*CA..05.08.2018*
01) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ( GHMC) లో జోన్లు, సర్కిళ్ళను ఎంతకు పెంచారు ?
జ: ప్రస్తుతం ఉన్న ఆరు జోన్లు - 12కి
ప్రస్తుతం ఉన్న 30 సర్కిళ్ళు - 48 కి
02) జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ఎవరి పేరు పెట్టింది ?
జ: నల సోమనాద్రి
(నోట: గద్వాల సంస్థానాన్ని పరిపాలించిన రాజు నలసోమనాద్రి పేరు )
03) దేశంలోనే మొదటిసారిగా ఎలాంటి ప్రమాదాలు జరిగినా (వరదలు, అగ్ని ప్రమాదం, చెట్లు విరిగిపడటం, భవనాలు కూలడం ) తక్షణం స్పందించేందుకు విపత్తుల నిర్వహణ దళాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేశారు ?
జ: హైదరాబాద్ లో (GHMC పరిధిలో )
04) దేశ చరిత్రలోనే తొలిసారిగా సుప్రీంకోర్టులో ప్రస్తుతం ముగ్గురు మహిళా జడ్జీలు ఉన్నారు. కొత్తగా న్యాయమూర్తిగా చేరిన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు
జ: జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ
05) సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా 1989లో ఎవరు నియమితులయ్యారు ?
జ: జస్టిస్ ఫాతిమా బీవీ
06) జమ్మూ కశ్మీర్ లో రాష్ట్ర శాశ్వత నివాసి ఎవరు, వారి స్థిరాస్తి హక్కులను నిర్ధారించడం, కశ్మీరేతరులు రాష్ట్రంలో స్థిరాస్తులు కలిగిఉండటం, ప్రభుత్వ ఉద్యోగాలు పొందడాన్ని నిషేధిస్తున్న ఆర్టికల్ ఏది ?
జ: 35 ఏ
07) సౌర కుటుంబానికి ఆవల ఉన్న ఏ గ్రహంలో జీవం మనుగడకు అవకాశం ఉంటుందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తేల్చారు ?
జ: కెప్టర్ 452 బీపై
08) అమెరికా 2019 లో చేపట్టే తొలి మానవ సహిత వాణిజ్య అంతరిక్ష యాత్రకు వెళ్ళే వ్యోమగాముల్లో ఎంపికైన భారత సంతతి వ్యోమగామి ఎవరు ?
జ: సునీతా విలియమ్స్
EmoticonEmoticon