శిశువికాసం - పెదగోజి : ప్రజ్ఞా పరీక్షలు , సహజ సామర్థ్యం , వైఖరులు , అభిరుచులు అలవాట్లు
1. ప్రజ్ఞాలబ్ధి గణాంకాలు సాధారణంగా విద్యా విషయక సాధనతో ఈ విధమైన సంబంధమును ఏర్పరచుకుంటాయి.
1. పరిపూర్ణమైన
2. హెచ్చుగా
3. మధ్యస్థంగా
4. తక్కువ
2. సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్యగల సంబంధం
1. ధనాత్మక
2. ఋణాత్మక
3. నిర్దిష్ట సంబంధం లేదు
4. సగటు ప్రజ్ఞాలబ్ధికన్నా ఎక్కువ కలిగిన విద్యార్థులలో ధనాత్మక
3. సహజ సామర్థ్యమును ఈ విధంగా నిర్వచించవచ్చును.
1. క్రొత్తదనాన్ని పెంపొందించగల అంతర్గత సామర్థ్యం
2. ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను ఆర్జించకల అంతర్గత సామర్థ్యం
3. పరిసరాలతో సర్దుబాటు చేసుకునే అంతర్గత సామర్థ్యం
4. అమూర్త ఆలోచన చేయగల అంతర్గత సామర్థ్యం
4. విశ్వవిద్యాలయ అధికారులతో ఏర్పడిన విభేదాల వలన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లయితే విద్యార్ధులు యాజమాన్యంపై ప్రతికూల వైఖరి ఏర్పరచుకుంటారు. ఇది ఈ వైఖరి అంశము
1. అనుభవాలను సమైక్యపరచటము
2. ఆకస్మిక సంఘటనలు
3. అందుబాటులోని వైఖరులు స్వీకరించటము
4. అనుభవాలను బేధపరచటము
5. క్రింది వానిలో స్వత:సిద్ధము
1. అభిరుచి & వైఖరి
2. ప్రజ్ఞ & సహజ సామర్ధ్యము
3. వైఖరి & సహజ సామర్ధ్యము
4. అభిరుచి & సహజ సామర్ధ్యం & ప్రజ్ఞ
6.
TET & DSC లను విడిగా నిర్వహించడాన్ని DIET పూర్తిచేసిన రావ్య వ్యతిరేకించటము తన స్నేహితురాలు రూప సమర్ధించటము వైఖరిలోని ఈ అంశాన్ని సూచిస్తుంది.
1. దిశ
2. తీవ్రత
3. వ్యాప్తి
4. అవధి
7.
వైఖరులకు సంబంధించి క్రింది వానిలో అసత్య ప్రవచనము</br>ఎ. వైఖరులను వ్యక్తుల బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకొనగలము </br>బి. వైఖరులు వ్యక్తిలో విడిగా ఉండక అతని మానసిక శక్తులతో కలసి పనిచేస్తాయి. </br>సి. వైఖరులు మూర్తమైనవి</br> డి. వైఖరులు ఎలా ఏర్పడతాయో చెప్పలేము
1. సి & డి
2. ఎ, సి & డి
3. సి
4. డి
8.
సృజనాత్మక ప్రక్రియలోని ఈ దశలో వ్యవస్థీకరణము & పునర్ వ్యవస్థీకరణము ప్రక్రియ జరిగి సమస్య అంతర్గతంగా అచేతన స్థితికి మారును. ఇది ఈ సృజనాత్మక దశ
1. సన్నాహ దశ
2. గుప్తదశ
3. ప్రకాశం
4. నిరూపణ
9.
“ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు Smartphones ఆవశ్యకత” అను అంశము పట్ల అనుకూల, ప్రతికూల అభిప్రాయాలకు సంబంధించి అనేక ప్రవచనాలు
సేకరించి తరువాత అనుకూల స్థాయి నుండి ప్రతికూల స్థాయి వరకు తారతమ్యాలు ఉండే విధంగా అమర్చి మాపనం చేయు వైఖరి మాపని
1. గట్ మన్ సంచిత మాపని
2. లైకర్ట్స్ నిర్ధారణ మాపని
3. థరస్టన్ తుల్యప్రత్యక్షాల విరామాల మాపని
4. సాంఘిక అంతరాల మాపని
10.
ఒక విద్యార్ధికి ఆటలలో మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో అమితమైన
ఆసక్తి కలవు. ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎన్నుకొనుటకు ఆసక్తితో పాటు పరిగణలోనికి తీసుకోవలసిన అంశము
1. సహజ సామర్ధ్యము
2. ప్రజ్ఞ
3. తల్లిదండ్రుల ప్రోత్సాహము
4. ఆదాయము
11. సరి అయిన శిక్షణనిస్తే భవిష్యత్తులో ఉపాధ్యాయునిగా రాణించటానికి కావలసిన ప్రస్తుత లక్షణాలను గుర్తించటానికి ఉపయోగించిన సాధనము
1. అభిరుచి శోధిక
2. వైఖరి మాపని
3. సహజ సామర్థ్య పరీక్ష
4. సాధనా పరీక్ష
12.
ఒక సమస్యకు అసాధారణమైన & విశేషమైన పరిష్కారమిచ్చే సృజనాత్మక సామర్థ్యము
1. విస్తృతి
2. వాస్తవికత
3. ధారాళత
4. నమ్యత
13. క్రియాత్మక లేదా భాషణా నైపుణ్యాలలో పనులను చేసే పద్ధతులలో లేదా
ఆలోచనా విధానాలలో నేర్చుకున్న ప్రవర్తనలు పునరావృతం కావటాన్ని ఇలా పిలుస్తారు.
1. ప్రజ్ఞ
2. సృజనాత్మకత
3. సహజ సామర్థ్యం
4. అలవాటు
14. రాజు యొక్క చేతులు, వేళ్ళు మొత్తం కదలికలలో సహజ సామర్థ్యాన్ని మీరు | మదింపు చేయాలనుకున్నారు. దీనికోసం తగిన ఉపకరణం.
1. గుడ్ ఎనఫ్ డ్రాయింగ్ పరీక్ష
2. పరడ్యూ పెగ్ బోర్డ్ పరీక్ష
3. రేవన్స్ ప్రోగ్రసివ్ మాట్రిసిస్ పరీక్ష
4. పింట్నర్ - పాటర్ సన్ స్కేలు
15. ఒక నిర్ణీత సమయములో ఎన్ని సాధ్యమయితే అన్ని గుండ్రని ఆకారముకల వస్తువుల పేర్లు చెప్పమని కుమార్, సిరిని ప్రశ్నించాడు. దీని ద్వారా పెంపొందించాలనుకుంది.
1. సమైక్య ఆలోచన
2. నిర్ణాయాత్మక ఆలోచన
3. విభిన్న ఆలోచన
4. సమాంతర ఆలోచన
16. గిల్ ఫర్డ్ ప్రకారం సృజనాత్మకత 3 మితులలో ధారాళత, నమ్యత అయిన మూడవది.
1. వాస్తవికత
2. నూతనత్వం
3. మేధోమధనం
4. అన్వయం
17. ఎ. అనేక సాధ్యపడే పరిష్కారాలను ఉత్పాదనలు చేయుట ద్వారా ప్రత్యామ్నాయం సమూహాలను విస్తృతపరచే ప్రయత్నం ఈ రకం ఆలోచనలో జరుగును. </br>బి. ఒకే జవాబును నిర్ణయించుటకు అనేకమైన ప్రత్యామ్నాయాలను కుదించుటకు ప్రయత్నించటము.
1. ఎ, & బి ఏకముఖ ఆలోచన
2. ఎ &బి బహుముఖ ఆలోచన
3. ఎ- ఏకముఖ ఆలోచన, బి- బహుముఖ ఆలోచన
4. ఎ- బహుముఖ ఆలోచన, బి - ఏకముఖ ఆలోచన
18.
వల్లాస్ & కాగన్లు రూపొందించిన, 'అసాధారణమైన ఉపయోగాలు కల అంశాలు' అను సృజనాత్మక పరీక్షను ఈ పాఠశాల విద్యార్ధులకు ఉపయోగించవచ్చును.
1. 1 నుండి 5 సం||
2. 6 నుండి 10 సం||
3. 6 నుండి 12 సం||
4. 6 నుండి 15 సం||
19. సృజనాత్మకత లక్షణాలకు చెందినవి
ఎ. సార్వత్రికమైనది బి. స్వతఃసిద్ధము & సంపాదితము సి. గమ్య నిర్దేశక సమైక్య ఆలోచన డి. ఒక ప్రక్రియ, కాని ఉత్పత్తికాదు
1. బి, సి & డి
2. సి & డి
3. ఎ, బి, సి & డి
4. ఎ & బి
20. క్రింది వానిలో సరి అయినది కానిది
ఎ. 'దూరసాంగత్యం' అనునది సృజనాత్మక పరీక్ష బి. 'పర్ డ్యూ పెగ్ బోర్డ్' కళాసంబంధ సహజ సామర్ధ పరీక్ష సి. 'సంకలన మాపని' అనునది వైఖరి పరీక్ష
1. ఎ, బి & సి
2. ఎ&బి
3. సి& బి
4. బి
21. క్రింది వానిలో మిగతా వాటితో సంబంధం లేనిది
1. సహజ సామర్థ్యం పరీక్ష
2. మూర్తిమత్వ పరీక్ష
3. ప్రజ్ఞా పరీక్ష
4. సాధనా పరీక్ష
22.
సౌజన్య & మురళి ఒకే మార్కులతో DSC లో ఉద్యోగాన్ని సాధించి ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. అయినప్పటికీ మురళి ఉపాధ్యాయ వృత్తిలో సౌజన్యకన్నా బాగా రాణించటము దీనికి కల ప్రధాన కారణము అతని యొక్క
1. ప్రజ్ఞ
2. సహజ సామర్థ్యం
3. అభిరుచి
4. వైఖరి
23. ఎ. సరయు ఎవరి ప్రోద్బలం లేకుండా తనంతట తానుగా యోగా క్లాసులకు హాజరవటము బి. సిరి తన స్నేహితులకంటే వేగంగా యోగాసనాలు నేర్చుకోగలగటము సి. సిద్ధార్ద నారాయణ్ ప్రతిరోజు నిద్ర లేవగానే యోగా చేయటము డి. హస్వితేజ్ యోగాసనాలు ఆరోగ్యానికి ఎంత మేలుచేస్తాయని భావించటము. లు వరుసగా
1. అభిరుచి -అలవాటు - సహజ సామర్థ్యం - వైఖరి
2. అలవాటు - సహజ సామర్థ్యం - అభిరుచి - వైఖరి
3. అభిరుచి - ప్రజ్ఞ - అలవాటు - వైఖరి
4. అభిరుచి - సహజ సామర్థ్యం - అలవాటు - వైఖరి
24.
విద్యార్ధి నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉద్దేశించిన నికష
1. అభిరుచి పరీక్ష
2. సహజ సామర్థ్య పరీక్ష
3. సాధనా పరీక్ష
4. ప్రజ్ఞా పరీక్ష
25.
రాజు కరోనాకు సంబంధించిన విషయాలను త్వరగా గ్రహించగలగటము రవి కరోనాకు సంబంధించి 'ఆటవెలది'లో శతక పద్యాలు వ్రాయటము లలోని సామర్థ్యాలు వరుసగా రవి & రాజు
1. ప్రజ్ఞ & సృజనాత్మకత
2. సృజనాత్మకత & ప్రజ్ఞ
3. ప్రజ్ఞ & వైఖరి
4. సహజ సామర్ధ్యం & సృజనాత్మకత
26.
విద్యార్ధిపట్ల ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని పట్ల విద్యార్ధి ఏర్పరచుకున్న వైఖరి ఆల్ఫోర్ట్ స్టేంజర్లు పేర్కొన్న ఈ వైఖరి రకానికి చెందును.
1. అనుభవాలను సమైక్య పరచటం
2. అనుభవాలను భేదపరచటము
3. ఆకస్మిక సంఘటనలు
4. అందుబాటులోకల వైఖరులు స్వీకరించటము
27.రామ్ అను ఉపాధ్యాయుడు తన బోధన ద్వారా తరగతి విద్యార్ధులలో దేశము పట్ల గొప్ప భావనను ఏర్పరచిన అది ఈ మనోవైజ్ఞానిక భావనను సూచిస్తుంది.
1. అభిరుచి
2. వికాసం -
3. వైఖరి
4. ప్రజ్ఞ
28.
జిల్లా విద్యాధికారి ఒక్కో నెలను ఒక్కో సబ్జెక్టుగా పేర్కొంటూ ఆయా నెలలలో ఆయా సబ్జెక్టుల మాస ఉత్సవాలను నిర్వహిస్తూ ఆ సబ్జెక్టుకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆయా సబ్జెక్టులు నేర్చుకొనుటకు వనరులను అందుబాటులో ఉండేలా చేయటము వలన ఆ సబ్జెక్టులలో పిల్లలలో ఈ మనోవైజ్ఞానిక భావనకు కృషి చేసినట్లు.
1. ప్రజ్ఞ
2. సహజ సామర్థ్యం
3. అభిరుచి
4. ప్రతికూల వైఖరి
29. ఈనాడు వార్తా పత్రిక కార్టూనిస్ట్ శ్రీధర్ సమకాలీన అంశముపై కార్టూన్ గీయాలనుకున్నప్పుడు ఆ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించుటకు వార్తలను వినటము ఇంటర్నెట్ ద్వారా ప్రస్తుత విషయాలను గ్రహించటము అనునవి సృజనాత్మక ప్రక్రియలోని ఈ దశని సూచించును.
1. గుప్తస్థితి
2. సన్నాహము
3. నిరూపణము
4. అంతర దృష్టి
30.
WISC ఈ ప్రజాసిద్ధాంతము ఆధారంగా రూపొందంచబడినది.
1. ఏకకారక సిద్ధాంతము
2. ద్వికారక సిద్ధాంతము
3. సామూహిక కారక సిద్ధాంతము
4. బహుకారక సిద్ధాంతము
31.
వ్యక్తుల మానసికసామర్థ్య శ్రేణులు, వయసు, విద్య, జాతీయత, సంస్కృతి
మొదలైన అంశాలకు అతీతంగా అందరూ ఉపయోగించేవిధంగా రూపొందించిన ప్రజా పరీక్ష
1. DATB
2. GMAT
3. WISC
4. రావన్స్ స్టాండర్డ్ ప్రొగ్రెసివ్ మాట్రసిస్టెస్ట్
32. థర్స్టన్ ప్రాధమిక మానసిక శక్తుల ప్రజాసిద్ధాంతము ఆధారంగా తయారు చేయబడిన సహజసామర్థ్య పరీక్ష
1. GATB
2. DATB
3. మెట్రోపాలిటన్ రెడినస్ టెస్ట్
4. మెయిర్-సీషోర్ ఆర్ట్ మెంట్ టెస్ట్
33.
ఒకానొక పరిస్థితికి, వ్యక్తి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించటానికి కల సంసిద్ధత అనునది అతని
1. అభిరుచి
2. సహజసామర్థ్యం
3. వైఖరి
4. సృజనాత్మకత
34.
DATB ఒక ఎ. విద్యావిషయక సహజ సామర్థ్య పరీక్ష బి. వృత్తిపర సహజసామర్థ్య పరీక్ష సి. కళాసంబంధ సహజ సామర్థ్య పరీక్ష
1. ఎ&బి
2. బి & సి
3. సి & ఎ
4. ఎ, బి & సి
35. సరయు ఏవిధమైన శిక్షణ లేకుండానే సమర్ధవంతంగా చిత్రాలు గీయగలదు. కారణం ఆ విద్యార్ధి యొక్క
1. వైఖరి
2. సహజసామర్థ్యం
3. అభిరుచి
4. అనుభవం
36.
ఒక వ్యక్తిని లక్ష్యంవైపు సుస్థిరంగా నడిపే ప్రేరణను ఇలా పిలుస్తారు.
1. అభిరుచి
2. వైఖరి
3. ఆత్మభావన
4. విలువలు
37. ఒకవ్యక్తి ఏ పనిలోనైనా, వృత్తిలోనైనా రాణించాలంటే కావలసినవి
1. అభిరుచి & వైఖరి
2. వైఖరి & సృజనాత్మకత
3. సహజసామర్థ్యం & అభిరుచి
4. అభ్యసనం & పరిపక్వత
38. DAT యొక్క ఉప పరీక్షలలోలేనిది
1. శాబ్దిక వివేచనం
2. వస్తుసమాఖ్య
3. స్థానసంబంధం
4. అమూర్త వివేచన
39. GATB కి సంబంధించి సరికానిది</br></br>ఎ. GATB లోని సామర్ధ్యాల సంఖ్య 8 </br>బి. GATB లో 8 వ్రాతపూర్వకమైన 4 పరికరాల సహాయంతో జరిపే పరీక్షలు కలవు</br> సి. GATB ని నిర్వహించటానికి పట్టు సమయం 2 1/2 గంటలు</br> డి. GATB ని అమెరికన్ మనోవిజ్ఞాన సంస్థవారు రూపొందించారు.
1. ఎ & డి & సి
2. ఎ, సి & డి
3. సి & డి
4. ఎ &డి
40. ఎ. బహుళ అభిరుచుల నికషా తోరణం
బి. అత్యుత్తమ సహజసామర్ధ్య నికషా తోరణం
1. ఎ & బి - DATB
2. ఎ & బి - GATB
3. ఎ - DATB & బి - GATB
4. ఎ - GATB & బి - DATB
41.
"స్టెన్ క్విస్ట్ పరీక్ష" ఒక
1. విద్యాసంబంధ సహజసామర్థ్య పరీక్ష
2. యాంత్రిక సంబంధ సహజ సామర్థ్య పరీక్ష
3. గుమస్తా సంబంధిత సహజ సామర్థ్య పరీక్ష
4. కళా సంబంధ సహజ సామర్ధ్వ పరీక్ష
42. "సాధారణ సహజసామర్థ్య పరీక్షమాల"లోని ఉప పరీక్షకు చెందినది
</br>ఎ. ప్రత్యక్ష సామర్థ్యం</br> బి. సాధారణ వివేచనా సామర్థ్యం </br>సి. చలన సమన్వయం </br>డి. చేతి నైపుణ్యం </br>ఇ. శాబ్ధిక సామర్థ్యం
1. ఎ, బి, సి, డి & ఇ
2. బి, డి & ఇ
3. ఇ
4. బి, సి, డి & ఇ
43. ఒక ప్రాధమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పిల్లల ప్రజ్ఞను అంచనా
వేయటానికి తరగతి పిల్లలందరిని ఒక చిత్రం గీయమని తెలిపి 51 అంశాలతో కూడిన నియమాల ఆధారంగా పిల్లల ప్రజ్ఞను అంచనా వేశారు. అయిన ఆ ఉపాధ్యాయుడు ఎన్నుకొన్న పరీక్ష మరియు దానిని రూపొందించినది.
1. WISC - విప్లర్
2. GMAT - శ్రీవాత్సవ్ & కిరణ్ సక్సేనా
3. డ్రా-ఎ-పర్సన్ టెస్ట్ - ఫ్లోరెన్స్ గుడ్ ఇనఫ్
4. బీనే - సైమన్ ప్రజ్ఞామాపని - బీనే & సైమన్
44. నిరక్షరాస్యుల ప్రజ్ఞను సామూహికంగా మాపనం చేయడానికి తోడ్పడు
ప్రజ్ఞా పరీక్ష</br>ఎ. ఆర్మీ బీటా పరీక్ష</br>బి. రావన్స్ స్టాండర్డ్ పరీక్ష </br>సి. భాటియా ప్రజ్ఞామాపని</br> డి. డ్రా - ఎ పర్సన్ టెస్ట్
1. బి & సి
2. ఎ, బి, సి & డి
3. ఎ, బి & డి
4. ఎ & డి
45. 7వ తరగతి కార్తీక్ కు ఏ రంగంలో సహజ సామర్థ్యం కలదో తెలుపునది
1. అభిరుచి
2. వైఖరి
3. వ్యక్తృంతర్గత వైయుక్తిక బేధం
4. వ్యక్త్యంతర వైయుక్తిక బేధం
46. క్రింది వానిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష
1. అంగుళీ నైపుణ్య పరీక్ష
2. మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్
3. బిన్నెట్ టెస్ట్ ఆఫ్ మెకానికల్ కాంప్రహెన్షన్
4. TAT
47.
DAT వీరికోసం రూపొందించబడినది
1. 1-5 తరగతులు
2. 8-12 తరగతులు
3. వయోజనులు
4. 2&3
48.
సృజనాత్మక ప్రక్రియలో ఈ దశలోనే వ్యక్తిలో అంతర్గత ప్రేరణ పెంపొందును
1. సన్నాహం
2. భావోత్పత్తి
3. సంకేతం
4. అంతర దృష్టి
49. “బ్రూనర్ కాన్సెప్ట్ అటెయిన్ మెంట్ మోడల్” ద్వారా దీనిని మాపనం
చేయవచ్చు
1. సృజనాత్మకత
2. సహజ సామర్థ్యం
3. అభిరుచి
4. వైఖరి
50. డిజిటల్ బోధనపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవటానికి ఒక ఉపాధ్యాయుడు 5 పాయింట్ల స్కేలును రూపొందించాడు. ఆ ఉపాధ్యాయుడు రూపొందించిన విధానం
1. పరిశీలనా పత్రం
2. ప్రశ్నావళి
3. చె లిస్ట్
4. నిర్ధారణ మాపని
51.
టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని మాపనం చేయటానికి నిర్దేశించారు.
1. విద్యా విషయక
2. సౌందర్య కళా సంబంధ
3. వృత్తి సంబంధ
4. వ్యక్యంతర సంబంధ
52.
శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష </br>ఎ. WISC</br> బి. GMAT
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ &బి
4. ఎ కాదు & బి కాదు
53. WISC లోని శాబ్ధక ఉప పరీక్షకు చెందనిది </br>ఎ. అంకగణితం
</br>బి. సాదృశ్యాలు </br>సి. అంకె చిహ్న పరీక్ష</br>డి. వర్గీకరణ
1. సి &డి
2. సి
3. డి
4. బి, సి & డి
54.
క్రింది వానిలో వ్యక్తులు ఇచ్చే ప్రతిస్పందనల ఆధారంగా ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం
1. వ్యక్తిగత - సామూహిక పరీక్షలు
2.
శాబ్ధక - అశాబ్దిక పరీక్షలు
3. శక్తి - వేగ పరీక్షలు
4. పేపర్ పెన్సిల్ - నిష్పాదన పరీక్ష
55.
గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనది.
1. ధారాళత
2. అనమ్యత
3. సహజత్వం
4. పునర్నిర్వచనము
56. కరోనా వ్యాప్తి నివారణకు మాస్క్ ల ప్రాధాన్యత పెరగటముతో ఒక వ్యాపారి
ప్రజలను ఆకర్షించేందుకు విభిన్న డిజైన్లతో కూడిన మాస్క్ లను రూపొందించటములో ఉపయోగపడిన అతని సామర్థ్యం
1. అభిరుచి
2. వైఖరి
3. సృజనాత్మకత
4. సహజసామర్థ్యం
57. క్రింది వానిలో విషయగతంగా, నిర్వహణపరంగా, ప్రతిస్పందన ఆధారంగా కాలపరిమితి ఆధారంగా ఒకేరకంగా ఉండు ప్రజాపరీక్షలు </br>ఎ. డ్రా-ఎ-పర్సన్ టెస్ట్</br> బి. ఆర్మీబీటా పరీక్ష</br> సి. రావన్స్ స్టాండర్డ్ ప్రొగ్రెసివ్ పరీక్ష
1.
సి & ఎ
2.
.
ఎ &బి
3. బి & సి
4. ఎ, బి &సి
58.
ఉద్వేగాత్మక ప్రజ్ఞను మాపనం చేయటానికి వీరు రూపొందించిన పరీక్ష అందుబాటులో కలదు
1. సలోనే & మేయర్
2. గోలమన్
3. గుట్జల్ & జాక్సన్
4. టోరన్స్
59.
WISC ఆధారంగా స్పియర్మన్ ప్రతిపాదించిన ఈ కారకాన్ని మాపనం చేయవచ్చును.
1. G - కారకము
2. G & S కారకము
3. S - కారకము
4. G కారకము కాదు & S కారకము కాదు
60. సాధారణంగా పిల్లల మానసిక వికాసాన్ని మదింపు చేయటానికి వీటిని ఉపయోగిస్తాము
1. ప్రజ్ఞా పరీక్షలు
2. వికాస పట్టికలు
3. అభివృద్ధి పట్టికలు
4. విద్యా - మానసిక పట్టికలు
61. సృజనాత్మక మరియు క్రింది వానిలో ఒక అంశానికి అధికమైన సహసంబంధం కలదు
2. శారీరక ఆకృతి
3. హాస్యం
4. కాఠిన్య స్వభావం
62. ఒక ఉపాధ్యాయుడు తన బోధనా వ్యూహాలను రచించుటలో ఏ విధమైన పరీక్షలు ఎక్కువగా ఉపయోగపడును
1. సాంఘిక పరీక్షలు
2. మూర్తిమత్వ పరీక్షలు
3. సృజనాత్మక పరీక్షలు
4. ప్రజ్ఞా పరీక్షలు
63.
విద్యా సంబంధిత మార్గదర్శకత్వం అందించుటలో వ్యక్తిలోని వ్యక్త్యంతర సహజ సామర్ధ్యాల విబేధాలను అంచనావేయుటలో తోడ్పడునది.
1. Scholastic Aptitude Test
2. Differential Aptitude Test
3. Vocational Aptitude Test
4. Interest Inventories |
64. ఏదైనా ఒక నైపుణ్యం సముపార్జించటానికి ఒక వ్యక్తికి కల సామర్థ్యం తప్పనిసరిగా ఆ సంబంధిత కృత్యాలను ప్రస్తుతం అతను ఎంత బాగా నిర్వహిస్తున్నాడనే దానితో సంబంధం లేని పరీక్ష
1. ప్రజ్ఞా పరీక్ష
2. సహజ సామర్థ్య పరీక్ష
3. వైఖరి పరీక్ష
4. అభిరుచి పరీక్ష
65.
ప్రాగుక్తీకరణ మరియు అనుగుణ్యతా సామర్థ్యము అనునవి వరసగా ఈ మనోవైజ్ఞానిక భావనలను సూచించును
1. ప్రజ్ఞ & సహజ సామర్థ్యం
2. సహజ సామర్ధ్యం & సృజనాత్మకత
3. సృజనాత్మకత & సహజ సామర్థ్యం
3.
సహజ సామర్థ్యం & ప్రజ్ఞ
4.
66.
క్రింది వానిలో వ్యక్తిగత వేగ పరీక్ష</br>ఎ. భాటియా ప్రజ్ఞామాపని</br>
బి. పింట్నర్ పాటర్ సన్
1. ఎ & బి
2. ఎ
3. బి
4. ఎ కాదు & బి కాదు
67. క్రింది వానిలో భిన్నమైనది
1. సంపూర్ణంగా లేదా పాక్షికంగా క్రొత్త గుర్తింపును ఉత్పత్తి చేయటము
2. ఒక క్రొత్త ఊహనుగాని, వస్తువును కాని ఉత్పత్తి చేసే ప్రక్రియ
3. ఆలోచనలలో క్రొత్త సంబంధాన్ని చూసి వెంటనే వ్యక్తీకరించటము
5. భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన
68. పాల్ టోరన్స్ రూపొందించిన Minnesota Test of Creative Thinking
లోని పరీక్షల సంఖ్య |
1. 7
2. 8
3. 10
4. 12
69.
అభిరుచులను తెలుసుకొను విధానానికి సంబంధించి సరి అయినది</br>
ఎ. పిల్లవాడు తనకు గణితము అనగా ఇష్టము అని తెలుపటము </br>బి.
పిల్లవాడు అధిక సమయాన్ని లెక్కలు చేయటానికి కేటాయించటము వలన తనకు గణితమంటే ఇష్టము అని గ్రహించటము
1. ఎ - ప్రకటిత అభిరుచి & బి - వ్యక్త అభిరుచి
2. ఎ - వ్యక్త అభిరుచి & బి - ప్రకటిత అభిరుచి
3. ఎ & బి - ప్రకటిత అభిరుచి
4. ఎ &బి - వ్యక్త అభిరుచి
70.
క్రింది వానిలో వైఖరులు ఏర్పడటానికి ఆధారం కానిది
1. అనుభవాలను సమైక్య పరచుటం
2. అనుభవాలను బేధ పరచటము
3. ఆకస్మిక సంఘటనలు
4. అందుబాటులో కల వైఖరులను తిరస్కరించటము
71. సహజసామర్థ్య పరీక్షలు వీటిని సూచిస్తాయి.
1. ప్రస్తుత నిష్పాదన ఆధారంగా ప్రస్తుత సాధనము
2. ప్రస్తుత సాధన ఆధారంగా ప్రస్తుత నిష్పాదన
3. ప్రస్తుత సాధన ఆధారంగా గత నిష్టాదన
4. ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్తు సాధన
72. క్రింది వానిలో సామూహిక & వేగ పరీక్షలు</br>ఎ. ఆర్మీ & ఆల్ఫా పరీక్ష బి. ఆర్మీ బీటా పరీక్ష సి. ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష
1. ఎ &బి
2. బి & సి
3. సి & ఎ
4. ఎ, బి &సి
73.
ప్రజ్ఞాలబ్ది ఇంతకంటే తక్కువ కలవారిని బుద్ధిమాంద్యులుగా పేర్కొంటాము
1. 29 కంటే తక్కువ
2. 50 కంటే తక్కువ
3. 70 కంటే తక్కువ
4. 90 కంటే తక్కువ
74.
"ప్రాధమిక విద్యాస్థాయి మాంద్యత కలవారి ప్రజ్ఞాలబ్ధి క్రింది విధంగా ఉంటుంది.
1. 30 -
49
2. 50 - 69
3. 70 - 89
4. 90 - 109
75.
ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులలో అభ్యసనం పట్ల అభిరుచి
1. ఏకరీతిగా అలవరచ వచ్చును
2. అలవరచవచ్చును
3. అలవరచలేము ఎందుకంటే అప్పటికే వారు ఎదిగినవారు కనుక
4. స్థిరంగా ఉంటుంది
76.
అభిరుచులను మాపనము చేయు పరీక్ష
1. బీనే - సైమన్ పరీక్ష
2. లైక నిర్ధారణ మాపని
3. క్యూడర్ ఆక్యుపేషనల్ పరీక్ష
4. DATB
77. విద్యార్ధుల వైఖరులలో ఆశించిన మార్పులు తేవటం విద్యా లక్ష్యాలు అని
అంటే మనం ఏ రకమైన ప్రవర్తనలో ఆశించిన మార్పును తెచ్చే లక్ష్యం కలిగి ఉన్నట్లు
1. జ్ఞానాత్మక
2. భావావేశ
3. మానసిక చలనాత్మక
4. సంజ్ఞానాత్మక
78. క్రింది వానిలో శక్తి పరీక్ష
ఎ. పింట్నర్ పాటర్ సన్ టెస్ట్ బి. రావన్స్ ప్రోగ్రెసివ్ మాటసిస్ టెస్ట్ సి. భాటియా ప్రజ్ఞామాపని
1. ఎ &బి
2. బి & సి
3. సి & ఎ
4. ఎ, బి &సి
79. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయి ఆంగ్లమాద్యమ పాఠశాలలుగా మార్చుటపట్ల '5' ఐచ్చికాల స్కేలు ఆధారంగా ఉపాధ్యాయుల అభిప్రాయము తెలుసుకొనుటకు ఉపయోగపడునది.
1. తుల్యనా ప్రత్యక్షాల విరామాల మాపని
2. సంచిత మాపని
3. లైక మాపని
4. సాంఘిక అంతరాల మాపని
80. అందుబాటులోని వనరులతో స్టెతస్కోప్ తయారు చేయాలనుకున్న శ్రావణికి ఈ విధంగా తయారు చేయవచ్చు అను ఆలోచన తటాలున ఏర్పడినది. ఇది సృజనాత్మక ప్రక్రియలోని ఈ దశను సూచించును
1. సన్నాహము
2. గుప్తస్థితి
3. నిరూపణము
4. అంతరదృష్టి
81. క్రింది వానిలో సృజనాత్మకతను పెంపొందించటానికి అంతగా తోడ్పడనివి
</br>ఎ. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు </br>బి. బ్రెయిన్ స్టార్మింగ్
</br>సి. స్వేచ్ఛాపూరిత వాతావరణం </br>డి. విద్యార్ధుల భావాలు సరి అయినవి అయితేనే ప్రోత్సహించటము
1. ఎ, బి & డి
2. బి, సి & డి
3. ఎ &డి
4. బి & సి
82. ప్రాధమిక పాఠశాలలో ఆంగ్లం సరిగా బోధించకపోవటము వలన ఆంగ్లము క్లిష్టమైన సబ్జెక్ట్ అని భావించే విద్యార్ధి ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు బాగా బోధించటము వలన సరియైన బోధన లభిస్తే ఆంగ్లము నేర్చుకొనుటము సులభం అని గ్రహించిన ఆ విద్యార్ధిలో ఈ అంశములో మార్పు కలిగినది.
1. అభిరుచిలో మార్పు
2. వైఖరిలో మార్పు
3. సహజ సామర్థ్యంలో మార్పు
4. ప్రజ్ఞలో మార్పు
83.
సృజనాత్మక ప్రక్రియలోని సోపానాల వరుస క్రమము
1. సన్నాహము - గుప్తస్థితి - భావోత్పత్తి - అంతర దృష్టి
2. సన్నాహం - నిరూపణ - గుప్తస్థితి - అంతరదృష్టి
3. సన్నాహం - గుప్తస్థితి - నిరూపణ - అంతర దృష్టి
4. సన్నాహం - గుప్తస్థితి - అంతరదృష్టి - నిరూపణ
84. </br>ఎ. ఒక విద్యార్ధి తనంతట తానుగా కరోనా బాధితులకు సహాయాన్నందిస్తూ ఆనందాన్ని పొందటము</br>బి. ఒక విద్యార్ధి లాక్ డౌన్ సమయంలో సేవలందిస్తున్న వైద్యులు, పోలీసుల పట్ల సదావనను ఏర్పరచుకోవటము</br>సి. ఒక విద్యార్ధి సినిమాపాటను కరోనాపై పేరడీ పాటగా వ్రాయటము వరుసగా
1. అభిరుచి, వైఖరి, సహజ సామర్ధ్వము
2. అలవాటు, వైఖరి, సృజనాత్మకత
3. అభిరుచి, వైఖరి, సృజనాత్మకత
4. అభిరుచి, ప్రజ్ఞ, సహజ సామర్థ్యం
85. రాజు తీరిక సమయాలలో డ్రాయింగ్ వేస్తూ గడుపుతున్నాడు. ఇది దీనిని సూచిస్తుంది.
1. అభిరుచి
2. సృజనాత్మకత
3. ప్రజ్ఞ
4. సహజ సామర్థ్యం
86. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతను వైఖరి అని పేర్కొన్నది.
1. ఫ్రీమన్
2. మెహ్రన్స్
3. కట్టే
4. సుజి
87.
క్రింది వానిలో ప్రత్యక్ష వైఖరి మాపనికి చెందనిది</br>ఎ. పరిపృచ్ఛ </br>బి. లైక వైఖరి మాపని </br>సి. సాంఘీక మితి
1.
ఎ & సి
2.
బి
3. ఎ
4. సి
88.
క్రింది వానిలో నిష్పాదన పరీక్షకు చెందనిది</br>ఎ. సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ పరీక్ష </br>బి. అలెగ్జాండర్ పాస్ లాంగ్ పరీక్ష </br>సి. ఫీచర్ ప్రొఫైల్ టెస్ట్ </br>డి. రావ స్టాండర్డ్ పరీక్షలు
1. ఎ& బి
2. బి & సి
3. సి
4. డి
89.
WISC లోని పరీక్షలు
1. 5 శాబ్ధిక & 5 అశాబ్దిక
2. 5 అశాబ్దిక & 6 శాబ్దక
3. 6 అశాబ్దిక & 5 శాబ్దిక
4. 6 శాబ్దిక & 6 అశాబ్దిక
90.
J.M.అహూజా ఈ సహజ సామర్థ్య పరీక్షను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పుచేసి రూపొందించారు.
1. DAT
2. GATB
3. MRT
4. థర్స్టన్ ప్రాధమిక మానసిక సామర్థ్యాల పరీక్ష
91.
ఒక పాఠశాల ఉపాధ్యాయునిగా సృజనాత్మకతను వీరిలో పెంపొందించే ప్రయత్నం చేస్తారు.
1. పిల్లలందరిలో
2. ఎక్కువ సాధనకల పిల్లలలో మాత్రమే
3. ప్రజ్ఞగల పిల్లలలో మాత్రమే
4. ప్రతిభావంతులలో మాత్రమే
92. కరోనావ్యాప్తి నివారణార్ధం లాక్ డౌన్ ప్రభావవంతంగా తోడ్పడును. దీనిని పొడిగించాలని ప్రధాని అభిప్రాయాన్ని నేను చాలా ధృఢంగా సమర్ధిస్తున్నాను. ఇది ఈ వైఖరి గణమును సూచిస్తుంది.
1. వ్యాప్తి
2. దిశ
3. తీవ్రత
4. స్వభావం
93.
'సమస్యలకు అతి త్వరగా స్పందించటం, వాస్తవికతను గమనించే సామర్థ్యం' అనునది ఈ సృజనాత్మక లక్షణాన్ని సూచించును.
1. ధారాళత
2. సమస్యలపట్ల సున్నితత్వం
3. పునర్నిర్వచనం
4. సహజత్వం
94. త్వరగా అభ్యసించగల సామర్థ్యాన్ని మరియు ఒక ప్రత్యేక రంగంలో అత్యున్నత సాఫల్యతా స్థాయిని చేరుకొనగలుగుటను ఇలా పిలుస్తారు.
1. సహజ సామర్థ్యం
2. ప్రజ్ఞ
3. సృజనాత్మకత
4. సాధన
95. ఒక పరీక్ష దేనిని మాపనం చేయాలో దానినే మాపనం చేస్తే అది కలిగియుండు లక్షణం
1. ప్రయోజనార్ధక పరీక్ష
2. సప్రమాణత
3. విశ్వసనీయత
4. ప్రత్యేక సామర్థ్యం
96.
మొదటిసారిగా పిల్లల రిక్రియేషన్ కు సంబంధించిన అభిరుచి ప్రశ్నావళిని తయారుచేసినవారు.
1. ఇ.ఎల్. థారన్ డైక్
2. జె. స్టాన్లీహాల్
3. జె.బి. చాప్లిన్
4. డబ్ల్యూసి. బా
97. అభిరుచి లక్షణానికి చెందనిది
1. అభిరుచులను లింగబేధాలు ప్రభావితం చేయును
2. అభిరుచులు మార్పు చెందుతాయి.
3. అభిరుచులు మూర్తమైనవి
4. అభిరుచులు సృజనాత్మకతను వెలికితీయటానికి సహకరిస్తాయి.
98. ప్రజా పరీక్షలు మాపనం చేయలేని ప్రజ్ఞ
1. సాంఘిక ప్రజ్ఞ
2. మూర్త ప్రజ్ఞ
3. అమూర్త ప్రజ్ఞ
4. యాంత్రిక ప్రజ్ఞ
99. బోడెన్ ప్రకారము సృజనాత్మక రకాలకు చెందనిది
1. సంయోగ సృజనాత్మకత
2. అన్వేషణాత్మక సృజనాత్మకత
3. రూపాంతర సృజనాత్మకత
4. వాస్తవిక సృజనాత్మకత
100. నూతన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యం బోడెన్ ప్రకారం
1. సంయోగ సృజనాత్మకత
2. అన్వేషణాత్మక సృజనాత్మకత
3. రూపాంతర సృజనాత్మకత
4. వాస్తవిక సృజనాత్మకత
1 | d |
2 | a |
3 | c |
4 | a |
5 | a |
6 | b |
7 | d |
8 | c |
9 | a |
10 | c |
11 | c |
12 | a |
13 | b |
14 | a |
15 | a |
16 | a |
17 | a |
18 | b |
19 | b |
20 | a |
21 | a |
22 | c |
23 | c |
24 | d |
25 | b |
26 | d |
27 | b |
28 | a |
29 | b |
30 | a |
31 | c |
32 | a |
33 | a |
34 | d |
35 | b |
36 | a |
37 | d |
38 | a |
39 | d |
40 | c |
41 | c |
42 | b |
43 | c |
44 | a |
45 | a |
46 | b |
47 | a |
48 | b |
49 | a |
50 | a |
51 | d |
52 | d |
53 | d |
54 | c |
55 | d |
56 | d |
57 | d |
58 | b |
59 | c |
60 | b |
61 | c |
62 | d |
63 | a |
64 | c |
65 | d |
66 | b |
67 | c |
68 | c |
69 | b |
70 | b |
71 | b |
72 | d |
73 | b |
74 | c |
75 | c |
76 | a |
77 | d |
78 | a |
79 | b |
80 | a |
81 | a |
82 | a |
83 | a |
84 | b |
85 | c |
86 | a |
87 | d |
88 | a |
89 | d |
90 | c |
91 | c |
92 | c |
93 | b |
94 | b |
95 | b |
96 | b |
97 | d |
98 | c |
99 | a |
100 | a |
EmoticonEmoticon