యుఎస్‌లో ఇళ్ల‌కు 120 v విద్యు‌త్తే వాడ‌తారెందుకు?



అమెరిక లో  ఇళ్లకు వెళ్లే విద్యుత్‌ ప్రవాహ ఓల్టేజి 120 V మాత్రమే ఉంటుంది. కానీ మన దేశంలో 230V ఉంటుంది. ఇలా తేడా ఎందుకు ఉండాలి?

విద్యుత్ప్రవాహం మనిషిలో జరిగితే ప్రాణహాని ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలోను, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలోను అప్పుడప్పుడు విద్యుత్‌ షాక్‌ తగిలి రైతులు చనిపోవడాన్ని వార్తల్లో వింటుంటాం. విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాంతం నుంచి ఇళ్ల వరకు విద్యుత్‌ ప్రవాహం సజావుగా జరగాలంటే విద్యుత్‌వైర్లలో ఫేజ్‌ (లేదా L , లైన్‌), నూట్రల్‌ (లేదాN ) మధ్య ఎంత ఎక్కువ విద్యుత్‌ పొటన్షియల్‌ ఉంటే అంత మంచిది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి దూర ప్రాంతాలకు విద్యుత్‌ను పంపేటపుడు DC (Direct Current, DC) పద్ధతి కన్నా పర్యాయ విద్యుత్‌ (Alternating Current, AC) పద్ధతి మంచిదని 18వ శతాబ్దంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి చాలా దూరంలో ఉన్న నగరాలకు, నివాస ప్రాంతాలకు విద్యుత్‌ను పంపేపుడు AC పద్ధతిలో అత్యధిక మోతాదు ఓల్టేజీ (33000 వోల్టులు, 11000 వోల్టులు, 440 వోల్టుల మొత్తం) నింపి సరఫరా చేస్తారు. తీరా ఇళ్లకు సబ్‌ స్టేషన్‌ ద్వారా 33000 నుంచి 11000 లకు, ఆ తదుపరి 11000 నుంచి 440 వోల్టులకు తగ్గించి కాలనీల దగ్గరకు పంపుతారు. అక్కడ 3 ఫేజ్‌లు, 1 న్యూట్రల్‌ ద్వారా ట్రాన్స్‌ఫార్మర్‌ సహాయంతో ప్రతి ఫేజ్‌కు, న్యూట్రల్‌కు మధ్య 230 వోల్టులు, ప్రతి రెండు ఫేజ్‌ల మధ్య 440 వోల్టులు ఉండేలా ఏర్పాటు చేస్తారు. మన ఇళ్లలో సింగిల్‌ ఫేజ్‌ మీటరు అయినట్లయితే ప్రతి సాధారణ విద్యుత్‌ పరికరంలో రెండు ధృవాలు ఉండగా, అందులో ఒక ధృవం ఫేజ్‌కు, మరో ధృవం న్యూట్రల్‌ను కలిపి ఆన్‌చేస్తే ఆ సాధనం పనిచేస్తుంది. పొరపాటున శరీరంలో ఒకభాగం ఫేజ్‌కు, మరోభాగం నేలకు లేదా న్యూట్రల్‌కు తాకినట్లయితే ఎలక్ట్రిక్‌ షాక్‌ తగిలి చనిపోయే ప్రమాదం ఉంది. కానీ విద్యుత్‌ పొటన్షియల్‌ను ఫేజ్‌, న్యూట్రల్‌ మధ్య 110 వోల్టులకు తగ్గిస్తే ఆ మేరకు ప్రమాదాల అవకాశం కూడా తక్కువే. షాక్‌ తగిలినా మరణం సంభవించేంత తీవ్రస్థాయిలో లేకపోవడం వల్ల అపాయాల మోతాదు తక్కువ. అందుకే అమెరికా, జపాన్‌ వంటి దేశాలు యింకా 100 లేదా 110 లేదా 120 V సరఫరాతో సరిపెట్టుకొంటున్నారు.

అయితే ప్రపంచంలో ఎక్కువ భాగం దేశాలు 220V లేదా 230V వోల్టుల పద్ధతినే పాటిస్తున్నారు. ఇందుకు కారణం విద్యుత్‌ పరికరాల పని సామర్థ్యం అధిక వోల్టేజీలో ఎక్కువగా ఉండటమే. మరో మాటలో చెప్పాలంటే సాధనాల పనితనం అధిక వోల్టేజీతో ఎక్కువ వుంటుంది. ప్రమాదాల్ని నివారించేలా పద్ధతుల్ని పాటిస్తే 110 వోల్టుల కన్నా 230 వోల్టేజీ పద్ధతిలో శక్తి వృధా తగ్గుతుంది.


no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv