లీపు సంవత్సరం అంటే ఏమిటి? ఎందుకొస్తుంది?
మామూలుగా అన్ని సంవత్సరాలకూ ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటే, లీపు సంవత్సరంలో మాత్రం 29 రోజులు ఉంటాయని మనందరికీ తెలుసు. లీపు సంవత్సరాన్ని నాలుగుతో భాగిస్తే శేషం ఏమీ రాదు. ఇది నాలుగేళ్లకోసారి వస్తుంది.
భూమి సూర్యుని చుట్టూ ఒక ప్రదక్షిణ చేయడానికి పట్టే కాలం దాదాపు 365రోజులు. దాన్నే మనం ఏడాదిగా పరిగణిస్తాం. కాని నిజానికి భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి కచ్చితంగా 365.256 రోజులు పడుతుంది.
భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి మనం అనుకొనే కాలానికి, కచ్చితంగా తిరిగే కాలానికి మధ్య తేడా ఉంటుంది. ఎంతంటే సంవత్సరానికి రోజులో నాల్గవ వంతు కాలం.
దాన్ని సర్దుబాటు చేయడానికి శాస్త్రజ్ఞులు ప్రతి నాలుగు సంవత్సరాలకు క్యాలెండరులో ఒక రోజును ఎక్కువ చేశారు. ఆ ఎక్కువ చేసిన రోజు ఉండే సంవత్సరమే లీపు సంవత్సరం.
ఆ రోజే ఫిబ్రవరి 29. ఆంగ్లంలో లీప్ అంటే దూకడం. వరుసగా రాకుండా నాలుగు సంవత్సరాలకొకసారి దూకుడు విధానంలో రావడం వల్ల ఈ సంవత్సరానికి లీప్ ఇయర్ అనే పేరొచ్చింది.

EmoticonEmoticon