Fundamental Duties- Indian Constitution in Telugu part2
ప్రాథమిక విధులు - విమర్శనాత్మక పరిశీలన
· ప్రాథమిక విధుల చేరికపై అనేక విమర్శలు ఉన్నాయి. భారత పౌరులు సహజంగా చట్ట విధేయులు, క్రమశిక్షణ గలవారు అయినప్పుడు వారి బాధ్యతలను ప్రత్యేకంగా గుర్తు చేయడం సమంజసం కాదు.
· అత్యంత ముఖ్యమైన విధులైన పన్నుల చెల్లింపు, కుటుంబ నియంత్రణ, ఎన్నికల్లో ఓటు చేయడం, మొదలగువాటిని ప్రాథమిక విధులలో పొందుపరచలేదు
· ఈ విధులు కేవలం నైతికపరమైన నియమావళియే. వీటిని పాటించకపోతే శిక్షించే ఆస్కారం లేదు.
· ప్రాథమిక విధులలో పేర్కొన్న కొన్ని పదాలకు స్పష్టత లేదు. ఉదా. శాస్త్రీయ దృక్పథం, మిశ్రమ సంస్కృతి, పరిశోధనా స్ఫూర్తి అనే పదాలకు నిర్ణీత అర్ధాలు లేవు.
· వీటిని నాలుగవ భాగంలో కాకుండా మూడో భాగంలోనే చేర్చి ఉండాల్సింది.
· సాధారణంగా ప్రాథమిక విధులు ప్రజాస్వామ్య రాజ్యాంగంలో అంతర్భాగంగా ఉండవు. నియంతృత్వ దేశాల రాజ్యాంగంలో మాత్రమే ఉండటం సాంప్రదాయం.
· చట్ట నిర్దేశానికి, ఆత్మ ప్రబోధానికి మధ్య వైరుధ్యాన్ని ప్రాథమిక విధులు కలిగించవచ్చు.
·
ప్రజలే సార్వభౌములు అని గుర్తించిన రాజ్యాంగం వారికి విధులను నిర్దేశించడం సమంజసం కాదు.
విధులు - ప్రయోజనాలు
·
ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేనప్పటికీ, కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, వీటిని రాజ్యాంగంలో చేర్చడం సమంజసమే. ఎందుకంటే విధులు లేకుండా హక్కులు మాత్రమే గుర్తిస్తే అది బాధ్యతా రాహిత్యానికి దారితీస్తుంది. అలాగే హక్కులు లేని బాధ్యతలు బానిసత్వానికి ప్రతీక అవుతాయి. కనుక హక్కులు, విధులు, పరస్పర పోషకాలు. అవి ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాలు.
· ప్రాథమిక విధులు కూడా ఆదేశిక సూత్రాల లాగా ప్రభుత్వ విధానాలను, కార్యాచరణను ప్రభావితం చేస్తాయి. ఆచరణాత్మకమైనవి కాకపోయినా నిరంతరం పౌరుల నైతిక బాధ్యతలను గుర్తు చేస్తాయి.
· అనేక వైవిధ్యాలున్న భారతదేశంలో పౌరులు చిత్తశుద్ధితో, విశాల ధృక్పథంతో బాధ్యతాయుత పౌరులుగా దేశ ఐక్యతకు, సమగ్రతకు, కృషి చేసేలా సహాయ పడతాయి.
· ప్రాథమిక విధులను, ప్రాథమిక హక్కులపై గల హేతుబద్ధమైన పరిమితులుగా పరిగణించవచ్చని 1992లో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ప్రాథమిక విధులు - సుప్రీంకోర్టు తీర్పులు
శ్యాం నారాయణ్ చాక్సీ Vs. యూనియన్ ఆఫ్ ఇండియా - జాతీయ పతాకాన్ని ప్రైవేట్ వ్యక్తులు ప్రచారం కోసం వినియోగించరాదని ఈ కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది.
2 comments
Good Website, thank you. visit our site.
Odia Book Coffee Bagichare Rati
Order Odia Books
Odia Books Online
Önemli giriş adreslerine buradan ulaşabilirsiniz.
betturkey giriş
betpark giriş
UQDUİ
EmoticonEmoticon