Daily Current Affairs 04.August.2018


*CA..04.08.2018*


01) రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని 2018 ఆగస్టు 15నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి ప్రారంభించనున్నారు ?
జ: సిద్ధిపేట జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామం


02) రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఏ ప్రాంతంలో 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు ?
జ: తుమ్మలూరులో


03) ఇంటర్నేషన్ ప్లాస్టిక్ ఎక్స్ పొటిఝన్ 2018 నాలుగు రోజుల సదస్సు ఎక్కడ జరిగింది
జ: మాదాపూర్ హైటెక్స్


04) దేశంలోనే తొలిసారిగా బ్లాక్ చైన్ డిస్ట్రిక్ట్ ను ఎక్కడ ఏర్పాటు చేయడానికి టెక్ మహేంద్రా ముందుకొచ్చింది ?
జ: హైదరాబాద్


05) కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ పనుల కోసం మన రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణకు హామీ ఇచ్చిన రాష్ట్రం ఏది ?
జ: మహారాష్ట్ర


06) భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) ప్రకటించిన జాతీయ స్థాయి ర్యాంకుల్లో ఆరో స్థానం, దక్షిణ భారత దేశంలో మొదటి స్థానం నిలిచిన యూనివర్సిటీ ఏది ?
జ: ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం


07) ఉత్తరాఖండ్ హైకోర్టు సీజే పదోన్నతి కోసం సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆ జస్టిస్ పేరేంటి ?
జ: జస్టిస్ కేఎం జోసెఫ్


08) నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ( NCAER) సర్వే ప్రకారం దేశంలో పెట్టుబడులు ఆకర్షణలో ఏ రాష్ట్రం టాప్ లో నిలిచింది ?
జ: ఢిల్లీ
(నోట్ : 2016, 2017 ల్లో గుజరాత్ టాప్ లో నిలిచింది )


09) ఆసియా నేషన్స్ కప్ బ్లిట్జ్ ఈవెంట్ లో స్వర్ణం గెలుచుకున్నది ఎవరు ?
జ: భారత మహిళల చెస్ నంబర్ వన్ ద్రోణవల్లి హారిక


10) జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు ?
జ: ఎమర్సన్ మునంగాగ్వ

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv