిస్తున్నది. ప్రవాహ మార్గంలో దేవ ప్రయాగ వద్ద అలకనందనది దీనితో కలుస్తుంది. అక్కడినుండి దీనిని "గంగ" అంటారు. కొంత దూరం హిమాలయాలలో ప్రహించిన ఈ నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తున్నది*.


*బంగ్లాదేశ్, భారతదేశాలలో విస్తరించి ఉన్న గంగానది డెల్టా*
*మైదానాలలో ప్రహించే మార్గంలో గంగానదితో కోసి, గోమతి, శోణ వంటి ఉప నదులు కలుస్తాయి. అన్నింటికంటే పెద్దదైన యమునానది అలహాబాదు, (ప్రయాగ) వద్ద గంగానదితో కలుస్తుంది. యమున సాంకేతికంగా గంగకు ఉపనదియైనా గాని, యమున చాలా పెద్ద నది గనుక వేరే నదిగా అన్నివిధాల పరిగణింప వచ్చును. గంగతో పాటు యమునకు కూడా హిందూమతంలో పవిత్ర స్థానం ఉంది. ఈ రెండు నదుల ఒడ్డున ఉత్తరభారతదేశంలో పెద్దవైన నగరాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఢిల్లీ, కాన్పూరు, అలహాబాదు, వారాణసి, పాట్నా, కొలకత్తా వంటివి అలాంటి నగరాలలో కొన్ని*.


*వారాణసిలో గంగానదిపై* *సూర్యోదయం*
*అలహాబాదు తరువాత మరెన్నో నదులతో కలిసి గంగానది మహా ప్రవాహంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్‌లో మాల్దా వద్ద మొదటిసారి చీలుతుంది. అక్కడినుండి హూగ్లీ నది (గంగానది చీలిక) ప్రారంభమౌతుంది. విశాలమైన గంగా-హూగ్లీ డెల్టా ఇక్కడితో మొదలౌతుంది. కొలకత్తా నగరం హూగ్లీ వడ్డున ఉంది. ప్రధానమైన గంగానదిని మాల్దా తరువాత "పద్మ" నది అంటారు. పద్మ నది బంగ్లాదేశ్‌లో ప్రవేశించిన తరువాత బ్రహ్మపుత్రా నది చీలిక అయిన జమునా నది పద్మతో కలుస్తుంది. ఆతరువాత మేఘనా నది కూడా దీనితో కలుస్తుంది. బంగ్లాదేశ్ మైదానాలలో ఈ మహాప్రవాహం అనేకానేకంగా చీలి అక్కడి సుందర వనాలు డెల్టా గుండా ప్రవహించి, తరువాత బంగాళాఖాతం సముద్రంలో కలుస్తాయి*.

*సుందర వనాలు (Sundarbans) డెల్టా దట్టమైన mangrove వృక్షాలతో కూడిన అరణ్యం. పర్యావరణ పరంగా విశిష్టమైన చాలా వృక్ష, జంతు సంపదకు ఆలవాలం. ప్రత్యేకించి రాయల్ బెంగాల్ పులి, గంగానది డాల్ఫిన్, ఐరావతి డాల్ఫిన్, మంచినీటి షార్క్ చేప (Glyphis gangeticus) వీటిల్లో ముఖ్యమైనవి*

*🔥హిందూమతంలో గంగ🔥*

*🔥పావన గంగ🔥*

*🖊️హిందూ మతం ఆచారాల ప్రకారం గంగానది చాలా పవిత్రమైనది. పావనం చేసేది. ఒక్కమారు గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలనుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగా జలం మింగితే స్వర్గప్రాప్తి నిశ్చయమనీ నమ్మకం. చనిపోయిన తమ కుటుంబీకుల అస్తికలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దూరదూరాలనుండి వారాణాసికి, గయకు, ప్రయాగకు, ఇతర గంగానదీ తీర్ధాలకు వస్తారు. గంగా నది జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవడం శుభప్రథమని భావిస్తారు*.

*గంగా నది తీరాన కుంభ మేళ, ఛత్‌పూజ వంటి ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహం కూడుకొనే ఉత్సవం*

*🔥కాలుష్యం సమస్య🔥*

*జనసాంద్రత అధికంగా ఉన్న ప్రదేశాలు గంగానదికి ఇరువైపులా ఉన్నందున, చుట్టుప్రక్కల కాలుష్యాన్ని విడుదలచేసే అనేక పరిశ్రమలు ఉండడం వలన, గంగానదీ జలాలు తీవ్రమైన కాలుష్యానికి గురవుతున్నాయి*.



*కాన్పూరు వంటి నగరాలలోని రసాయనిక పరిశ్రమలు, తోలు పరిశ్రమలు, ఇందుకు ఒక ముఖ్య కారణం. అందుకు తోడు ప్రజల గృహాలనుండి వెలువడే మురుగునీరు రోజూ 100 కోట్ల లీటర్లు గంగలో కలుస్తున్నాయని అంచనా. ఈ పరిస్థితిని నివారించడానికి అడపా దడపా కొన్ని చర్యలు తీసికొన్నారు గాని ఫలితాలు చాలా కొద్ది స్థాయిలో ఉన్నాయి*

🍁🍃🍃🍃🌾🍃🍃🍃🍁

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv