Disaster Management Practice Bits in Telugu

విపత్తు నిర్వహణ - 3

1. భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తాయి?

 ఎ) ఉదయం

 బి) మధ్యాహ్నం

 సి) సాయంత్రం

 డి) పైవన్నీ

View Answer : సమాధానం:డి

2. ప్రపంచం మొత్తం విపత్తుల్లో భూకంపాల శాతం?

 ఎ) 7

 బి) 12

 సి) 8

 డి) 4

View Answer : సమాధానం: సి

3. అత్యధికంగా పసిఫిక్ పరివేష్టిత ప్రాంతంలో ఎంత  శాతం భూకంపాలు సంభవిస్తున్నాయి?

 ఎ) 80

 బి) 68

 సి) 50

 డి) 58

View Answer : సమాధానం: బి

4. గుజరాత్‌లోని భుజ్ సమీపంలో భూ కంపం సంభవించిన సంవత్సరం -

 ఎ) 2001

 బి) 1999

 సి) 2000

 డి) 2002

View Answer : సమాధానం: ఎ

5. కింది వాటిలో భూకంపానికి సంబంధించి సరైనది.

 ఎ) భూ అంతర్భాగంలో సంభవిస్తుంది

 బి) కంపన తరంగాలు ఏర్పడుతాయి

 సి) కొద్ది కాలం మాత్రమే ఉంటుంది

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: డి

6.భారత్‌లో అతి తక్కువ భూ కంప తీవ్రత కలిగిన ప్రాంతం -

 ఎ) దక్షిణ భారతదేశం

 బి) గంగా మైదానం 

 సి) ఈశాన్య భారతదేశం

 డి) పశ్చిమ హిమాలయాలు

View Answer : సమాధానం: ఎ

7. భూకంపం సంభవించినపుడు కింది వాటిలో ఏది జరుగుతుంది?

 ఎ) కట్టడాలు కూలుతాయి 

 బి) నేల కోత కు గురవుతుంది 

 సి) అడవులు నాశనమవుతాయి 

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: డి

8. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద ఎంత ఉంటే సునామీలు సంభవిస్తాయి?

 ఎ) 8.0 

 బి) 7.5   

 సి) 8.5   

 డి) 9.0

View Answer : సమాధానం: బి

9. భూ అంతర్భాగంలో చాలా లోతులో కంపన తరంగాలు విడుదలయ్యే భాగాన్ని ఏమంటారు?

 ఎ) నాభి

 బి) అధికేంద్రం 

 సి) ఐసోసీస్మల్ లైన్ 

 డి) ఏదీకాదు

View Answer : సమాధానం: ఎ

10. నాభికి ఎదురుగా భూ ఉపరితలంపై ఉండే బిందువు -

 ఎ) నాభి 

 బి) అధికేంద్రం 

 సి) ఐసోసీస్మల్ లైన్ 

 డి) ఏదీకాదు

View Answer : సమాధానం: బి

11. భూ ఉపరితలం ద్వారా వర్తులాకారంగా ప్రయాణించి అత్యధిక నష్టం కలిగించే తరంగాలు ఏవి?

 ఎ) P   

 బి) L   

 సి) P, L 

 డి) S

View Answer : సమాధానం: బి

12. భూ అంతర్భాగంలో ఘన, ద్రవ, వాయు మాధ్యమాల్లో ప్రయాణించే తరంగాలుఏవి?

 ఎ) P   

 బి) L   

 సి) P, L 

 డి) S

View Answer : సమాధానం: ఎ

13. ముందుకు వెనుకకు ఊగుతూ ద్రవ మాధ్యమంలో మాత్రమే ప్రయాణించే తరంగాలు ఏవి?

 ఎ) P   

 బి) L   

 సి) P, L 

 డి) S

View Answer : సమాధానం: డి

14. జమ్మూ కాశ్మీర్‌లో ఏ సంవత్సరంలో సంభవించిన భూకంపం వల్ల 75 వేల మంది మరణించారు?

ఎ) 2004 

 బి) 2006 

 సి) 2005   

 డి) 2003

View Answer : సమాధానం: సి

15. భూ కంపాలు సంభవించడానికి కారణం ఏమిటి?

 ఎ) అగ్ని పర్వత సంబంధ కారణాలు

 బి) ఉపరితల కారణాలు 

 సి) విరూపకారక కారణాలు 

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: డి

16. లాతూర్‌లో భూకంపం సంభవించిన సంవత్సరం?

 ఎ) 1993 

 బి) 1994 

 సి) 1992   

 డి) 1990

View Answer : సమాధానం: ఎ

17. 1988 ఆగస్టు 21న ఏ ప్రదేశంలో భూకంపం సంభవించి దాదాపు 15 వేల మంది మృతికికారణమైంది?

 ఎ) ఉత్తర హిమాలయాలు 

 బి) బీహార్ నేపాల్ సరిహద్దు

 సి) గుజరాత్     

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: బి

18. అగాధ భూకంపాలు ఉపరితలం నుంచి ఎంత లోతులో సంభ విస్తాయి?

 ఎ) 30 కి.మీ 

 బి) 150 కి.మీ 

 సి) 300 కి.మీ 

 డి) 200 కి.మీ

View Answer : సమాధానం: సి

19. 60 నుంచి 300 కి.మీ లోతులో సంభవించే భూకంపాలను ఏమంటారు?

 ఎ) అగాధ భూకంపాలు 

 బి) మాధ్యమిక భూకంపాలు

 సి) గాధ భూకంపాలు   

 డి) ఏదీ కాదు

View Answer : సమాధానం: బి

20. 60 కి.మీ లోతులో సంభవించే  భూకంపాలేవి?

 ఎ) అగాధ భూకంపాలు 

 బి) మాధ్యమిక భూకంపాలు

 సి) గాధ భూకంపాలు   

 డి) ఏదీ కాదు

View Answer : సమాధానం: సి

21. భూకంపక దలికల కాలాన్ని లెక్కించే సాధనం -

 ఎ) Sysmograph

 బి) Sysmogram 

 సి) Magnitude 

 డి) ఏదీ కాదు

View Answer : సమాధానం: ఎ

22. Sysmogram అంటే?

 ఎ) భూకంప కదలికల కాలాన్ని లెక్కించే సాధనం   

 బి) భూకంప తీవ్రతను నమోదు చేసే రేఖా చిత్రం

 సి) భూకంప పరిమాణాన్ని కొలిచే సాధనం     

 డి) ఏదీ కాదు

View Answer : సమాధానం: బి

23. భూకంప పరిమాణాన్ని కొలవడానికి కింది వాటిలో ఉపయోగించనిది?

 ఎ) రోసీ ఫారెల్ స్కేలు

 బి) మెర్కల్లీ స్కేలు 

 సి) రిక్టర్ స్కేలు 

 డి) ఏదీకాదు

View Answer : సమాధానం: డి

24. దేశంలో తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతాలు?

 ఎ) హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్

 బి) హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, దక్కన్ పీఠభూమి

 సి) ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, దక్కన్ పీఠభూమి 

 డి) కోస్తా తీరం, బీహార్, దక్కన్ పీఠభూమి

View Answer : సమాధానం: ఎ

25. ప్రపంచంలో సంభవిస్తున్న భూకంపాల్లో పసిఫిక్ పరివేష్టిత ప్రాంతంలో సంభవించే వాటి శాతం -

 ఎ) 65.6 

 బి) 75.6 

 సి) 85.6 

 డి) 80.6

View Answer : సమాధానం: బి

26. 2010లో ఏ దేశంలో సంభవించిన భూకంపం వల్ల 2 లక్షల కంటే ఎక్కువ మంది చనిపోయారు?

 ఎ) ఘనా 

 బి) ఉరుగ్వే 

 సి) హైతీ 

 డి) పెరూ

View Answer : సమాధానం: సి

27. భారతదేశం మొత్తం తీర రేఖ పొడవు ఎంత?

 ఎ) 8000 కి.మీ 

 బి) 5100 కి.మీ 

 సి) 7000 కి.మీ 

 డి) 7517 కి.మీ

View Answer : సమాధానం: డి

28. దేశం మొత్తం భూభాగంలో ఎంత శాతం తుపానుల బారిన పడుతుంది?

 ఎ) 8 శాతం 

 బి) 12 శాతం 

 సి) 4 శాతం 

 డి) 10 శాతం

View Answer : సమాధానం: ఎ

29. ఒరిస్సాలో సూపర్ సైక్లోన్ సంభవించిన సంవత్సరం -

 ఎ) 2000 

 బి) 1976 

 సి) 1999 

 డి) 1998

View Answer : సమాధానం: సి

30. దేశంలో ఎన్ని రాష్ట్రాలు తీరరేఖ కలిగి ఉన్నాయి?

 ఎ) 12   

 బి) 10   

 సి) 9   

 డి) 11

View Answer : సమాధానం:బి

31. పశ్చిమ బెంగాల్‌లో బోలా తుపాను సంభవించిన సంవత్సరం -

 ఎ) 1976 

 బి) 1980 

 సి) 1975 

 డి) 1970

View Answer : సమాధానం: డి

32. 2012లో ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన తుపాను పేరేమిటి?

 ఎ) నీలం 

 బి) లైలా 

 సి) నిషా 

 డి) థానె

View Answer : సమాధానం: ఎ

33. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ తుపాను సంభవించి 10 వేల మంది మరణించారు?

 ఎ) 1975 

 బి) 1996 

 సి) 1977 

 డి) 1970

View Answer : సమాధానం: సి

34. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించన తుపాను ఏది?

 ఎ) నీలం 

 బి) లైలా 

 సి) నిషా 

 డి) థానె

View Answer : సమాధానం: సి

35. ఏ దేశంలో నర్గీస్ అనే తుపాను సంభవించి దాదాపు లక్ష మందికి పైగా మరణించారు?

 ఎ) బర్మా   

 బి) బంగ్లాదేశ్ 

 సి) ఫిలిప్పీన్స్

 డి) థాయ్‌లాండ్

View Answer : సమాధానం: ఎ

36. తుపాను ఏర్పడటానికి కారణాలు ఏమిటి?

 ఎ) వాతావరణ అస్థిరత 

 బి) అల్పపీడనం

 సి) వేడి సముద్రాలు 

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: డి

37. ఇప్పటి వరకు ప్రపంచంలో సంభవించిన తుపానుల్లో సుదీర్ఘమైంది ఏది? (దాదాపు 31 రోజులు ఉంది)

 ఎ) యూఎస్ టోర్నడో 

 బి) టైఫూన్ జాన్

 సి) ఆస్ట్రేలియా విల్లీవిల్లీ

 డి) హరికేన్‌లు

View Answer : సమాధానం:బి

38. ఆస్ట్రేలియాలో సంభవించే తుపానులను ఏమంటారు?

 ఎ) టోర్నడో   

 బి) టైఫూన్ 

 సి) విల్లీవిల్లీ 

 డి) సైక్లోన్

View Answer : సమాధానం: సి

39. ఏ సముంద్రంలో సంభవించే తుపానులకు సైక్లోన్ అని పేరు?

 ఎ) హిందూ మహా సముద్రం 

 బి) మధ్యదరా సముద్రం

 సి) ఉత్తర పసిఫిక్ సముద్రం 

 డి) ఏదీకాదు

View Answer : సమాధానం: ఎ

40. హరికేన్‌లు ఎక్కడ సంభవిస్తాయి?

 ఎ) హిందూ మహా సముద్రం 

 బి) మధ్యదరా సముద్రం

 సి) ఉత్తర పసిఫిక్ సముద్రం 

 డి) ఉత్తర అట్లాంటిక్ సముద్రం

View Answer : సమాధానం: డి

41. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సంభవించే తుపానులు?

 ఎ) టోర్నడో   

 బి) టైఫూన్ 

 సి) విల్లీవిల్లీ 

 డి) సైక్లోన్

View Answer : సమాధానం: ఎ

42. ICZMP అంటే?

 ఎ) International coastal zone management project

 బి) Integrated coastal zone management project

 సి) Intergovernamental cooperative zone management project

 డి) International cyclone zonal management programme

View Answer : సమాధానం: బి

43. NCRMP అంటే?

 ఎ) National coastal Rehabilitation Management project

 బి) National coastal reconstruction management programme

 సి) National Cyclone Rehabilitation management Project

 డి) National Cyclone Risk Mitigation Project

View Answer : సమాధానం: డి

44. తుపాను నివారణ లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏవి?

 ఎ) భవన సముదాయాలు నిర్మించడం 

 బి) మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం

 సి) అవగాహన కార్యక్రమాలు చేపట్టడం 

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: డి

45. NCRMPకు ఆర్థిక సహాయం అందిస్తున్న సంస్థ ఏది?

 ఎ) ఐక్యరాజ్య సమితి   

 బి) అంతర్జాతీయ ద్రవ్య నిధి

 సి) ప్రపంచబ్యాంక్   

 డి) ఆసియా అభివృద్ధి బ్యాంక్

View Answer : సమాధానం: సి

46. ప్రపంచంలో అత్యధికంగా 80 శాతం సునామీలు ఎక్కడ సంభవిస్తుంటాయి?

 ఎ) హిందూ మహా సముద్రం   

 బి) మధ్యదరా సముద్రం

 సి) అట్లాంటిక్ ప్రాంతం   

 డి) పసిఫిక్ పరివేష్టిత ప్రాంతం

View Answer : సమాధానం: డి

47. సునామీకి కారణాలు ఏమిటి?

 ఎ) అగ్నిపర్వతాలు 

 బి) భూకంపాలు 

 సి) భూపాతాలు 

 డి) పైవన్నీ

View Answer : సమాధానం:డి

48. సునామీ ధాటికి ఇటీవల అన్ని న్యూక్లియార్ రియాక్టర్ కార్యకలాపాలు నిలిపివేసిన దేశం?

 ఎ) చైనా 

 బి) ఇండోనేషియా 

 సి) జపాన్ 

 డి) భారత్

View Answer : సమాధానం: సి

49. 2004లో 14 దేశాల్లో వచ్చిన సునామీ వల్ల ఎంత మంది మరణించారు?

 ఎ) 2 లక్షలు 

 బి) 1 లక్ష 

 సి) 3 లక్షలు 

 డి) ఏదీకాదు

View Answer : సమాధానం: ఎ

50. 2004 డిసెంబర్ 26న సంభవించిన సునామీలో భారత్‌లో మరణించిన వారి సంఖ్య ఎంత?

 ఎ) 20,000 

 బి)10,000   

 సి) 50,000 

 డి) 30,000

View Answer : సమాధానం: బి

51. ‘Tsunami’ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?

 ఎ) చైనీస్   

 బి) ఫ్రెంచ్   

 సి) జపనీస్ 

 డి) గ్రీస్

View Answer : సమాధానం:సి

52.సునామీ అనే పదానికి అర్థం -

 ఎ) సముద్ర అల 

 బి) రాకాసి అల 

 సి) పాటుపోటులు 

 డి) ఏదీకాదు

View Answer : సమాధానం: బి

53. సునామీ అనే పదాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహాసభ ఏ సంవత్సరంలో రూపొందించింది?

 ఎ) 1964   

 బి) 1965 

 సి) 1961 

 డి)1963

View Answer : సమాధానం: డి

54. సముద్రంలో సంభవించే భూకంప తీవ్రత ఎంత ఉంటే సునామీలు రావడానికి అవకాశ ం ఉంది?

 ఎ) 4.5   

 బి) 6.5   

 సి) 8.5 

 డి) 7.5

View Answer : సమాధానం: బి

55. సునామీల గరిష్ట వేగం గంటకు ఎంత?

 ఎ) 200-2000 కి.మీ. 

 బి) 500-700 కి.మీ.

 సి) 500-1500 కి.మీ. 

 డి)100-500 కి.మీ.

View Answer : సమాధానం: బి

56.సునామీలు సంభవించడానికి అతి ఎక్కువగా కారణమవుతన్నవి -

 ఎ) భూకంపాలు   

 బి) అగ్నిపర్వతాలు 

 సి) భూపాతాలు   

 డి) వాతావ రణంలో ప్రతికూల పరిస్థితులు

View Answer : సమాధానం:ఎ

57. సముద్రంలో ఏర్పడే ద్రోణి తరంగం మొదట తీరాన్ని తాకడాన్ని ఏమంటారు?

 ఎ) ఫస్ట్ స్టెప్   

 బి) టైడ్ హిట్ 

 సి) డ్రా బ్యాక్ 

 డి) ఏదీకాదు

View Answer : సమాధానం: సి

58. జపాన్‌లో సునామీ సంభవించిన రోజు ఏది?

 ఎ) 11 మార్చి 2011 

 బి) 11 ఏప్రిల్ 2012 

 సి) 11 మార్చి 2012 

 డి)11 ఏప్రిల్ 2011

View Answer : సమాధానం: ఎ

59. ఇంతవరకు ప్రపంచంలో సంభవించిన సునామీల్లో అతి పెద్దది?

 ఎ) 26 నవంబర్ 2004   

 బి) 26 డిసెంబర్ 2004

 సి) 26 నవంబర్ 2003   

 డి) 26 డిసెబర్ 2003

View Answer ; సమాధానం:బి

60. భారతదేశంలో సునామీలకు నోడల్ ఏజెన్సీగా పనిచేసే మంత్రిత్వ శాఖ ఏది?

 ఎ) గృహవ్యవహారాల మంత్రిత్వ శాఖ

 బి) భారత వాతావరణ విభాగం 

 సి) ఆరోగ్య మంత్రిత్వ శాఖ   

 డి) మినీస్ట్రీ ఆఫ్ ఎర్‌‌త సెన్సైస్

View Answer : సమాధానం: డి

61. ఎప్పటికప్పుడు సునామీల కదలికలను పసిగడుతూ అవసరమైన సమాచారాన్ని చేరవేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంస్థ?

 ఎ) NTRS   

 బి) PTWC   

 సి) INCOIS 

 డి) DART

View Answer : సమాధానం: సి

62. INCOISను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

 ఎ) 2004   

 బి)2006 

 సి) 2007 

 డి) 2005

View Answer : సమాధానం:డి

63. INCOISను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

 ఎ) 2004   

 బి)2006 

 సి) 2007 

 డి) 2005

View Answer : సమాధానం: బి

64. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ఉన్న చోటు -

 ఎ) హవాయి   

 బి) అలస్కా 

 సి) కెనడా 

 డి) బ్రెజిల్

View Answer : సమాధానం: ఎ

65. ICZM ముఖ్య విధి ఏమిటి?

 ఎ) సునామీల ప్రభావాన్ని తగ్గించడం 

 బి) తీరప్రాంత వనరులు సద్వినియోగం చేసుకోవడం

 సి) ప్రజల స్థితిగతులు మెరుగుపరచడం 

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: డి

66. ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు?

 ఎ) ఐక్యరాజ్య సమితి 

 బి) జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ 

 సి) రెడ్‌క్రాస్, రెడ్ క్రిసెంట్   

 డి) వరల్డ్ బ్యాంక్

View Answer : సమాధానం: సి

67. భారతదేశంలో Building Materials Technology Promotion Council (BMTPC) తయారు చేసిన Vulnerability Atlas ప్రకారం వరదుల సంభవించే శాతం?

 ఎ) 58 శాతం 

 బి) 12 శాతం 

 సి) 4 శాతం 

 డి) 30 శాతం

View Answer : సమాధానం: బి

68. దేశంలో సాగవుతున్న భూమిలో కరువు బారిన పడుతున్న భూభాగం?

 ఎ) 68 శాతం 

 బి) 58 శాతం 

 సి) 78 శాతం 

 డి) 48 శాతం

View Answer : సమాధానం: ఎ

69. మన దేశంలో ఏటా ఎంతమంది వరదలకు గురవుతున్నారు?

 ఎ) 500 మిలియన్లు 

 బి) 100 మిలియన్లు

 సి) 200 మిలియన్లు 

 డి) 400 మిలియన్లు

View Answer : సమాధానం: సి

70. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 1996-2010 మధ్య సంభవించిన విపత్తుల వల్ల దేశ జీడీపీలో 2 శాతం నష్టం వాటిల్లగా రెవెన్యూలో ఎంత శాతం నష్టం వాటిల్లింది?

 ఎ) 13.15 శాతం 

 బి) 12.15 శాతం

 సి) 10.15 శాతం 

 డి) 11.15 శాతం

View Answer : సమాధానం: బి

71. కింది వాటిలో అధిక నష్టాన్ని కలిగించినవి?

 ఎ) 2001 భుజ్ భూకంపం   

 బి) 2004 హిందూ మహాసముద్రంలోని సునామీ

 సి) 2005 జమ్మూకాశ్మీర్ భూకంపం

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: డి

72. 2005-10 మధ్య కాలంలో విపత్తులకు కేటాయించిన నిధులు?

 ఎ) 21,333 కోట్లు 

 బి) 20,333 కోట్లు

 సి) 25,333 కోట్లు 

 డి) 15,333 కోట్లు

View Answer : సమాధానం: ఎ

73. 1990-2000 మధ్య కాలంలో ఏటా విపత్తుల బారిన పడి ఎంత మంది మరణిస్తున్నారు?

 ఎ) 2344   

 బి) 5344 

 సి) 4344 

 డి) 9344

View Answer ; సమాధానం: సి

74. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తుల నివారణ దశాబ్దంగా (International Decade for Natural Disaster Reduction) ప్రకటించింది?

 ఎ) 1995-2005 

 బి) 1990-2000

 సి) 1980-1990 

 డి) 2000-2010

View Answer : సమాధానం: బి

75. ‘జాతీయ విపత్తుల నిర్వహణ బిల్లు’ను భారత పార్లమెంటు ఏ తేదీన ఆమోదించింది?

 ఎ) 2005, డిసెంబరు 12   

 బి) 2005, డిసెంబరు 10

 సి) 2005, డిసెంబరు 15 

 డి) 2005, డిసెంబరు 23

View Answer : సమాధానం: ఎ

76. ‘జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం’ ఏ తేదీన అమల్లోకి వచ్చింది?

 ఎ) 2005, డిసెంబరు 12   

 బి) 2005, డిసెంబరు 10

 సి) 2005, డిసెంబరు 15 

 డి) 2005, డిసెంబరు 23

View Answer : సమాధానం: డి

77. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అధ్యక్షుడు ఎవరు?

 ఎ) రాష్ర్టపతి 

 బి) హోమంత్రి 

 సి) ప్రధాన మంత్రి 

 డి) ప్రధాన కార్యదర్శి

View Answer : సమాధానం: సి

78. National Disaster Management Authority (NDMA)లో సభ్యుల సంఖ్య ఎంత?

 ఎ) 10   

 బి) 8 

 సి) 15   

 డి) 7

View Answer : సమాధానం: బి

79. NDMAకు ఉపాధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?

 ఎ) ప్రధాన కార్యదర్శి   

 బి) లోక్‌సభ స్పీకర్

 సి) కేబినెట్ హోదాలోని మంత్రి 

 డి) ఏదీ కాదు

View Answer : సమాధానం:సి

80. NDMAకు మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు?

 ఎ) ఎస్.సి. విజ్

 బి) మర్రి శశిధర్ రెడ్డి 

 సి) మాంటెక్ సింగ్ 

 డి) షిండే

View Answer : సమాధానం: ఎ

81. విపత్తు నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు, పథకాలు రూపొందించడం, విపత్తు ప్రణాళికను అమోదించడం, ప్రణాళిక అమలయ్యేలా చూడటం, సమన్వయం కలిగి ఉండటం, మార్గదర్శకాలు రూపొందంచడం వంటివి దేని బాధ్యతలు?

 ఎ) NIDM 

 బి) SDMA   

 సి) NDRF   

 డి) NDMA

View Answer : సమాధానం: డి

82. విపత్తులకు సంబంధించిన విధి విధానాలు ఏ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నారు?

 ఎ) 10   

 బి)12   

 సి) 11   

 డి) 9

View Answer : సమాధానం: ఎ

83. విపత్తులపై విద్యార్థుల్లో అవగాహన కల్గించడానికి CBSE ఏ తరగతుల్లో విపత్తు నిర్వహణ పాఠ్యాంశాలను చేర్చింది?

 ఎ) 6, 7 

 బి) 7, 8 

 సి) 8,9   

 డి) 9, 10

View Answer : సమాధానం: సి

84. ఈశాన్య రాష్ట్రాల్లో విపత్తుల నివారణకు ఏర్పడిన North - Eastern Council డిక్లరేషన్‌కు సంబంధించింది ఏది?

 ఎ) Mizoram Declaration

 బి) Shillong Declaration 

 సి) Nagaland Declaration   

 డి) Tripura Declaration

View Answer : సమాధానం: బి

85. వైపరీత్యాల్లో అతి శీఘ్రంగా స్పందించి.. సహాయ, పునరావాస కార్యక్రమాలను అందించేందుకు పూర్తిస్థాయి శిక్షణ కలిగిన వ్యక్తులు, అధునాతన సాంకేతికతతో ఏర్పాటు చేసిన దళం?

 ఎ) National Disaster Response Force (NDRF)

 బి) Integrated coastal zone management project

 సి) National Institute of Disaster Management

 డి) State Disaster Management Authority

View Answer : సమాధానం: ఎ

86.SDMAకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?

 ఎ) రాష్ర్ట ప్రధాన కార్యదర్శి 

 బి) హోమంత్రి

 సి) ప్రధాన మంత్రి 

 డి) ముఖ్యమంత్రి

View Answer : సమాధానం: డి

87. నేషనల్ ఎక్జిక్యూటివ్ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?

 ఎ) లోకసభ స్పీకర్   

 బి) హోమంత్రి 

 సి) హోం ప్రధాన కార్యదర్శి 

 డి) ప్రధాన మంత్రి

View Answer : సమాధానం: సి

88. మొదటి భారత విపత్తుల నిర్వహణ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో జరిగింది?

 ఎ) 2005, డిసెంబరు 

 బి) 2006, డిసెంబరు 

 సి) 2005, నవంబర్     

 డి) 2006, నవంబరు

View Answer : సమాధానం: డి

89. రెండో భారత విపత్తుల నిర్వహణ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో జరిగింది?

 ఎ) 2008   

 బి) 2006   

 సి) 2009 

 డి) 2010

View Answer : సమాధానం: సి

90. భారత దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నింటిలో వరదలు వచ్చే అవకాశం ఉంది?

 ఎ) 20   

 బి) 23   

 సి) 25   

 డి) 26

View Answer : సమాధానం: బి

91.  ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న విపత్తుల్లో వరదల శాతం?

 ఎ) 30   

 బి) 50   

 సి) 20   

 డి) 40

View Answer : సమాధానం: డి

92.దేశంలో వరదల బారిన పడి ఏటా సగటున ఎంత మంది మరణిస్తున్నారు?

 ఎ) 2000   

 బి) 3000   

 సి) 1600 

 డి) 1000

View Answer : సమాధానం: సి

93.  దేశంలో అత్యధికంగా వరదలు సంభవిస్తున్న పరివాహక ప్రాంతం?

 ఎ) గంగా-బ్రహ్మపుత్ర 

 బి) గంగా-సింధు నది 

 సి) కృష్ణా-గోదావరి 

 డి) నర్మద-తపతి

View Answer : సమాధానం: ఎ

94. వరదలు సంభవించడానికి కారణాలు?

 ఎ) అధిక వర్షపాతం 

 బి) తుపానులు 

 సి) ఆటుపోటులు 

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: డి

95. ప్లాష్ ఫ్లడ్స్ అంటే వర్షపాతం సంభవించిన తర్వాత ఎన్ని గంటల్లో సంభవించేవి?

 ఎ) 6   

 బి) 5   

 సి) 3     

 డి) 8

View Answer : సమాధానం: ఎ

96.వరదల వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

 ఎ) మృత్తికా క్రమక్షయం

 బి) పంట నష్టం 

 సి) తాగునీరు కలుషితమవడం

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: డి

97. గంగా పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల్లో వరదల నియంత్రణా, నిర్వహణకు 1972లో జల వనరుల మంత్రిత్వ శాఖ దేనిని ఏర్పాటు చేసింది?

 ఎ) ఫ్లడ్ మేనేజ్‌మెంట్  ప్రోగ్రామ్ 

 బి) గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్ 

 సి) ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు 

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: బి

98. కేంద్ర జల కమిషన్ ఏర్పడిన సంవత్సరం -

 ఎ) 1940   

 బి) 1945   

 సి) 1950     

 డి) 1955

View Answer : సమాధానం: బి

99.  కింది వాటిలో వరదలకు సంబంధించిన కమిటీ?

 ఎ) ఎమ్.కె. శర్మ కమిటీ   

 బి) ఆర్. రంగాచారి కమిటీ 

 సి) కేస్కర్ కమిటీ   

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: డి

100. వాలు స్థిరత్వాన్ని పెంచాలంటే ఏం చేయాలి?

 ఎ) వాలులో గడ్డి మొక్కలు నాటడం 

 బి) వాలును బలపరుచుట 

 సి) వాలులో సహజ ఉద్భిజ సంపదను పెంచడం

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: డి

101. విపత్తుకు మొదటగా ఎవరు స్పందిస్తారు?

 ఎ) ప్రభుత్వ సంస్థలు

 బి) ఇరుగు పొరుగు వారు

 సి) కమ్యూనిటీ ప్రజలు

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: బి

102.విపత్తు నిర్వహణపై వేసిన తొలి కమిటీకి చైర్మన్ ఎవరు?

 ఎ) కె.అయ్యంగార్ 

 బి) బ్రిజేశ్ 

 సి) జె.సి. పంత్ 

 డి) మర్రి శశిధర్ రెడ్డి

View Answer ; సమాధానం: సి

103.ఆంధ్రప్రదేశ్‌లో కరువును అత్యధికంగా ఎదుర్కొంటున్న జిల్లాల సంఖ్య?

 ఎ) 8   

 బి) 6   

 సి) 4   

 డి) 9

View Answer : సమాధానం: ఎ

104. ప్రకృతి వైపరీత్యాల వల్ల దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు మరిణిస్తే వారికి ఆర్థిక సహాయం అందించే పథకం ఏది?

 ఎ) ఇందిరా క్రాంతి   

 బి) ఆపద్భందు పథకం 

 సి) అభయ హస్తం   

 డి) రాజీవ్ ఆవాస్ యోజన

View Answer : సమాధానం: బి

105.మన రాష్ర్టంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

 ఎ) కృష్ణపట్నం 

 బి) హైదరాబాద్ 

 సి) కాకినాడ 

 డి) మంగళగిరి

View Answer : సమాధానం: డి

106. పేదవాడి అణ్వాయుధాలు (పూర్ మ్యాన్స్ న్యూక్లియార్ బాంబ్స్) అని వేటిని అంటారు?

 ఎ) మిథైల్ ఐసోసైనేట్ 

 బి) ట్రైనైట్రోటోలిన్

 సి) బయోలాజికల్ డిజాస్టర్స్ 

 డి) గ్రీన్‌హోస్ వాయువులు

View Answer : సమాధానం: సి

107. కింది వాటిలో విపత్తులతో సంబంధమున్న అంశం ఏది?

 ఎ) హ్యూగో డిక్లరేషన్ 

 బి) కార్టిజనో ఒప్పందం

 సి) నగోయ ఒప్పందం 

 డి) క్యోటో ప్రోటోకాల్

View Answer : సమాధానం: ఎ

108. భూకంప తరంగాలను నమోదు చేసే గ్రాఫ్ ఏది?

 ఎ) బార్ గ్రాఫ్ 

 బి) సిస్మో గ్రాఫ్ 

 సి) టెక్టా గ్రాఫ్ 

 డి) ఏదీకాదు

View Answer : సమాధానం: బి

109.అవలాంచెస్ అంటే?

 ఎ) కొండ చరియలు విరగటం 

 బి) మట్టి గడ్డలు విరిగి పడటం

 సి) మంచు చరియలు విరిగి పడటం

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: సి

110. మంచు చరియలు విరిగి పడటానికి కారణం?

 ఎ) ఉష్ణోగ్రత పెరగటం 

 బి) వాలు కోణం (Slope angle)

 సి) మంచు విస్తరణ (Snow pack)

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: డి

111.భూపాతాలు (Landslides) ఎక్కువగా సంభవించే ప్రాంతాలు ఏవి?

 ఎ) హిమాలయ ప్రాంతం 

 బి) పశ్చిమ కనుమలు

 సి) నీలగిరి కొండలు 

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: డి

112. భూపాతాలు (Landslides) సంభవించడానికి కారణం ఏమిటి?

 ఎ) కొండ వాలుగా ఉండటం

 బి) అడవులను నిర్మూలించడంతో మృత్తిక కొట్టుకొని పోవడం

 సి) దిగువ ప్రాంతాల్లో గనుల తవ్వకం

 డి) పైవన్నీ

View Answer : సమాధానం: డి

113. మొదటి ప్రపంచ యుద్ధంలో సంభవించిన భూపాతాల వల్ల ఎక్కడ 50 వేల మంది సైనికులు మృతి చెందారు?

 ఎ) ఆల్ఫ్స్ పర్వతాలు 

 బి) ఆండీస్ పర్వతాలు

 సి) రాఖీ పర్వతాలు   

 డి) మిక్కెన్లీ పర్వతాలు

View Answer : సమాధానం: ఎ









no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv