కేంద్ర పరిధిలోని అన్ని ఉద్యోగాల నియామకానికి ఒకే పరీక్ష


*రాబోయే రోజుల్లో కేంద్ర పరిధిలోని అన్ని ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్ తెలిపారు..*

◆ఇందుకోసం నూతనంగా జాతీయ నియామక సంస్థ (ఎన్‌ఆర్‌ఏ)ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

*బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు..*

◆దీని ద్వారా నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని, ఉద్యోగ నియామకం, ఎంపిక ప్రక్రియ మరింత సులభతరం కానుందని మంత్రి పేర్కొన్నారు.

◆కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెజిటెడ్‌ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఉమ్మడి పరీక్షను ఎన్‌ఆర్‌ఏ నిర్వహిస్తుంది.

*ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి 20 సంస్థలు పనిచేస్తున్నాయి..*

◆ఇందులో మూడు సంస్థలు మాత్రమే ఉద్యోగ నియామకానికి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

◆ప్రస్తుత నిర్ణయంతో అన్ని సంస్థలకు కలిపి ఒకటే పరీక్ష కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహించనున్నట్లు తెలిపారు.

◆ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మూడేళ్ల పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

*సీఈటీని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్‌ పర్సనల్ (ఐబీపీఎస్) కోసం సీఈటీ తొలి దశ పరీక్షలు నిర్వహిస్తుంది..*

◆సీఈటీని డిగ్రీ, పన్నెండు, పది తరగతులు ఉత్తీర్ణులైన వారు దేశంలో ఎక్కడి నుంచైనా రాయవచ్చు.

◆దేశవ్యాప్తంగా 117 జిల్లాలో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.

◆ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌ఏ యువ ఉద్యోగార్థులకు వరంగా మారనుందని ప్రధాని మోదీ అన్నారు.

*అలానే సీఈటీ ద్వారా పలు రకాల పరీక్షలు రద్దవడంతో పాటు విలువైన సమయం, వనరులు ఆదా అవుతాయని ప్రధాని వెల్లడించారు..*

◆ప్రస్తుత విధివిదానాల ప్రకారమే రిజర్వేషన్లు అమలవుతాయని మంత్రి తెలిపారు.

◆అలానే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద జైపుర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను లీజుకు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

*దీని ద్వారా ఎయిర్‌పోర్ట అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ)కు రూ.1,070 కోట్లు సమకూరనున్నాయని జావడేకర్ తెలిపారు..*

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv