✍️ *ప్రశ్న:* _మన భూమి తప్ప వేరే గ్రహాల మీద చెట్లను పెంచవచ్చా?_
*జవాబు:* భూమ్మీద కూడా బండరాళ్ల మీద, ఎడారుల్లో, అగ్ని పర్వతాల మీద మొక్కలను పెంచలేము. దీనర్థం ఏంటంటే చెట్లు లేదా ఏ జీవ జాతులు బతకాలన్నా తగిన విధంగా ఆ ప్రాంతాలు భౌతిక రసాయనిక పరిస్థితులు కలిగుండాలి. భూమ్మీద ఉండే ఉష్ణోగ్రత, వాతావరణం, నేల రసాయనిక సంఘటనం, సౌరకాంతి తీవ్రత అనువుగా ఉండడం వల్ల పొలాల్లో పంటలు, అడవుల్లో చెట్లు, మైదానాల్లో గడ్డి పెరుగుతున్నాయి. ఇంతగా జీవానికి, వృక్షాల పెరుగుదలకు అనువైన ప్రదేశాలు మన సౌర మండలంలో భూమి మినహా మరే చోటా లేవు. అందుకే సరాసరి ఇతర సౌరమండల గ్రహాల్లో చెట్లను పెంచలేము.
ఈ విశాల విశ్వంలో ఎక్కడోచోట తప్పకుండా భూమిలాంటి వాతావరణ పరిస్థితులు, నేల పరిస్థితులు ఉంటాయనీ అక్కడ కూడా జీవం ఉద్భవించే అవకాశాలు ఉంటాయనీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాంటి స్థావరాల ఉనికి కోసం అమెరికా వాళ్ల నాసా సంస్థ సెటి (SETI: Search for extra terrestrial intelligence) ఉపసంఘం ద్వారా అన్వేషణ సాగిస్తోంది. చంద్రోపరితలం, అంగారక ఉపరితలంపై ప్రత్యేకంగా హరిత గృహాల్ని నిర్మించి అక్కడే సరియైన పరిస్థితుల్ని కల్పిస్తే అక్కడ కొన్ని రకాల చెట్లను పెంచడం అసాధ్యం కాదు.
EmoticonEmoticon