*🇮🇳మన జాతికి ఖ్యాతికి ప్రతీకలు! 🇮🇳*
*🔺ఇవాళ పంద్రాగస్టు.. జెండావందనం చేస్తాం.. జాతిఏకతను గుర్తు చేసుకుంటాం. చరిత్ర ఘనతను ఘనంగా చెప్పుకుంటాం ... ఇవన్నీ ప్రతిబింబించే మన జాతీయ చిహ్నాల గురించీ తెలుగుకుందామా మరి!*
*పక్షి - నెమలి*
మన జాతీయ పక్షి ఏది అనగానే వెంటనే నెమలి అని చెప్పేస్తాం. మరి దీన్నే ఎందుకు, ఎప్పుడు ఎంపిక చేశారో సందేహం వచ్చిందా? ఆ... వచ్చే ఉంటుంది కదూ. మరేమో 1963లో మన జాతీయ పక్షిగా ఎంపికైందిది. అందానికి చిహ్నమైన ఈ పక్షి రూపం మన దేశ సంస్కృతీ, ఆచారాల్లో భాగం. పైగా దేశమంతటా దీని జాడ కనిపిస్తుంది. అందరికీ సుపరిచితమే. అందుకే దీన్ని జాతీయ పక్షిగా ఎంపిక చేశారు.
*జంతువు - పులి*
పులిని అడవికి నాయకుడిగా చెబుతారు. మన దేశ అటవీ సంపదకు గుర్తు ఇదే. ఇంకా శక్తి, చురుకుదనానికి ఇది చిహ్నం. అందుకే బెంగాల్ టైగర్‌ని 1972లో మన దేశ జాతీయ జంతువుగా ప్రకటించారు. పులుల సంరక్షణ కోసం దీన్ని జాతీయ జంతువుగా ఎంపిక చేశారు. దీనికి ముందు సింహం జాతీయ జంతువుగా ఉండేది.
*పండు - మామిడి*
పండ్లలో రాజు మామిడి పండే. అంతేకాదూ... దీనికి పుట్టిల్లు భారతదేశమే. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సాగు చేస్తున్నారు. ప్రాచీన కాలం నుంచీ కవిత్వంలోనూ ఈ పండు గొప్పతనాన్ని వర్ణించారు.
*వృక్షం - మర్రిచెట్టు*
మర్రి చెట్టు నిశ్చింతగా జీవించడానికి చిహ్నం. ఇది కొమ్మల్ని విస్తరిస్తూ ఎక్కువ కాలం బతికే చెట్టు. ఇంకా ఔషధ గుణాలున్నదీనూ. ఇది ఎన్నో పక్షులకు, జీవులకు ఆవాసంగా ఉంటుంది. ఎన్నో జాతులు, మతాలు ఉన్న మన దేశంలాగే. ఈ చెట్టు వేళ్లు ఎంతో బలంగా భూమిలోతుకు పాతుకుని ఉంటాయి. మన దేశ ఏకతకు ప్రతీకగా భావిస్తారు. ఇన్ని కారణాల వల్లే దీన్ని మన దేశ జాతీయ వృక్షంగా తీసుకున్నారు.
*పుష్పం - కమలం*
కమలానికి మన పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. లక్ష్మీ దేవికి గుర్తు. సంపద, శ్రేయస్సుకు చిహ్నం. అంతేకాదూ... బురద నీటిలో ఉండే ఈ పువ్వు పైకి తేలుతూ కల్మషం లేకుండా ఉంటుంది. స్వచ్ఛతకు ప్రతీక. అందుకే ఇది మన జాతీయ పుష్పంగా గుర్తింపు తెచ్చుకుంది.
*జెండా - త్రివర్ణ పతాకం*
మన జాతీయ పతాకం గురించి అందరికీ తెలిసిందే! మూడు రంగులు, మధ్యలో అశోక చక్రంతో ఉండే దీన్ని పింగళి వెంకయ్య రూపొందించారు. 1947 జులై 22 నుంచి దీన్ని మన జాతీయ పతాకంగా గౌరవిస్తున్నారు.
*వారసత్వ జంతువు - ఏనుగు*
ఆసియా ఏనుగు 2010 నుంచి మన జాతీయ వారసత్వ జంతువుగా నిలిచింది. పర్యావరణశాఖ దీన్ని ఇలా ఎంపిక చేసింది. ఇవి అంతరించిపోయే జీవుల జాబితాలో ఉన్నాయి. దీంతో వీటిని రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
*నది - గంగ*
మనందరికీ భూమి మీదున్న అతి పవిత్రమైన నది గంగానదే. మన దేశంలో పొడవైన నదీ ఇదే! దాదాపు 2,510 కిలో మీటర్ల దూరం ప్రవహిస్తుంటుందిది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే జాతీయ నది అయ్యింది.
*జలచరం - రివర్ డాల్ఫిన్*
కేవలం మంచినీటి నదుల్లోనే జీవించేది రివర్ డాల్ఫిన్. ఇది గతంలో గంగ, బ్రహ్మపుత్ర... లాంటి నదుల్లో భారత్, బంగ్లాదేశ్‌ల్లో కనిపించేది. కానీ ఇప్పుడు ఒక్క గంగా నదిలోనే ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇంత అరుదైనది మన దగ్గర ఉంది కాబట్టే ఇది మన జాతీయ జలచరమైంది.
*గీతం - ‘జనగణమన’*
మన జాతీయ గీతం ‘జనగణమన....’ అంటే మనకెంతో భక్తి. దూరం నుంచి వినిపించినా మన గుండెల నిండా దేశభక్తి ఉప్పొంగుతుంది. దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రాశారు. ‘జనగణమన’ 1950 జనవరి 24న జాతీయ గీతంగా ఎంపికైంది. 1919లో చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బీటీ కళాశాలలో ‘జనగణమన...’ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు ఠాగూర్. దీనిని ‘మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’గా ప్రకటించారు. విద్యార్థులతో పాడించారు. సంగీతంలో పీహెచ్‌డీ చేసిన మార్గరెట్ కజిన్స్... ‘జనగణమన’లోని సాహిత్యానికి తగ్గట్టుగా బాణీ కట్టారు.
*గేయం - ‘వందేమాతరం...’*
మన జాతీయ గేయం ‘వందేమాతరం’. సంస్కృతంలో బంకించంద్ర ఛటర్జీ రచించారు. ఈ గేయం స్వాతంత్య్రోద్యమంలో సమర యోధులకు ప్రేరణగా నిలిచింది. దీన్ని జాతీయ గీతంగా భావించేవారు. కానీ స్వతంత్రం వచ్చాక జనగణమన జాతీయ గీతంగా ఎంపికైంది. 1950లో వందేమాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించారు.
*చిహ్నం - నాలుగు సింహాల గుర్తు*
జాతీయ చిహ్నాన్ని సారనాథ్‌లో అశోకుడు కట్టించిన స్తూపం నుంచి స్వీకరించారు. నాలుగు సింహాలు, ఏనుగు, గుర్రం, ఎద్దు ఉండే ఈ గుర్తుపై ‘సత్యమేవ జయతే’ అనే నినాదం ఉంటుంది.

EmoticonEmoticon