వెన్నెముకే కీలకం...

 వెన్నెముకే కీలకం...


*రోజురోజుకూ పెరుగుతున్న వెన్ను సమస్యలు*


*అశ్ర ద్ధ చేస్తే జీవితాంతం నరకమే..*

*చక్కని జీవన శైలి, సరైన జాగ్రత్తలు అవసరం*


*మనం ఏ పనిచేయాలన్నా శరీరం సహకరించాలి. అందుకు శరీరంలో ముఖ్యమైనది భాగం వెన్నెముక.. వంగాలన్నా, తిన్నగా నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, బరువులు ఎత్తాలన్నా... ఇలా ఏ పని చేయాలన్నా మన శరీరంలోని సమన్వయానికి వెన్నెముకే చాలా కీలకం. అయితే మారుతున్న జీవన శైలితో వెన్నెముకపై ఒత్తిడి పెరిగి రోజురోజుకూ బలహీనమవుతోంది. దీంతో నడుం నొప్పి, ఏ పనులూ చేసుకోలేని పరిస్థితి తలెత్తుతోంది. సరైన వ్యాయామం లేకపోవడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం కూడా ఇందుకు కారణమే..*

 

 *అదే పనిగా వాహనాలపై ప్రయాణించడం, గంటల కొద్దీ కంప్యూటర్లు ముందు క దలకుండా కూర్చోవడం, చక్కని జీవనశైలి పాటించకపోవడం వల్ల యుక్తవయస్సులోనే నడుం, వెన్నెముక నొప్పుల బారిన పడుతున్నారు.* బాధితుల్లో 65 నుంచి 70 శాతం మంది ద్విచక్ర వాహనాదారులే. ఐటీ రంగాల్లోనూ, మార్కెటింగ్‌లోనూ పనిచేస్తున్న వారు అధికంగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఎవర్ని పలకరించినా నడుము నొప్పో, మెడనొప్పో అనడం సాధారణమైపోయింది. శరీరానికి సరైన సౌష్టవాన్ని, ఆకృతినే కాకుండా నిటారుగా నిలిచేందుకు దోహదపడే వెన్నెముక డిస్క్‌ సమస్యలతో కుంగిపోతోంది.

 

*ఇవీ లక్షణాలు...*

మెడ నొప్పి తీవ్రంగా ఉండి చేతికి వ్యాపించడం, కాళ్లు, చేతులు, అరచేతులు తిమ్మిర్లు పట్టడం, నడుస్తుంటే చె ప్పులు జారడం, తొడభాగం నుంచి కింద కాలు మొత్తం నొప్పి రావడం, తూలడం, చేతిలో వస్తువులు జారిపోవడం, వెన్ను వంపుగా పెట్టడం, నడవడం, ఇలాంటి లక్షణాలు ఉంటే వెన్ను సమస్యలుగా భావించాలి. ఇలాంటి వారిలో ప్రతి వంద మందిలో 3 నుంచి నాలుగు మందికి వెన్ను, మెదడు ఆపరేషన్లు చేయాల్సి వస్తోంది.

 

*సమస్యలు చాలా వరకు నయం..*

వెన్నెముక వల్ల వచ్చే సమస్యలు చాలా వరకు నయమవుతాయి. కనీస అవగాహనతో వెన్నెముకపై భారం పడకుండా చూసుకోవాలి. తగిన రీతిలో కూర్చోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ప్రస్తుతం వెన్నెముక సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఎక్కవగా ఉంటోంది. చాలా సందర్భాల్లో వెన్నెముకపై శ్రద్ధ చూపకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఒకప్పుడు 40 నుంచి 60 ఏళ్ల వారికి వచ్చే ఈ వ్యాధి ప్రస్తుతం యువతనూ కలవరపెడుతోంది. పెద్దవారిలో ఐదు శాతం మంది తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు.

 

 *ప్రధాన కారణాలు...*

ప్రమాదవశాత్తు దెబ్బలు, వెన్నెపాము ట్యూమర్స్‌, వెన్ను పూసలు జారుట, వెన్ను పూసలకి క్షయ(టీబీ)సోకడం, డిస్క్‌ కొలాప్స్‌, ఎముకల్లో కాల్షియం తగ్గడం, గంటల కొద్దీ కంప్యూటర్‌ ముందు సపోర్ట్‌ లేకుండా కుర్చీల్లో కూర్చోవడం, అతి బరువులు మోయడం, పట్టడం, మలబద్ధకం, స్త్రీలలో గర్భకోశ వ్యాధులు వంటి లక్షణాలు కనిపిస్తే న్యూరో ఫిజీషియన్‌, న్యూరో సర్జన్‌, ఆర్థోస్పైనల్‌ సర్జన్‌, జనరల్‌ ఫిజీషియన్‌లకు సంప్రదించాలి. వారికి ఈ వ్యాధులపై పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి సరైన సలహాలు సూచనలు, చికిత్స తీసుకోవాలి.

 

*డిస్క్‌ కీలకం...*

వెన్ను ఎముకల మధ్యలో ఒక మెత్తని నిర్మాణాన్ని డిస్క్‌ అంటారు. ఎముకలకు ఇది కందెనగా ఉపయోగపడుతుంది. సాధారణంగా దీనిపై ఒత్తిడి ఎక్కువైనప్పుడు పక్కకు జారిపోతుంది. మెడదగ్గర డిస్క్‌ జారితే మెడనొప్పి, వెన్ను దగ్గరైతే వెన్ను నొప్పి వస్తుంది. నడుము దగ్గర డిస్క్‌ జారితే నడుము నొప్పి వస్తుంది. సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు ఎండోస్కోపిక్‌ డిసెక్టమీతో చికిత్స అందించవచ్చు.

 

*సరైన వ్యాయామం లేకే...*

ఒక వైపే బరువుపడే విధంగా కూర్చోవడం వల్ల ఆ భాగంలో డిస్క్‌లు తొందరగా దెబ్బతింటున్నాయి. సరైన వ్యాయామం లేక వెన్నెముక బలహీనమవుతోంది. రోజంతా కంప్యూటర్‌ ముందు పనిచేసినా, టీవీ చూసినా మెడ దగ్గర కండరాలు, డిస్క్‌లు ఒత్తిడికి గురవుతాయి. అందుకే మెడనొప్పి మొదలవుతుంది. సరైన విధంగా కూర్చోకపోవడం వల్ల నడుముపై ఒత్తిడి పడి డిస్క్‌లు జారిపోవడం, దెబ్బతినడంతో నడుము నొప్పులు వస్తున్నాయి.

 

*ఆధునిక వైద్య విధానాలు...*

వెన్నెముక వ్యాధులకు సంబంధించి వైద్య చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఎమ్మారై స్కానింగ్‌ ద్వారా పూర్తి స్థాయిలో వ్యాధిని నిర్థారించవచ్చు. మైక్రో సర్జరీ ద్వారా వెన్నెపూసలోని కణుతులు తొలగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. విరిగిన వెన్నుపూస స్థానంలో కృత్రిమంగా అమర్చి దీర్ఘకాలిక సమస్యలను సైతం పరిష్కరిస్తున్నారు.

 

*ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే...*

పని చేస్తున్న వారిలో 50 శాతం మంది ఏదో ఒక సమయంలో దీని బారిన పడుతున్న వారే.

బరువులు ఎత్తే సమయంలో వెన్నెముక ఎక్కువగా వంచకూడదు.

సాధ్యమైనంత వర కూ సాఫీగా ఉన్న రోడ్లపై వాహనాలు నడుపుకోవాలి.

కూర్చునే సమయంలో ముందుకు వంగకూడదు. దీని వల్ల నడుం నొప్పితో పాటు అధిక బరువు, ఎసిడిటీ, ఊబకాయం, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి.

నిద్రపోయే సమయంలో 50 శాతం సమయం వెల్లకిలా.. 20 శాతం ఎడమవైపు తిరిగి.. పది శాతం బోర్లా పడకోవాలి. దీంతో పొట్ట, వెన్నెముక కండరాలు రిలాక్స్‌ అవుతాయి.

ఈత కొట్టడం వల్ల వెన్నెముక మరింత గట్టిపడి జీవిత కాలం పెరుగుతుంది.

ప్రొటీన్లు, కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

భుజంగాసనం, శలభాసనంతో మెడ కండరాలు బలపడాయి.

కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు నిటారుగా ఉండటం వల్ల ఇలాంటి నొప్పులు దరిచేరకుండా చూసుకోవచ్చు.

 

*మంచి ఆహారం..* వ్యాయామం అవసరం

రోజుకు 15 నుంచి 20 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల లిగమెంట్‌, మజిల్స్‌లోకి రక్తప్రసరణ బాగా ఉంటుంది. జంక్‌ ఫుడ్స్‌, మద్యానికి దూరంగా ఉండాలి. దూర ప్రయాణాలు, డ్రైవింగ్‌ చేయాల్సి వచ్చినప్పుడు మధ్యలో విరామం తీసుకోవాలి. మెత్తని చెప్పులు వేసుకుంటే మంచిది. ఆహారంలో కాల్షియం, విటమిన్లు లోపించకుండా చూసుకోవాలి. ప్రొటీన్లు, న్యూట్రియెంట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

Latest


EmoticonEmoticon