Syndicate Bank Recruitment 2016 – 400 Probationary Officer Posts


* ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా నియామ‌కాలు
* ఎంపికైన‌వారికి ఏడాది పీజీడీబీఏ కోర్సు
* అనంత‌రం పీవో కొలువు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక‌టైన సిండికేట్‌ 400 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. సింగిల్ స్టేజ్ ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. అనంత‌రం మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌ -మంగుళూరు లేదా ఎన్ఐటీటీఈ యూనివ‌ర్సిటీ- గ్రేట‌ర్ నోయిడాల్లో ఏదో ఒక చోట‌ ఏడాది వ్యవ‌ధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సు చ‌ద‌వాల్సి ఉంటుంది. విజ‌య‌వంతంగా కోర్సును పూర్తిచేసుకున్నవారిని ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (పీవో)/ అసిస్టెంట్ మేనేజ‌ర్ హోదాతో సిండికేట్ బ్యాంక్‌లోకి తీసుకుంటారు. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు: 400. వీటిలో అన్ రిజ‌ర్వ్‌డ్‌-202, ఎస్సీ-60 , ఎస్టీ-30, ఓబీసీ-108 ఖాళీలు ఉన్నాయి.
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు. (అక్టోబ‌రు 1, 2016 నాటికి అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి)

వ‌యోప‌రిమితి: అక్టోబ‌రు 1, 2016 నాటికి క‌నిష్ఠం 20, గ‌రిష్ఠంగా 28 ఏళ్లు. అంటే అక్టోబ‌రు 2, 1988 కంటే ముందు; అక్టోబ‌రు 1, 1996 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: డిసెంబ‌రు 28, 2016
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.100. మిగిలిన అంద‌రికీ రూ.600.
ప‌రీక్ష తేదీ: ఫిబ్రవ‌రి 26, 2017
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం.
వెబ్‌సైట్‌: www.syndicatebank.in

Syndicate Bank Recruitment 2016 –  400 Probationary Officer Posts


EmoticonEmoticon