జాగ్రఫీ - అక్షాంశాలు, రేఖాంశాలు, గ్రహణాలు, భూచలనాలు,భూమి అంతర్నిర్మాణం

*🌏జాగ్రఫీ - అక్షాంశాలు, రేఖాంశాలు, గ్రహణాలు, భూచలనాలు,భూమి అంతర్నిర్మాణం🌎*

1. అక్షాంశాలు, రేఖాంశాలు అనే పదాలను తొలిసారి ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు?
- హిప్పార్కస్‌

2. అక్షాంశాలు, రేఖాంశాలు ఎటువంటి రేఖలు?
- ఊహారేఖలు

3. ఉత్తర, దక్షిణ ధృవాలకు సమాన దూరంలో భూమిపై అడ్డంగా గీసిన వృత్తాకారపు ఊహా రేఖను ఏమంటారు? - భూమధ్య రేఖ

4. భూమధ్య రేఖకు గల ఇతర పేర్లు ఏమిటి?/ భూమధ్య రేఖను ఎలా పిలుస్తారు?
-1. అతి పెద్ద అక్షాంశం 2. సుదీర్ఘ వృత్తం 3. మహావలయం 4. గొప్పవలయం
 5. గ్రేట్‌ సర్కిల్‌ 6. బిగ్‌ సర్కిల్‌

5. భూమధ్య రేఖకు సమాంతరంగా ధృవాల వరకు భూమిపై అడ్డంగా గీసిన వృత్తాకారపు ఊహారేఖలను ఏమంటారు?
- అక్షాంశాలు

6. రెండు అక్షాంశాల మధ్య సగటు దూరం?
- 111 కిలోమీటర్లు

7. భూమధ్య రేఖ నుంచి ఉత్తరం, దక్షిణం వైపున గల అర్ధగోళాలను ఏమంటారు?
- ఉత్తరార్ధ గోళం, దక్షిణార్ధ గోళం

8. అక్షాంశాలు ఎన్ని?
- 181 (ఉత్తరార్ధ గోళంలో- 90, దక్షిణార్ధ గోళంలో- 90 భూమధ్యరేఖ- 1)

9. 0 డిగ్రీ అక్షాంశం అని దేనిని అంటారు?
- భూమధ్య రేఖ

10. ఎన్ని డిగ్రీల అక్షాంశాన్ని కర్కటరేఖ అంటారు?
- 23 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం

11, ఎన్ని డిగ్రీల అక్షాంశాన్ని మకర రేఖ అంటారు?
- 23 1/2 డిగ్రీల దక్షిణ అక్షాంశం

12. 66 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు?
- ఆర్కిటిక్‌ వలయం

13. 66 1/2 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమంటారు?
- అంటార్కిటిక్‌ వలయం

14. కర్కటరేఖ, మకర రేఖలను మరోరకంగా ఏమని పిలుస్తారు?
- ఆయన రేఖలు

15. కర్కటరేఖ, మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? - ఉష్ణమండలం
16. కర్కటరేఖ నుంచి ఆర్కిటిక్‌ వలయానికి, మకర రేఖ నుంచి అంటార్కిటిక్‌ వలయానికి మధ్యన ఉన్న ప్రాంతాలను ఏమంటారు?
- సమశీతోష్ణ మండలం

17. ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌ వలయాల నుంచి ధృవాల వరకు గల అక్షాంశాలను ఏమంటారు?
- ధృవ వలయాలు

18. అమెజాన్‌ నది ముఖద్వారం నుంచి వెళ్లే ప్రధాన అక్షాంశం ఏది?
- భూమధ్య రేఖ

19. భూమధ్య రేఖను 2 సార్లు దాటుతున్న నది?
- ఆఫ్రికాలోని కాంగో నది. దీనినే జైరె నది అని కూడా అంటారు.

20. భారతదేశానికి ఇంచుమించు మధ్యగా తూర్పునుంచి పడమరగా వెళ్లే ప్రధాన అక్షాంశం ఏది?
- కర్కటరేఖ

21. కర్కటరేఖ మనదేశంలో ఎన్ని రాష్ట్రాల నుంచి వెళుతుంది? (పడమర నుంచి తూర్పు
వైపునకు) అవి ఏవి?
- 8 రాష్ట్రాలు. (గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, త్రిపుర, మిజోరాం)

22. అక్షాంశాలు ఏ ఆకారంలో ఉంటాయి?
- వృత్తాకారం

23. మూడు ప్రధాన అక్షాంశాల చొప్పున వెళ్లే ఖండాలు ఎన్ని? అవి ఏవి?
- 2 ఖండాలు. అవి ఆసియా, ఆఫ్రికా

24. రెండు అక్షాంశాల చొప్పున వెళ్లే ఖండాలు ఎన్ని? అవి ఏవి?
-రెండు ఖండాలు. అవి 1. ఉత్తర అమెరికా 2. దక్షిణ అమెరికా

25. ఆస్ట్రేలియా ఖండం మధ్యగా వెళ్లే ప్రధాన అక్షాంశం?
-మకరరేఖ

26. రేఖాంశాలు ఏ ఆకారంలో ఉంటాయి?
-అర్ధ వృత్తాకారం

27. రేఖాంశాలు ఎన్ని?
- 360

28. రెండు రేఖాంశాల మఽధ్య గరిష్ఠ దూరం?
-110 కిలోమీటర్లు

29. ఒకే రేఖాంశంపై ఉండే అన్ని ప్రాంతాల్లోనూ ఒకేసారి మిట్టమధ్యాహ్నం అవుతుంది. వీటిని ఏమంటారు?
- మధ్యాహ్న రేఖలు

30. భూమి తనచుట్టూ తాను ఏ విధంగా తిరుగుతుంది?
- పడమర నుంచి తూర్పునకు

31. భూమి ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశానికి తిరగడానికి ఎంత సమయం పడుతుంది?
- 4 నిమిషాలు

32. ప్రపంచ ప్రామాణిక రేఖాంశం ఏది?
 - గ్రీనిచ్‌ రేఖాంశం. దీనినే 0 డిగ్రీల రేఖాంశం అని కూడా అంటారు.

33. గ్రీనిచ్‌ రేఖను ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా ఎప్పుడు గుర్తించారు?
- 1884, న్యూయార్క్‌ సమావేశంలో

34. గ్రీనిచ్‌ రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రకాశించినపుడు మధ్యాహ్నం 12 గంటలుగా నిర్ణయించిన సమయం ప్రపంచానికి ఏమవుతుంది?
- ప్రామాణిక సమయం

35. 180 డిగ్రీల తూర్పు, పశ్చిమ రేఖాంశాన్నిఏమంటారు?
- అంతర్జాతీయ దిన రేఖ

36. అంతర్జాతీయ దిన రేఖను ఏ సమావేశంలో గుర్తించారు?
-1884 -వాషింగ్టన్‌

37. అంతర్జాతీయ దిన రేఖ ఎటువంటిది?
- ఒక సౌకర్య రేఖ

38. భారత ప్రామాణిక రేఖాంశం ఏది?
- 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం

39. ప్రపంచ ప్రామాణిక సమయానికి భారత ప్రామాణిక సమయానికి మధ్య వ్యత్యాసం?
- 5 గంటల 30 నిముషాలు

40. లండన్‌లో మధ్యాహ్నం 12 గంటలయితే భారత దేశంలో సమయమెంత?
- సాయంత్రం 5 గంటల 30 నిముషాలు

41. భారతదేశంలో మధ్యాహ్నం 12 గంటలయితే లండన్‌లో సమయమెంత?
- ఉదయం 6 గంటల 30 నిముషాలు

42. భారత ప్రామాణిక రేఖాంశం మన దేశంలో ఎన్ని రాష్ట్రాల నుంచి, ఏ పట్టణాల మీదుగా వెళుతుంది? అవి ఏవి?
- 5 రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్‌- అలహాబాద్‌, మధ్యప్రదేశ్‌- రేవా, ఛత్తీస్‌గఢ్‌-రాయ్‌పూర్‌, ఒడిశా- కోరాపుట్‌, ఏపీ-కాకినాడ, యానాం

43. యానాం పట్టణం ఏ కేంద్ర పాలిత ప్రాంత విభాగం?
- పుదుచ్చేరి

44. ప్రపంచంలో ఎక్కువ కాలమండలాలు గల దేశం ఏది?
- రష్యా (9)

45. ప్రపంచ ప్రామాణిక సమయానికి, ఇతర ప్రాంతాల సమయాలకు వ్యత్యాసాన్ని తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి?
- గ్రీనిచ్‌లో ఇచ్చిన సమయానికి ఆ రేఖ నుంచి ఒక్కొక్క రేఖాంశానికి 4 నిముషాల చొప్పున తూర్పు వైపునకు పోయే కొద్దీ కలపాలి. అదే విధంగా పశ్చిమానికి వెళ్లే కొద్దీ తీసివేయాలి.

46. సముద్రయానం చేసే నావికులు ఏ అక్షాంశంపై ఉన్నారో తెలుసుకోవడానికి ఉప యోగించే పరికరం ఏది?
- సెక్ట్సాంట్‌

47. ప్రపంచ ప్రామాణిక సమయాన్ని తెలియజేసే పరికరం ఏది?
- క్రోనోమీటర్‌

48. ప్రపంచంలో సూర్యోదయం మొదటగా కనిపించే దేశం ఏది?
- జపాన్‌ దీనిని ఆ దేశ మాతృభాషలో ‘నిప్పాన్‌’ అంటారు. దీని అర్థం సూర్యుడు ఉదయించు భూమి.

49. ప్రపంచంలో సూర్యాస్తమయం చివరగా కనిపించే దేశం ఏది?
- యుఎస్‌ఎ

50. అక్షాంశాలు, రేఖాంశాలు కలిసే మధ్య నిడివిని ఏమంటారు?
- గ్రిడ్‌

51. గ్రిడ్‌ ఏ ఆకారంలో ఉంటుంది?
- చతుష్కోణం

52. మన దేశంలో సూర్యోదయం మొదటగా కనిపించే ప్రదేశం ఏది?
- అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని పూర్వాంచల్‌ పర్వతాల్లోని దిల్ఫా కనుమ వద్ద ‘డాంగ్‌ ’

53. మన దేశంలో సూర్యాస్తమయం చివరగా కనిపించే ప్రదేశం ఏది?
- గుజరాత్‌ రాష్ట్రంలో రాణ్‌ ఆఫ్‌ కచ్‌ వద్ద గల ‘ద్వారక’

54. గ్రిడ్‌ సహాయంతో ఏమి తెలుసుకోవచ్చు?
- ఒక ప్రదేశ కచ్చితమైన ఉనికి

55. అక్షాంశాలు ప్రధానంగా వేటిని తెలియజేస్తాయి?
- ఒక ప్రదేశ శీతోష్ణస్థితి, ఉనికి, భూమధ్య రేఖ నుంచి దూరం

56. ఛాయ, ప్రచ్ఛాయ అంటే ఏమిటి?
- చంద్రుడు / భూమి దట్టమైన నీడ

57. ఉపఛాయ/ పాక్షిక ఛాయ అంటే ఏమిటి?
- దట్టమైన నీడ చుట్టూ ఆవరించి ఉన్న పలుచని నీడ

58. సూర్యగ్రహణం ఏ పరిస్థితుల్లో ఏర్పడుతుంది?
- 1. అమావాస్య రోజున
2. సూర్యునికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డం వచ్చినపుడు
3. చంద్రుని ప్రచ్ఛాయ భూమిపై పడినపుడు
4. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రుజుమార్గంలోకి వచ్చినపుడు

59. చంద్రగ్రహణం ఏ పరిస్థితుల్లో ఏర్పడుతుంది?
-1. పౌర్ణమి రోజున 2. సూర్యుడికి , చంద్రుడికి మధ్య భూమి అడ్డం వచ్చినపుడు
3. చంద్రుడు, భూమి ప్రచ్ఛాయలోకి వచ్చినపుడు
4. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే రుజు మార్గంలోకి వచ్చినపుడు

60. ఏడాదిలో ఎన్ని గ్రణాలు ఏర్పడతాయి?
- 7

61. ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో గ్రహణాలు ఎందుకు ఏర్పడవు?
- భూ కక్ష్యకు చంద్ర కక్ష్య 5 డిగ్రీల ఎగువన ఉంటుంది. ఈ వ్యత్యాసం లేకుండా ఇవి
ఒకే రుజుమార్గంలోకి వచ్చినపుడు గ్రహణాలు ఏర్పడతాయి.

62. భూ భ్రమణ కాలం ఎంత?
- 23 గంటల 56 నిముషాల 4.09 సెకండ్లు

63. భూభ్రమణ వేగం?
- 1,610 కిమీ/గం

64. పగలు, రాత్రి ఎందుకు ఏర్పడతాయి?
- భూ భ్రమణం కారణంగా

65. సముద్ర ప్రవాహాలు, ప్రపంచ పవనాల దిశల్లో మార్పులు రావడానికి కారణం ఏమిటి?
- భూ భ్రమణ వేగం

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv