ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంకు 324 పీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. ఆన్‌లైన్ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అన్ని దశలనూ విజయవంతంగా పూర్తిచేసుకున్నవాళ్లు మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు చదవాల్సి ఉంటుంది. అనంతరం ఇండియన్ బ్యాంకులో పీవో కొలువు సొంతమవుతుంది. ప్రకటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు: 324. వీటిలో ఎస్సీ-48 , ఎస్టీ-24, ఓబీసీ-87, జనరల్-165 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: జులై 1, 2017 నాటికి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు.
వయోపరిమితి: జులై 1, 2016 నాటికి కనిష్ఠం 20, గరిష్ఠంగా 28 ఏళ్లు. అంటే జులై 2, 1988 కంటే ముందు; జులై 1, 1996 తర్వాత జన్మించినవాళ్లు అనర్హులు.ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
* ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు * ఎంపికైనవారికి ఏడాది పీజీడీబీఏ కోర్సు * అనంతరం పీవో కొలువు
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 22, 2016
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100. మిగిలిన అందరికీ రూ.600.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జనవరి 22, 2017
ప్రిలిమినరీ ఫలితాలు: జనవరి 30, 2017
మెయిన్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 28, 2017
ప్రిలిమినరీ హాల్ టికెట్లు: జనవరి 11 తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మెయిన్ హాల్‌టికెట్లు: ఫిబ్రవరి 16 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
Detailed Notification
Apply Online
1 comments:
Apply Online for Indian Bank Recruitment 2018 for 417 Probationary Officer Post. Registartion had started from 01.08.2018. Apply Now
EmoticonEmoticon