Indian Polity Quiz in Telugu

#పాలిటీ_బిట్ బ్యాంక్ - 3
1. 1975లో జాతీయ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించినపుడు భారత రాష్ర్టపతి ఎవరు?
ఎ) నీలం సంజీవరెడ్డి
బి) వి.వి. గిరి
సి) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
డి) జ్ఞానీ జైల్ సింగ్

View Answer
సమాధానం: సి
2. భారత రాజ్యాంగంలో ఎన్నో అధికరణం బాలకార్మిక వ్యవస్థను నిషేధించింది?
ఎ) 28
బి) 36
సి) 24
డి) 18

View Answer
సమాధానం: సి
3. రాజ్యసభ సభ్యుడి పదవీకాలం ఎంత?  Yg
ఎ) 2 సంవత్సరాలు
బి) శాశ్వతం
సి) 5 సంవత్సరాలు
డి) 6 సంవత్సరాలు

View Answer
సమాధానం: డి
4. డెమోక్రసీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
ఎ) గ్రీకు
బి) ఫ్రెంచి
సి) జర్మన్
డి) స్పానిష్

View Answer
సమాధానం: ఎ
5. ఆస్తిహక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు?
ఎ) 40
బి) 42
సి) 46
డి) 44

View Answer
సమాధానం: డి
6. భారతదేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
ఎ) 1955
బి) 1956
సి) 1929
డి) 1976

View Answer
సమాధానం: సి
7. భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించింది?
ఎ) 1947 అక్టోబర్ 22
బి) 1947 జూన్ 22
సి) 1947 జూలై 22
డి) 1947 జనవరి 22

View Answer
సమాధానం: సి
8.భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి?
ఎ) మూడు
బి) రెండు
సి) నాలుగు
డి) అయిదు

View Answer
సమాధానం: ఎ
9.భారత రాజ్యాంగంలో నాలుగో భాగం దేనికి సంబంధించింది?
ఎ) ఆదేశిక సూత్రాలు
బి) ప్రాథమిక హక్కులు
సి) పౌరసత్వం
డి) ప్రాథమిక విధులు

View Answer
సమాధానం: ఎ
10. భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ రాష్ర్టపతి పాలన గురించి చర్చిస్తుంది?
ఎ) 372
బి) 356
సి) 368
డి) 370

View Answer
సమాధానం: బి
11. గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధాని ఎవరు?
ఎ) జవహర్‌లాల్ నెహ్రూ
బి) లాల్‌బహదూర్ శాస్త్రి
సి) మొరార్జీ దేశాయ్
డి) ఇందిరాగాంధీ

View Answer
సమాధానం: డి
12. కింది వారిలో ఎవరిని రాష్ర్టపతి నియమించలేరు?
ఎ) రాష్ర్ట గవర్నర్లను
బి) త్రివిధ దళాధిపతులు
సి) ఎన్నికల కమిషనర్లు
డి) భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ రాయబారులు

View Answer
సమాధానం: డి
13. జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎవరు ఎన్నుకొంటారు?
ఎ) ఓటర్లు (ప్రత్యక్ష ఎన్నిక ద్వారా)
బి) జిల్లా పరిషత్‌కి ఎంపికైన సభ్యులు
సి) మండల పరిషత్ అధ్యక్షులు
డి) జిల్లాల్లో ఉన్న సర్పంచ్‌లు

View Answer
సమాధానం: బి
14. మనదేశంలో కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టింది ఎవరు?
ఎ) లార్డ్ విలియం బెంటింగ్
బి) లార్డ్ వారన్ హేస్టింగ్‌‌స
సి) లార్డ్ కర్జన్
డి) లార్డ్ రిప్పన్

View Answer
సమాధానం: బి
15. అతి తక్కువకాలం పదవిలో ఉన్న రాష్ర్టపతి ఎవరు?
ఎ) జాకీర్ హుస్సేన్
బి) ఎస్. రాధాకృష్ణన్
సి) జ్ఞానీ జైల్ సింగ్
డి) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్

View Answer
సమాధానం: ఎ
16. ప్రజాస్వామ్యం అనేది ప్రజల కొరకు, ప్రజలచేత, ప్రజల యొక్క ప్రభుత్వం అని తెలిపినవారు?
ఎ) అరిస్టాటిల్
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) నేతాజీ
డి) అబ్రహాం లింకన్

View Answer
సమాధానం: డి
17. మెన్‌‌సరీయా అంటే?
ఎ) హత్య
బి) నేర అభిలాష
సి) దోపిడి
డి) బందిపోటు

View Answer
సమాధానం: బి
18.మన లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎంఎల్‌సీలు ఎన్ని సంవత్సరాలకు ఎన్నికవుతారు?
ఎ) 2 ఏళ్లు
బి) 4 ఏళ్లు
సి) 6 ఏళ్లు
డి) 5 ఏళ్లు

View Answer
సమాధానం: సి
19. పార్లమెంటులో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు?
ఎ) ఆర్థికమంత్రి
బి) రైల్వేమంత్రి
సి) ప్రధానమంత్రి
డి) ముఖ్యమంత్రి

View Answer
సమాధానం: బి
20. ఇండియా ప్రెసిడెంట్ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి?
ఎ) డి. సంజీవయ్య
బి) ఎన్.సంజీవరెడ్డి
సి) జాకీర్ హుస్సేన్
డి) వి.వి.గిరి

View Answer
సమాధానం: బి
21. భారతదేశ రాష్ర్టపతిగా ఎన్నికైన మొదటి దళితుడు?
ఎ) దామోదరం సంజీవయ్య
బి) కె.ఆర్.నారాయణన్
సి) బి.ఆర్. అంబేద్కర్
డి) జగ్జీవన్‌రామ్

View Answer
సమాధానం: బి
22. ఎన్నికల్లో ఓటువేసిన అభ్యర్థికి ఏ వేలుకు ఇంకు చుక్క పెడతారు?
ఎ) కుడిచేయి చూపుడువేలుకు
బి) కుడిచేయి మధ్యవేలుకు
సి) ఎడమచేయి మధ్యవేలుకు
డి) ఎడమచేయి చూపుడు వేలుకు

View Answer
సమాధానం: డి
23.రాజ్యాంగ భూమికను తయారుచేసిన వారు?
ఎ) బి.ఆర్. అంబేద్కర్
బి) నెహ్రూ
సి) జె.బి.కృపలాని
డి) పి.డి.మాలవ్య

View Answer
సమాధానం: బి
24. భారతదేశంలో స్వాతంత్య్రం తర్వాత ఎన్ని పర్యాయాలు రాజ్యాంగ 360 అధికరణం ప్రకారం అత్యవసర పరిస్థితి విధించారు?
ఎ) ఎప్పుడూ లేదు
బి) రెండు
సి) ఒకటి
డి) మూడు

View Answer
సమాధానం: ఎ
25. భారత రాష్ర్టపతి లోక్‌సభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు?
ఎ) 10
బి) 5
సి) 9
డి) 2

View Answer
సమాధానం: డి
26. తొలి భాషా ప్రయుక్త రాష్ర్టం?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) జమ్మూకాశ్మీర్
సి) తమిళనాడు
డి) పశ్చిమబెంగాల్

View Answer
సమాధానం: ఎ
27. ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ర్టపతి ఎవరు?
ఎ) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
బి) శంకర్ దయాళ్ శర్మ
సి) నీలం సంజీవరెడ్డి
డి) జ్ఞానీ జైల్‌సింగ్

View Answer
సమాధానం: సి
28. జమ్మూకాశ్మీర్ రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకొచ్చింది?
ఎ) 1950
బి) 1951
సి) 1956
డి) 1957

View Answer
సమాధానం: డి
29. భారతదేశంలో ఓటరు గుర్తింపు కార్డులను మొదట ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
ఎ) 1993
బి) 1994
సి) 1995
డి) 1996

View Answer
సమాధానం: ఎ
30. భారత ప్రధానమంత్రిని కింద పేర్కొన్న ఏ పద్ధతిలో ఎన్నుకొంటారు?
ఎ) ప్రత్యక్ష
బి) పరోక్ష
సి) మిశ్రమ
డి) రాష్ర్టపతి నిర్ణయిస్తారు

View Answer
సమాధానం: బి
31.సైన్యంలో అత్యున్నత శ్రేణి ఏది?
ఎ) కమాండెంట్
బి) కెప్టెన్
సి) లెఫ్టినెంట్ కమాండర్
డి) జనరల్

View Answer
సమాధానం: డి
32. భారత పౌరులకు దేని ఆధారంగా ఓటుహక్కు కల్పించారు?
ఎ) లింగభేదం
బి) విద్యార్హత
సి) వయసు
డి) సంపాదన

View Answer
సమాధానం: సి
33. లోక్‌సభ కాలపరిమితి ఎంత?
ఎ) ఏడేళ్లు
బి) ఐదేళ్లు
సి) ఎనిమిదేళ్లు
డి) మూడేళ్లు

View Answer
సమాధానం: బి
34. ప్రత్యేక నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) లార్డ్ మింటో
బి) లార్డ్ మార్లె
సి) లార్డ్ మాంటెగ్
డి) మెక్ డొనాల్డ్

View Answer
సమాధానం: ఎ
35. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు దేని ఆధారంగా నిర్ణయించారు?
ఎ) అంబేద్కర్, గాంధీజీ డిమాండ్
బి) రౌండ్ టేబుల్ సమావేశాల చర్చలు
సి) సైమన్ కమిషన్ నివేదిక
డి) గాంధీజీ సత్యాగ్రహం

View Answer
సమాధానం: సి
36.భారతదేశంలో పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
ఎ) 1909 మార్లె - మింటో సంస్కరణల  చట్టం
బి) 1919 మాంటెగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) పైవన్నీ

View Answer
సమాధానం:సి
37.రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక  ఉపాధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు?
ఎ) సచ్చిదానంద సిన్హా
బి) ఫ్రాంక్ ఆంటోని
సి) హెచ్.సి. ముఖర్జీ
డి) వి.టి. కృష్ణమాచారి

View Answer
సమాధానం: బి
38. కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి కిందివాటిలో సరికాని జత ఏది?
ఎ) రచనా సంఘం - బి.ఆర్. అంబేద్కర్
బి) ప్రాథమిక హక్కుల సంఘం - సర్దార్ పటేల్
సి) సారథ్య సంఘం - రాజేంద్రప్రసాద్
డి) రాష్ట్ర వ్యవహారాల సంఘం- జవహర్‌లాల్ నెహ్రూ

View Answer
సమాధానం: డి
39. వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి కిందివాటిలో సరైన జత ఏది?
ఎ) ఉమ్మడి జాబితా - ఆస్ట్రేలియా
బి) సమాఖ్య ప్రభుత్వం - కెనడా
సి) ఏకీకృత న్యాయవ్యవస్థ - బ్రిటన్
డి) పైవన్నీ

View Answer
సమాధానం: డి
40. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశపెట్టిన వారు?
ఎ) బి.ఆర్. అంబేద్కర్
బి) బి.ఎన్. రావు
సి) కె.ఎం.మున్షీ
డి) జి.వి. మౌలాంకర్

View Answer
సమాధానం: బి
41. ప్రముఖులు, వారి వ్యాఖ్యలకు సంబంధించి కిందివాటిలో సరికాని జత ఏది?
ఎ) భారత ప్రభుత్వం అర్ధ సమాఖ్య - కె.సి. వేర్
బి) భారత ప్రభుత్వం కేంద్రీకృత సమాఖ్య - ఐవర్ జెన్నింగ్స్
సి) భారత ప్రభుత్వం బేరమాడే సమాఖ్య - మారిస్ జోన్స్
డి) భారత ప్రభుత్వం సహకార సమాఖ్య - జవహర్‌లాల్ నెహ్రూ

View Answer
సమాధానం: డి
42. కిందివారిలో ముసాయిదా సంఘంలో సభ్యుడు కానివారు?
ఎ) బి.ఆర్. అంబేద్కర్
బి) కె.ఎం. మున్షీ
సి) మాధవరావు
డి) బి.ఎన్. రావు

View Answer
సమాధానం: డి
43. పదో షెడ్యూల్‌లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
ఎ) 42వ సవరణ
బి) 44వ సవరణ
సి) 61వ సవరణ
డి) 52వ సవరణ

View Answer
సమాధానం: డి
44. ‘ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పును ఇచ్చింది?
ఎ) బేరుబారి గట భారత ప్రభుత్వం- 1960
బి) కేశవానంద భారతి Vs కేరళ రాష్ట్రం - 1973
సి) గోలక్‌నాథ్ Vs పంజాబ్ ప్రభుత్వం- 1967
డి) ఎస్.ఆర్. బొమ్మై Vs భారత ప్రభుత్వం - 1993

View Answer
సమాధానం: ఎ
45. కిందివాటిలో సమాఖ్య ప్రభుత్వ లక్షణం ఏది?
ఎ) ద్వంద్వ ప్రభుత్వం
బి) అధికార విభజన
సి) లిఖిత రాజ్యాంగం
డి) స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయశాఖ

View Answer
సమాధానం: బి
46. ఏ ప్రభుత్వ విధానంలో దేశాధినేత నియంతగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది?
ఎ) పార్లమెంటరీ ప్రభుత్వం
బి) అధ్యక్ష తరహా ప్రభుత్వం
సి) సమాఖ్య ప్రభుత్వం
డి) ఏకకేంద్ర ప్రభుత్వం

View Answer
సమాధానం: బి
47.ప్రాథమిక విధుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ) జనవరి 3
బి) జనవరి 9
సి) డిసెంబరు 10
డి) అక్టోబరు 24

View Answer
సమాధానం: ఎ
48. అల్ప సంఖ్యాక వర్గాల కోసం చేర్చిన ప్రత్యేక హక్కు ఏది?
ఎ) సమానత్వ హక్కు
బి) పీడనాన్ని నిరోధించే హక్కు
సి) మత స్వాతంత్య్ర హక్కు
డి) విద్య, సాంస్కృతిక హక్కు

View Answer
సమాధానం: డి
49. రాజ్యాంగ అధికరణలు - అంశాలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
ఎ) అధికరణ - 16: విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశం
బి) అధికరణ - 20: నేరాన్ని బట్టి శిక్ష
సి) అధికరణ - 25: మత స్వేచ్ఛ
డి) అధికరణ - 23: బాల కార్మిక వ్యవస్థ నిషేధం

View Answer
సమాధానం: డి
50. కిందివాటిలో ప్రాథమిక విధి కానిది ఏది?
ఎ) భౌతిక సంపదను అందరికీ సమానంగా పంపిణీ చేయడం
బి) మహిళలను గౌరవించడం
సి) సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం
డి) సోదరభావాన్ని పెంపొందించడం

View Answer
సమాధానం: ఎ
51. ప్రభుత్వాల కర్తవ్య నిర్వహణకు మార్గదర్శకాలుగా పనిచేసేవి ఏవి?
ఎ) ప్రాథమిక విధులు
బి) ప్రాథమిక హక్కులు
సి) ఆదేశిక సూత్రాలు
డి) రిజర్వేషన్లు

View Answer
సమాధానం: సి
52. హెబియస్ కార్పస్ అనేది ఏ భాషా పదం?
ఎ) లాటిన్
బి) గ్రీకు
సి) రోమన్
డి) ఇంగ్లిష్

View Answer
సమాధానం: ఎ
53. రాష్ట్రపతి ఎన్నికల్లో కింద పేర్కొన్న వారిలో ఎవరికి ఓటు హక్కు ఉండదు?
ఎ) విధాన పరిషత్ సభ్యులు
బి) లోక్‌సభకు రాష్ట్రపతి నియమించిన సభ్యులు
సి) రాజ్యసభకు రాష్ట్రపతి నియమించిన సభ్యులు
డి) పైవారందరూ

View Answer
సమాధానం: డి
54. ఉప రాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఎవరు?
ఎ) వి.వి. గిరి
బి) జాకీర్ హుస్సేన్
సి) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
డి) నీలం సంజీవరెడ్డి

View Answer
సమాధానం: సి
55. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
1. మంత్రిమండలి సలహా మేరకు అధికరణ 123 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేస్తారు
2. రాజ్యాంగపరమైన సమస్యల పరిష్కారానికి అధికరణ - 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు
ఎ) 1, 2
బి) పై రెండూ కావు
సి) 1 మాత్రమే
డి) 2 మాత్రమే

View Answer
సమాధానం: ఎ
56. రాష్ట్రపతి రాజీనామా లేఖను ఎవరికి సమర్పిస్తారు?
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
బి) ప్రధానమంత్రి
సి) ఉప రాష్ట్రపతి
డి) అటార్నీ జనరల్

View Answer
సమాధానం: సి
57. జాతీయ అత్యవసర సమయంలో అన్ని హక్కులు రద్దయినా, రద్దు కానివి ఏవి?
ఎ) అధికరణ - 23, 24
బి) అధికరణ - 29, 30
సి) అధికరణ - 20, 21
డి) పైవేవీ కాదు

View Answer
సమాధానం: సి
58. రాజ్యసభకు పదవిరీత్యా అధ్యక్షుడిగా ఎవరు కొనసాగుతారు?
ఎ) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
బి) ఉప రాష్ట్రపతి
సి) లోక్‌సభ డిప్యూటీ స్పీకర్
డి) పైన పేర్కొన్న వారెవరూ కాదు

View Answer
సమాధానం: బి
59. కిందివారిలో రాజ్యసభకు నామినేట్ చేసిన సభ్యత్వంతో ప్రధాని పదవి చేపట్టిన వారెవరు?
ఎ) ఇందిరాగాంధీ
బి) ఐ.కె. గుజ్రాల్
సి) హెచ్.డి. దేవేగౌడ
డి) పి.వి. నరసింహారావు

View Answer
సమాధానం: ఎ
60. జాతీయ ప్రభుత్వాన్ని నడిపిన ఏకైక ప్రధాని ఎవరు?
ఎ) పి.వి.నరసింహారావు
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) లాల్ బహదూర్ శాస్త్రి
డి) మొరార్జీ దేశాయ్

View Answer
61. ఉప ప్రధానమంత్రికి సంబంధించి కిందివాటిలో సరైన వరుసక్రమం ఏది?
ఎ) సర్దార్ పటేల్, మొరార్జీ దేశాయ్, వై.బి. చవాన్
బి) సర్దార్ పటేల్, వై.బి. చవాన్, మొరార్జీ దేశాయ్
సి) సర్దార్ పటేల్, చరణ్‌సింగ్, ఎల్.కె. అద్వానీ
డి) సర్దార్ పటేల్, మొరార్జీ దేశాయ్, జగ్జీవన్‌రామ్

View Answer
సమాధానం: డి
62. మంత్రిమండలి సమష్టి నిర్ణయాన్ని వ్యతిరేకించి మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి కేబినెట్ మంత్రి ఎవరు?
ఎ) బి.ఆర్. అంబేద్కర్
బి) సి.డి. దేశ్‌ముఖ్
సి) గోవింద వల్లభపంత్
డి) శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ

View Answer
సమాధానం: ఎ
63.1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘కేబినెట్’ అనే పదాన్ని ఎన్నో అధికరణలో చేర్చారు?
ఎ) 74
బి) 75
సి) 352
డి) 360

View Answer
సమాధానం: సి
64. భారతదేశంలో భౌగోళిక ప్రదేశం ఆధారంగా అతిపెద్ద నియోజక వర్గం ఏది?
ఎ) లడఖ్
బి) మల్కాజ్‌గిరి
సి) చాందినీ చౌక్
డి) అండమాన్ నికోబార్ దీవులు

View Answer
సమాధానం: ఎ
65. అధికరణ 330 ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక సీట్లు కేటాయించారు. ప్రస్తుతం వాటి సంఖ్య?
ఎ) ఎస్సీ - 80, ఎస్టీ - 40
బి) ఎస్సీ - 85, ఎస్టీ - 45
సి) ఎస్సీ - 90, ఎస్టీ - 50
డి) ఎస్సీ - 84, ఎస్టీ - 47

View Answer
సమాధానం: డి
66. ఉత్తరప్రదేశ్ తర్వాత ఎస్సీలకు అత్యధిక సీట్లు ఏ రాష్ట్రంలో కేటాయించారు?
ఎ) బిహార్
బి) తమిళనాడు
సి) పశ్చిమ బెంగాల్
డి) రాజస్థాన్

View Answer
సమాధానం: సి
67. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
1. అధికరణ-110 ప్రకారం ఒక బిల్లు సాధారణమైందా లేదా ఆర్థికపరమైందా అనేది స్పీకర్ నిర్ణయిస్తారు
2. అధికరణ-88 ప్రకారం అటార్నీ జనరల్ పార్లమెంట్ సమావేశాల్లో, చర్చల్లో పాల్గొనవచ్చు
ఎ) 1, 2 సరికావు
బి) 1, 2 సరైనవే
సి) 1 మాత్రమే సరైంది
డి) 2 మాత్రమే సరైంది

View Answer
సమాధానం: బి
68. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఎంత?
ఎ) మూడేళ్లు
బి) నాలుగేళ్లు
సి) అయిదేళ్లు
డి) ఆరేళ్లు

View Answer
సమాధానం: డి
69. పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలను నిలిపివేసి మరో ముఖ్యమైన అంశంపై చర్చించాల్సిందిగా ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఏమంటారు?
ఎ) అవిశ్వాస తీర్మానం
బి) వాయిదా తీర్మానం
సి) సావధాన తీర్మానం
డి) ఏదీకాదు

View Answer
సమాధానం: బి
70. పార్లమెంటరీ కమిటీల్లో అతి పెద్దది ఏది?
ఎ) ప్రభుత్వ ఖాతాల సంఘం
బి) ప్రభుత్వ అంచనాల సంఘం
సి) ప్రభుత్వ ఉపక్రమాల సంఘం
డి) ఏదీకాదు

View Answer
సమాధానం: బి
71. గవర్నర్‌కు కింది ఏ సందర్భంలో విచక్షణ అధికారం ఉంటుంది?
ఎ) రాష్ట్రంలో అధికరణ 356ను విధించడానికి రాష్ట్రపతికి సిఫారసు చేయడం
బి) విధానసభను రద్దు చేయడం
సి) బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపడం
డి) పైవన్నీ

View Answer
సమాధానం: డి
Indian Polity Quiz in Telugu

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv