Fundamental Duties-Indian Constitution part1 in Telugu

Fundamental Duties-Indian Constitution in Telugu

విధులు అర్థ వివరణ

 "విధిఅనగా ఒక వ్యక్తి ఇతరులకోసం నిర్వర్తించవలసిన పని లేదా బాధ్యత అని అర్థంసామాజిక జీవనంలో వ్యక్తుల మధ్య పరస్పర అవగాహననమ్మకంగౌరవం అనేవి ఉదాత్తమైన మానవీయ పరిపక్వతా లక్షణాలుగా పేర్కొంటారుసమాజం ద్వారానే వ్యక్తి అన్ని లక్షణాలనుస్వభావాలను అలవర్చుకుంటాడుఅలాగేఅనేక ప్రయోజనాలు పొందుతాడుకనుక ప్రతి వ్యక్తి తన సమాజానికి కనీస సేవలనుసహాయాన్ని తిరిగి అందించాల్సిన బాధ్యత ఉంటుంది.

విధుల ప్రాముఖ్యత

విధులు సమాజ వికాసందేశాభివృద్దికిసామాజిక సృహ కల్పించడానికి దోహదం చేస్తాయిదేశ ఐక్యతనుసమగ్రతను పెంపొందిస్తాయిప్రాథమిక హక్కులనే కాయలు విధులుగా పరిపక్వం చెందినప్పుడే సమాజ జీవనం ఫలప్రదం అవుతుంది

విధులు - రకాలు
 సాధారణంగా విధులను రెండు రకాలుగా వర్గీకరిస్తారుఅవి.
1.నైతిక విధులు
2.చట్టబద్ధమైన విధులు.

 నైతిక విధులు అనగా ప్రజల యొక్క నైతిక విలువలపైసామాజిక స్పృహపై ఆధారపడిఉదాహరణకుపెద్దలను మరియు ఉపాధ్యాయులను గౌరవించడంఅభాగ్యులనువిధివంచితులను ఆదుకోవడంమొదలగునవి.
చట్టబద్ధమైన విధులు అనగా సమాజంచేత ఆమోదించబడిప్రభుత్వంచేత గుర్తించబడిన బాధ్యతలునీటిని ఉల్లంఘిస్తే శిక్షార్హులు అవుతారుఉదాహరణకుట్రాఫిక్ నియమాలను పాటించడంసన్నులను సక్రమంగా చెల్లించడంమొదలగునవి

ప్రతి పౌరుడు దేశంపట్లతన తోటి పౌరుల పట్ల కొన్ని కనీస బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందివీటికి గొంగ ప్రతిపత్తి కల్పించడం చేత వీటిని ప్రాథమిక విధులు అంటారు.

భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు -
వీటిని రష్యా రాజ్యాంగం నుండి గ్రహించారుమౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన లేదుఐతే 1976 42 రాజ్యాంగ సవరణ ద్వారా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలోని 4-A భాగంనిబంధన 51-Aలో పొందువరిచారుప్రారంభంలో వది ప్రాధమిక విధులు ఉండేవి. 2002లో 86 రాజ్యాంగ సవరణ ద్వారా మరొక విధిని రాజ్యాంగంలో చేర్చడం ద్వారా వీటి సంఖ్య పదకొండుకు పెరిగిందిజనవరి 3, 1977 నుంచి ఇవి అమలులోకి వచ్చాయి రోజును ప్రాథమిక విధుల దినోత్సవంగా పరిగణిస్తారు.

ప్రాథమిక విధులు - లక్షణాలు
ప్రాథమిక విధులకు సంబంధించి కొన్ని ప్రత్యేక లక్షణాలను  క్రింది విధంగా సూచించవచ్చు.
• ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదుఇవి నేరుగా అమలులోకి రావు.
వీటి అమలుకోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలు చేయాలి.
 • ప్రాథమిక విధులు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.
కొన్ని ప్రాథమిక విధులు నైతికపరమైన బాధ్యతలుమరికొన్ని పౌర బాధ్యతలు.
• కొన్ని ప్రాథమిక విధులను భారత సనాతన సాంప్రదాయాలుమత విలువలుపురాణాల ఆధారంగా తీసుకున్నారు.

ప్రాథమిక విధులు 

51(A)
a) రాజ్యాంగానికి కట్టుబడి ఉండిదాని ఆదర్శాలనుసంస్థలనుజాతీయ పతాకాన్నిజాతీయ గీతాన్ని గౌరవించటం
b) జాతీయ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో గల ఉన్నత ఆదర్శాలను పాటించడం
c) భారతదేశ సార్వభౌమత్వాన్నిఐక్యతనుసమగ్రతను పరిరక్షించటం
d) దేశరక్షణకుజాతీయ సేవకు సదా సన్నద్ధంగా ఉండటం 
e) భారత ప్రజల మధ్య మతభాషప్రాంతీయవర్గవైవిధ్యాలకు అతీతంగా సోదరభావాన్నిస్ఫూర్తిని పెంపొందించటం,స్త్రీల గౌరవాన్ని భంగపరిచే ఆచారాలను త్యజించటం
 f) భారత మిశ్రమ సంస్కృతినిఔన్నత్యాన్నిసంప్రదాయాన్ని గౌరవించి పరిరక్షించటం
g) అడవులుసరస్సులునదులు వన్యప్రాణులతో సహా ప్రకృతిలోని పరిసరాలను కాపాడటంఅభివృద్ధి చేయటం,జీవులపట్ల కారుణ్యం కలిగి ఉండటం
h) శాస్త్రీయ దృక్పథాన్నిమానవ జిజ్ఞాసనిపరిశోధనసంస్కరణ స్ఫూర్తిని పెంపొందించుకోవడం
i) ప్రజల ఆస్తిని సంరక్షించడంహింసను విసర్జించడం
j) తమ వ్యక్తిగతసమిష్టి చర్యల ద్వారా ప్రతి కార్యరంగంలోనూ అత్యున్నత స్థానాన్ని పొందడానికి కృషి చేయడం, తద్వారా దేశ అత్యున్నత అభ్యుదయానికి తోడ్పడటం.

k) 6 నుంచి 14 సంలోపు గల తమ పిల్లలకు విద్యావకాశాలను కల్పించే బాధ్యతను తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు నిర్వర్తించడం.



















Fundamental Duties-Indian Constitution in Telugu





EmoticonEmoticon