AP TET - PAPER I - PSYCHOLOGY : అభ్యసన సిద్ధాంతాలు - PRACTICE BITS

 

 AP TET - PAPER I - PSYCHOLOGY : అభ్యసన సిద్ధాంతాలు - PRACTICE BITS


 1. ఒక శిశువు పాలసీసాతో పాలు త్రాగే అలవాటు ఏర్పడిన శిశువు ఆకలితో ఉన్నప్పుడు పాలసీసాను

చూసిన వెంటనే లాలాజలం స్రవించడం ?

1) నిర్నిబంధిత ఉద్దీపన

2) నిర్నిబంధిత ప్రతిస్పందన

3) నిబంధిత ఉద్దీపన

 

4) నిబంధిత ప్రతిస్పందన

 2. వెన్నెల భోజనం ముగిసిన వెంటనే పాత్రలను తీయడంలో తల్లికి సహాయపడడం వల్ల తల్లి మెచ్చుకుంది. తర్వాత వెన్నెల ప్రతీరోజు ఇలాగే అమ్మకు ప్రతి పనిలోనూ సహాయ పడడం అలవాటు చేసుకుంది. ఇందులో స్కిన్నర్ అభిప్రాయంలో ప్రతిస్పందనగా దీనిని భావించవచ్చు ?

1) భోజనం అయిన వెంటనే పాత్రలు తీయడం

2) అమ్మ మెచ్చుకోవడం

 

3) సహాయపడడం అలవాటు చేసుకోవడం

 

 

4) వెన్నెల భోజనంను ముగించడం

 

 3. ఇవాన్ పావ్ లోవ్ తన శాస్త్రీయ నిబంధనలో గంటను ఆహారానికి జోడించడం వల్ల నిబంధనం ఏర్పడింది. జోడించడం ఎంత ఎక్కువగా ఉంటే అంత బలంగా నిబంధిత ప్రతిస్పందన ఏర్పడుతుంది. ఇలాంటి సంబంధాలను ఏమని పిలుస్తారు ?

 

1) సామాన్యీకరణం

2) విపులీకరణం

3) పునర్బలనం

 

4) విచక్షణ

 

 4. పాఠశాలలో విరామం ఇచ్చిన సమయాలలో విద్యార్థులు ఐస్ క్రీమ్ అమ్మేవాడిని గుర్తించుట సిద్ధాంతానికి అనుబంధ మయినదిగా చెప్పవచ్చు ?

 

1) శాస్త్రీయ నిబంధన

2) కార్యసాధక నిబంధన

3) యత్న-దోష అభ్యసనం

4) అంతర్ దృష్టి అభ్యసనం

 

 5. తరగతి గదిలో బోధనా అభ్యసన ప్రక్రియ యందు 'వీర శివాజీ' గురించి ఆలకించిన విద్యార్థి సైనికుడిగా చేరితే దీన్ని సూచిస్తుంది ?

1) పునర్బలనం

2) సామాన్యీకరణం

3) విచక్షణ

4) విరమణము

 

6.మనో విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వ్యక్తిగా ఎందువల్ల నిబంధిత ఉద్దీపనను, నిర్నిబంధిత ఉద్దీపన కంటే ముందు ఇస్తారు.

1) నిబంధిత ఉద్దీపన సరళమయినది

 

2) నిబంధిత ఉద్దీపన ప్రతిస్పందన కలుగచేస్తుంది

 

3) నిర్నిబంధిత ఉద్దీపన ప్రతిస్పందన కలుగచేస్తుంది

4) నిర్నిబంధిత ఉద్దీపన పునర్బలనం చేస్తుంది

 

 7. ఇవాన్ పాప్ లాప్ తన శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో అసహజ ఉద్దీపనకు, సహజ ఉద్దీపనల మధ్య పటిష్టమైన బంధంను కలుగచేయడానికి వాటి మధ్య ఏర్పాటైన కనీస కాలం ఎంత ?

1)  0.5 ని.

2) 5 సె.

3)  0.5 సె.

4) 5 ని.

 8. క్రింది వానిలో ఖచ్చితమైన సరి జతను గుర్తించుము ?

 1. సహజ ఉద్దీపన . లాలాజలం

 2. అసహజ ఉద్దీపన బి. ఆహారం

 3. అభ్యస్త ప్రతిస్పందన సి. గంట 

1) 1-, 2-బి, 3-సి

2) 1-, 2-సి, 3-బి

3) 1-బి, 2-సి, 3-

4) 1-సి, 2-బి, 3-

 

9. పాప్ లోవ్ తన పూర్వ విభాగంలో వ్యవస్థలపై అనేక ప్రయోగాలు జరపడం వల్ల నోబెల్ పురస్కారం పొంద గలిగారు?

 

1) శ్వాస వ్యవస్థ

2) జీర్ణ వ్యవస్థ

3) రక్త ప్రసరణ వ్యవస్థ

4) ప్రత్యుత్పత్తి వ్యవస్థ

 

 10. ఒక విద్యార్థి పద్య పటనం అభ్యసనం చేసినపుడు తోటి విద్యార్థులు హేళన చేయడం వలన విద్యార్థి పది మందిలో మాట్లాడడంలో భయపడడం మొదలు అయినది. ఇది సాంప్రదాయక నిబంధన ప్రకారం కొత్తగా వచ్చిన భయంను ఇలా పిలుస్తారు ?

 

1) నిర్నిబంధిత ఉద్దీపన

2) నిర్నిబంధిత ప్రతిస్పందన

3) నిబంధిత ఉద్దీపన

4) నిబంధిత ప్రతిస్పందన

 

 11. పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని శిక్షించడం వల్ల మిగతా విద్యార్థులు పాఠశాల పట్ల అభద్రతా భావాన్ని పెంచుకున్నారు. విధానాన్ని అభ్యసనంగా చెప్పవచ్చు?

 

1) సామాజిక అభ్యసనం

2) శాస్త్రీయ నిబంధన

3) పరిశీలనా అభ్యసనం

4) కార్యసాధక నిబంధన

 

 12. ఉపాధ్యాయుని చేత తీవ్ర దండనకు గురి అయిన విద్యార్థి ఉపాధ్యాయుల అందరి పట్ల భయాన్ని పెంపొందించుకుంటారు. దీన్ని దీనికి ఉదాహరణగా పిలుస్తాము ?

 

1) విచక్షణ

 

2) విరమణము

3) ఉన్నత క్రమ నిబంధన

4) సామాన్యీకరణం        

 

 13. విద్యార్థులు తరగతి గదిలో ఏదైనా కృత్యనిర్వహణలో చాలా చురుకుగా చైతన్య శీలిగా ఉంటూ అభ్యసన ప్రక్రియ జరిపిన ఇది సిద్ధాంతాన్ని ప్రతిభావిస్తుంది ?

 

1) శాస్త్రీయ నిబంధన

2) కార్యసాధక నిబంధన

3) అంతర్ దృష్టి అభ్యసనం

4) యత్న-దోష అభ్యసనం

 

 14. 'ఉద్గమాలు' నిర్లిప్తం అయిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడంలో ఆద్యుడు ?

 

1) పాప్ లావ్

2) స్కిన్నర్

 

3) ప్రస్సి

 

4) థార్న్ డైక్

 

 15. ఒక విద్యార్థి ఒక అంధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు తరగతిలో విద్యార్థిని మెచ్చుకున్నారు. మెప్పుతో ప్రేరేపితుడైన విద్యార్థి అలాంటి మంచి పనులను అలవాటు చేసుకున్నారు. ఇది సిద్ధాంతంతో పోల్చవచ్చును?

1) కార్యసాధక నిబంధన

 

2) సాంప్రదాయక నిబంధన

3) యత్న-దోష అభ్యసనం

 

4) అంతర్దృష్టి అభ్యసనం

 

 16. సాంప్రదాయక నిబంధన యందు రెండవ దశకు చెందిన సరియైన ప్రవచనం ?

 

1) అసహజ ఉద్దీపనకు సహజ ఉద్దీపన-సహజ ప్రతిస్పందన

2) సహజ ఉద్దీపనకు అసహజ ఉద్దీపన-అసహజ ప్రతిస్పందన

3) అసహజ ఉద్దీపనకు సహజ ఉద్దీపన-అసహజ ప్రతిస్పందన

 

4) సహజ ఉద్దీపనలకు-సహజ ప్రతిస్పందన

 

 17. శాస్త్రీయ నిబంధనలో ఉన్నత క్రమ నిబంధన యందు UCS గా భావించునది ?

1) ఆహారం

2) గంట

3) దీపం

 

4) లాలాజం

 

 18. నిబంధిత అభ్యసనంలో సహజ ఉద్దీపనకు - ప్రతిస్పందనతో పోల్చదగిన అంశం ? -

 

1) CS - CR

2) UCR - CR

3) UCS - UCR

4) CS - UCS

 19. చిన్న పిల్లలలో ఉన్న పక్కలు తడపడం - వేళ్ళను నోటిలో పెట్టుకోవడం లాంటి అలవాట్లను తొలగించడాని ఏర్పాటైన శాస్త్రయుక్తమైన సిద్ధాంతం దేశానికి చెందినది ?

1) అమెరికా

2) రష్యా

3) జర్మనీ

 

4) కెనడా

 20. వ్యక్తి ప్రవర్తనలో చలనాత్మక మరియు మానసిక సంబంధం అయిన మార్పులు దీనికి సంబంధించిన అవుతాయి ?

1) సహజ సిద్ధమైన పరిణితికి సంబంధించినది

2) వేరొక పరిస్థితి యొక్క ఒత్తిడికి సంబంధించినది

 

3) పరిపక్వతతో వచ్చిన మార్పులకు సంబంధించినది

4) పునర్బలనం చెందిన ఆచరణకు సంబంధించినది

 

 21. అభ్యసన సిద్ధాంతం నందు ఉద్దీపనల మధ్య సంబంధంను గమనించవచ్చు ?

1) శాస్త్రీయ నిబంధన

 

2) కార్యసాధక నిబంధన

3) యత్న-దోష అభ్యసనం

 

4) అంత దృష్టి అభ్యసనం

 

 22. నిబంధిత అభ్యసనం నందు సహజ-ఉద్దీపనకు ముందు అసహజ ఉద్దీపన కనపరచడం వల్ల ఏర్పడిన బంధం సహజ ప్రతిస్పందనకు కారణం అయితే దీన్ని ఎలా చెప్పవచ్చు ?

 

1) పునర్బలనం

2) విరమణ

3) ఉన్నత క్రమ నిబంధన

4) విచక్షణ

 

 23. నిబంధనను మనో విజ్ఞాన శాస్త్రంలో ప్రవేశపెట్టిన వారు ?

 

1) గెస్టాల్ట్ వాదులు

2) స్కిన్నర్ I I

3) థార్న్ డైక్

4) పాప్ లావ్

 24. ముందుగా సహజ ఉద్దీపన ఇచ్చు చర్యకు ఉదాహరణగా ప్రయోగాన్ని చెప్పవచ్చు ?

 

1) స్కిన్నర్ ప్రయోగం

2) వాట్సన్ ప్రయోగం

3) పాలౌవ్ ప్రయోగం

4) డ్రైవర్ విధానం

 25. అందరి నుంచి పొగడ్తలను, ప్రశంసలను మానసికంగా ఆశిస్తూ వ్యక్తి సంగీతం నేర్చుకుంటున్న ఇది ప్రేరణగా చెప్పవచ్చు ?

1) సహజ

2) బహిర్గత

3) సాధన

 

4) ఏదీకాదు

 26. కుటుంబ సభ్యులు ఎంత మంది ఉన్నా బాల్యదశలోని శిశువులు తమ తల్లి యొక్క తోడు కావాలని భావించిన ఇది అవసరంగా చెప్పవచ్చు ?

 

1) ప్రేమ

 

2) గుర్తింపు

3) ఆత్మ సాఫల్యత

4) రక్షణ

 27. ఒక అంశంను ఒక విద్యార్థి ముఖాభినయం చేయడం లాంటి కదలికల ద్వారా అభ్యసించినట్లు అయితే వీరు కోవకు చెందుతారు ?

1) శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు

 

2) శ్రవణ అభ్యాసకులు

3) దృశ్య అభ్యాసకులు

 

4) స్థిర అభ్యాసకులు

 28. దీనివలన విద్యార్థులలో ఆచరణ ఏర్పడి తద్వారా విద్యార్థులలో మార్పులు ఏర్పడి అభ్యసనం అలవడుతుంది?

1) పరిపక్వత

2) ప్రేరణ

 

3) వైఖరి

 

4) పునర్బలనం

 

 29. 'R-TYPE' నిబంధన ఎవరిది ?

1) వాట్సన్

2) పాన్తావ్

3) స్కిన్నర్

 

4) థార్న్ డైక్

 

 30. పాఠశాలలోని విద్యార్థులలో క్రమశిక్షణ అలవర్చడానికి దోహదపడే సిద్ధాంతం ఏది ?

1) శాస్త్రీయ నిబంధన

2) కార్యసాధక నిబంధన

3) యత్న-దోష అభ్యసనం

 

4) అంతర్ దృష్టి అభ్యసనం

 

31. బండూర పునర్బలనాన్ని ఎన్నిరకాలుగా విభజించారు ? .

 1.2

 2.3

 3. 4

 

 4.5

32. క్రిందివానిలో బండూర సూచించిన పునర్బలనం.

 1. స్వీయ పునర్బలనం

 2. ప్రత్యక్ష పునర్బలనం

 3. పరోక్ష పునర్బలనం

 4. పైవన్నీ

 

33. బండూర సూచించిన పునర్బలనాలలో తీవ్రమైనది.

 

 1. స్వీయ పునర్బలనం

 2. ప్రత్యక్ష పునర్బలనం

 3. పరోక్ష పునర్బలనం

 4. పైవన్నీ

 34. నిర్నిబందిత ఉద్దీపనకు, నిబంధిత ఉద్దీపన జోడించడం ద్వారా నిర్నిబంధిత ప్రతిస్పందన రావడాన్ని

 

 1. నిర్నిబందితం.

 2. నిబంధనము

 3. నిబంధిత ప్రతిస్పందన

 4. సహజ సిద్ధబంధం

35. గంటకు, ఆహారం చూపడానికి మధ్య సమయం ఎక్కువగా ఉంటే నిబంధనము

 1. పెరుగుతుంది

2. తగ్గుతుంది

 

 3. సమంగా ఉంటుంది

 4. చెప్పలేము

 36. గంటకు, ఆహారాన్ని పదేపదే జోడించడాన్ని .............

 

 1. పునస్మరణము

 2. పునరుద్ధరణ

 3. పునర్బలనము

 4. విరమణము

 

 37. శాస్త్రీయ నిబంధనలో ప్రయోగ జంతువు

 

 1. పిల్లి

 2. ఎలుక

 3. చింపాంజీ

 

 4. కుక్క

 

 38. .పి. పావ్ లోవ్.............

 

 1. మనోవిజ్ఞాన వేత్త

 2. శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు

 3. విజ్ఞానవేత్త

 4. సైంటిస్

 

 39. శాస్త్రీయ నిబంధన ఉపయోగంలో కుక్క ఆహారానికి లాలాజలం సృష్టించడం అనేది ?

1) సహజమైన ఉద్దీపన

 

2) సహజమైన ఉద్దీపన

3) సహజమైన ప్రతిస్పందన

 

4) కృత్రిమమైన ప్రతిస్పందన

 

 40. శాస్త్రీయ నిబంధనలో గంటకు లాలాజలం స్రవించడం అనేది?

1) సహజమైన ఉద్దీపన

 

2) సహజమైన ప్రతిస్పందన

3) కృత్రిమమైన ఉద్దీపన

 

4) కృత్రిమమైన ప్రతిస్పందన

 

 41. పునర్బలనము చెందిన ఆచరణ వల్ల ఏర్పడేది ?

1) సంసిద్ధత

2) అభ్యసనము

3) ప్రేరణ

 

4) పరిపక్వత

 

 42. నిబంధన చర్య తరువాత లాలాజలం స్రవించడం అనేది ?

1) నిర్నిబంధిత ఉద్దీపన

 

2) నిర్నిబంధిత ప్రతిస్పందన

3) నిబంధిత ఉద్దీపన

 

4) నిబంధిత ప్రతిస్పందన

 

 43. ఒక ఉద్దీపనకు అంతకు మందు లేనటువంటి ప్రక్రియను కృత్రిమంగా కల్పించడాన్ని ఏమంటారు ?

 

1) ఉన్నత క్రమబంధనం

2) నిర్నిబంధనం

3) నిబంధనం

4) నిర్నిబంధిత ఉద్దీపన

 

 44. నిబంధనం అనగా ?

 

1) ఆహారాన్ని చూడగానే లాలాజలం ఊరటం

2) ఆహారాన్ని గంటను కలిపి ఉపయోగించడం లాలాజలం ఊరటం ,

3) గంట శబ్దానికి లాలాజలం ఊరటం

 

4) ఆహారానికి లాలాజలం ఊరటం అనేది

 

 45. నిబంధనా సిద్ధాంతంలో గంట శబ్దానికి లాలాజలం ఊరటం అనేది ?

1) నిర్నిబంధిత ఉద్దీపన

 

2) నిర్నిబంధిత ప్రతిస్పందన

3) నిబంధిత ఉద్దీపన

 

4) నిబంధిత ప్రతిస్పందన

 

 46. గంట (నిబంధిత ఉద్దీపన) కొట్టిన తరువాత (నిర్నిబంధిత ఉద్దీపన) ఇవ్వడం అనేది రకమైన నిబంధనము

1) పురోగమన నిబంధనం

 

2) నిబంధన విరమణ

3) తిరోగమన నిబంధనం

 

4) నిబంధన సామాన్యీకరణము

 

 47. తిరోగమన నిబంధనం అనగా?

1) గంటకొట్టి ఆహారం ఇవ్వడం

 

2) గంటకు మందు ఆహారం ఇవ్వడం

3) గంట, ఆహారం ఒకేసారి ఇవ్వడము ,

 

4) ఏదీకాదు

 

 48. పాఠశాలలో నూతనంగా చేరినటువంటి గణిత ఉపాధ్యాయుడి గణిత ఉపాధ్యాయుడి పట్ల కొన్ని కారణాల వల్ల విద్యార్థులు భయాన్ని ఏర్పరచుకున్నారు. విద్యార్థులు పాఠశాల ప్రార్ధనా సమయంలోకి ఉపాధ్యాయుడు చేరుకోగానే ఒక్కసారిగా నిశబ్దంగా ఉండిపోవుటకు విధంగా చెప్పవచ్చు ?

1) పునర్బలనం

2) విరమణ

 

3) విచక్షణ

 

4) ఉన్నత క్రమ నిబంధన

 

 49. అభ్యసనా నియమాలలో ఫలిత నియమంపై ఆధారపడి నిరూపించబడ్డ సిద్ధాంతం ?

1) కార్యసాధక నిబంధన

 

2) పరిశీలనా అభ్యసనం

3) అంతర్ దృష్టి అభ్యసనం

 

4) యత్న-దోష అభ్యసనం

 50. కోహెలర్ యొక్క అంతర్ దృష్టి అభ్యసనానికి సంబంధించినది?

 

1) అవధాన-ఆలోచనల సమ్మేళనం ద్వారా పరిష్కారం

2) సమస్యా పరిష్కార ఆలోచన ఆకస్మికంగా మెరవడం

3) అవగాహన వినియోగ సామర్థ్యాలు పెంపొందుతాయి

4) పైవన్నియు అంతర్ దృష్టి అంశాలుగా భావించవచ్చు

 

Answers:




no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv