Central Government Schemes and their Details in Telugu



1) ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)

- ఒక దేశం - ఒక పథకం అనే నినాదంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
- పథకానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అశిష్ కుమార్ భుటానీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మే 2020 వరకూ ఈ పదవిలో కొనసాగుతారు
- 2016 జనవరి 13 నుంచి అమల్లోకి తెచ్చిన ఈ స్కీమ్ కింద ప్రకృతి విపత్తులు, చీడ పీడలతో రైతులు పంట నష్టపోయినప్పుడు త్వరగా బీమా సౌకర్యం, ఇతర సాయం అందించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు.
- గతంలో జాతీయ వ్యవసాయ బీమా పథకం, పునర్వవస్థీకరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం పథకాలను తొలగించి... ఒకే పథకంగా PMFBY తెచ్చారు
- ఈ స్కీమ్ కోసం రైతులు ఖరీఫ్ కి అయితే 2శాతం, రబీకి అయితే 1.5శాతం ప్రీమియం చెల్లించాలి. ఉద్యాన, వాణిజ్య పంటలకైతే 5శాతం ప్రీమియం చెల్లించాలి.

2) ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన
- 2015 జూన్‌ 25న ప్రధాని ఆవాస్‌ యోజనను ప్రారంభించారు.
- ఈ పథకం కింద పేదలకు రెండు కోట్ల ఇళ్లు నిర్మిస్తారు.
- 2022 సం.లోగా బలహీన వర్గాల వారికి పూర్తిస్థాయిలో ఇళ్ళని నిర్మిస్తారు.

3) స్మార్ట్‌ సిటీ కార్యక్రమం
- దేశవ్యాప్తంగా వంద నగరాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2015 జూన్‌ 25న ఈ పథకం ప్రారంభించారు.
- 98 స్మార్ట్‌ సిటీల జాబితాను 2015 ఆగస్టు 27న అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
- మొదటి విడతలో ఉత్తరప్రదేశ్‌లో 13 నగరాలు ఎంపికయ్యాయి.
- తెలంగాణలో వరంగల్‌, కరీంనగర్‌, ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ, తిరుపతి, విశాఖపట్టణం స్మార్ట్‌ సిటీలుగా ఎంపికయ్యాయి.
-ఈ పథకం కింద ఎంపిక చేసిన నగరాల్లో ఐదేళ్ళ పాటు ఏటా రూ.200 కోట్లు కేటాయిస్తారు.

4) ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన
- పరిశ్రమల్లో ప్రమాణాలకు అనుగుణంగా 24 లక్షల మందికి శిక్షణ ఇప్పించే ఉద్దేశ్యంతో 2015 మార్చి 20న ఈ పథకాన్ని ప్రారంభించారు.
- యువతలో స్కిల్ డెవలప్ మెంట్ (నైపుణ్యాలు) కల్పించడం ఈ పథక ప్రధాన ఉద్దేశం.
- మొత్తం పథకానికి రూ.1500 కోట్లు కేటాయించగా... ఇందులో ఈశాన్య ప్రాంత యువతకు రూ.150 కోట్లు ఎలాట్ చేశారు.

5) సుకన్య సమృద్ధి యోజన
- 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్‌లో ఈ పథకం ప్రారంభమైంది.
- ఆడ పిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకంలో పదేళ్ళ లోపు వారి పేరుతో ఖాతా ప్రారంభించారు.
- అకౌంట్ ను పోస్టాఫీసు లేదా బ్యాంకులో తెరవవచ్చు.
- మొదట్లో రూ.1000లతో ఖాథా తెరవాలని షరతు విధించగా, ఆ తర్వాత రూ.200 కనీస మొత్తంగా నిర్ణయించారు. నెలకు ఎంత మొత్తం అయినా జమ చేయడానికి అవకాశముంది.
- బాలిక వయస్సు 21యేళ్ళ చేరగానే ఈ పథకం అయిపోతుంది. మొత్తం 14యేళ్ళ వరకూ డబ్బును జమ చేయాలి.
-18యేళ్ళ తరవాత విద్య కోసం సగం అమౌంట్ తీసుకోవచ్చు.
- 2016-17లో ఈ పథకం కింద వడ్డీరేటు 8.6%

6) స్వచ్ఛభారత్‌
- 2014 అక్టోబరు 2న స్వచ్ఛ్ భారత్ ను ఢిల్లీలోని రాజ్‌పథ్‌ రోడ్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు.
- ‘స్వచ్ఛభారత్‌ దిశగా ముందడుగు’ అనేది ఈ కార్యక్రమం యొక్క నినాదం
- గతంలో ఉన్న ‘నిర్మల్‌ భారత్‌ అభియాన్‌’ ఈ పథకంలో విలీనమైంది.
- 2019 అక్టోబరు 2 నాటికి గాంధీజీ 150వ జయంతి వరకు పరిశుభ్ర భారత్ చేయాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యం.
- స్వచ్ఛభారత్‌కు 2016-17 బడ్జెట్‌లో 11,300 కోట్లు కేటాయించారు.
- స్వచ్ఛభారత్‌ లోగో మహాత్మాగాంధీ కళ్లద్దాలు. దీన్ని రూపొందించింది మహారాష్ట్రకు చెందిన అనంత్‌ ఖసెబర్దార్‌.
- స్వచ్ఛభారత్‌ అభియాన్‌ నిధుల కోసం 2015 నవంబరు 15 నుంచి 5శాతం సర్వీస్ ట్యాక్స్ విధించారు.
- స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కింద ప్రతి లబ్దిదారుడికి మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు అందిస్తారు.

7) బేటీ బచావో బేటీ పడావో
- 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్టులో ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకం ప్రారంభించారు.
- స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో ఈ పథకం అమలుచేస్తారు.
-మహిళా సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి వారి సామర్ధ్యాన్ని పెంచుతారు.

8) దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన
- దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకి ఉద్దేశించిన ఈ పథకాన్ని - 2014 నవంబరు 20న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
- ప్రధాని నరేంద్రమోడీ 2015 జూలై 15న పాట్నాలో ప్రారంభించారు.
- గతంలో ఈ పథకానికి ఉన్న పేరు: గ్రామీణ విద్యుదీకరణ
-వ్యవసాయ రంగంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడం ఈ పథకం ఉద్దేశం.

9) మిషన్‌ ఇంద్రధనుష్‌
- ఈ పథకం 2014 డిసెంబరు 25న ప్రారంభమైంది.
- పిల్లలకు ఏడు రకాల వ్యాధులకు సంబంధించిన టీకాలు వేస్తారు. అవి: 1) డిప్తీరియా 2) కోరింతదగ్గు 3) ధనుర్వాతం 4) పోలియో 5) క్షయ 6) తట్టు 7) హైపటైటిస్‌-బి

10) అమృత్‌
- AMRUT- Atal Mission for Rejuvenation and Urban Transformation
- ప్రధాని నరేంద్రమోదీ 2015 జూన్‌ 25న దీన్ని ప్రారంభించారు.
- దేశంలోని 500 పట్టణాల్లో అవస్థాపన సౌకర్యాలు కల్పిస్తారు.
-2015-16లో ఈ మిషన్‌ కింద 89 నగరాలు ఎంపికయ్యాయి.
🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹



11) ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన
- 2016 మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రారంభమైంది.
- దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న ( పేద కుటుంబాలు ) మహిళల పేరుతో ఉచితంగా LPG (వంట గ్యాస్‌) కనెక్షన్లు ఇస్తారు.
- మొదటి మూడేళ్ళలో 5 కోట్ల కనెక్షన్లు ఇస్తారు.

12) హృదయ్‌
- HRIDAY (Heritage City Development and Augmentation Yojana
- వారసత్వ నగరాల సంరక్షణ కోసం 2015 జనవరి 21న ఈ పథకం ప్రారంభమైంది.
- మొదటి దశలో 12 నగరాలను ఎంపిక చేశారు.
ఇందులో తెలంగాణ నుంచి వరంగల్, ఏపీ నుంచి అమరావతి ఉన్నాయి. ఇవి కాకుండా... వారణాసి (ఉత్తరప్రదేశ్‌), పూరి (ఒడిశా), అమృత్‌సర్‌ (పంజాబ్‌), అజ్మీర్‌ (రాజస్థాన్‌), గయ (బీహార్‌), మధుర (ఉత్తరప్రదేశ్‌), కాంచీపురం (తమిళనాడు), వేలంగిణి (తమిళనాడు), బాదామీ (కర్ణాటక) తోపాటు ద్వారక (గుజరాత్‌).

13) ప్రధానమంత్రి కృషి సంచాయ్‌ యోజన
- వ్యవసాయరంగం, గ్రామాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించే ఉద్దేశంతో 2015లో ఈ పథకాన్ని ప్రారంభించారు.
-కేంద్ర- రాష్ట్రాలు 75:25తో నిధులను భరించాలి
- ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నిష్పత్తి 90:10
-సేద్యపు నీటి వినియోగం పెంచుతూ సూక్ష్మ సాగునీటి అభివృద్ధి పథకం ఉద్దేశ్యం.

14) ప్రధానమంత్రి సురక్షబీమా యోజన
- ప్రమాద బీమా పథకమైన దీన్ని 2015లో ప్రారంభించారు.
- 18 నుంచి 70యేళ్ళ వారికి ఇది వర్తిస్తుంది. ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించాలి.
- ఈ పథకం కింద 2 లక్షల రూపాయల బీమా ఇస్తారు.
- అంగవికలురు అయితే లక్ష రూపాయల బీమా చెల్లిస్తారు.

15) ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకం
-ఈ పథకం ప్రారంభ మైంది : - 2014 ఆగస్టు 28. నినాదం ‘సబ్‌ కా సాథ్‌ - సబ్‌ కా వికాస్‌’.
- దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్‌ అకౌంట్‌ ఉండేలా పథకం రూపకల్పన
-ఈ అకౌంట్‌ కలిగిన వారికి రూ.30 వేల బీమా సౌకర్యం, లక్ష రూపాయల ప్రమాదబీమా సౌకర్యం ఉంటుంది.

16) మేక్‌ ఇన్‌ ఇండియా
- ఈ కార్యక్రమాన్ని 2014 సెప్టెంబరు 25న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం
- సంపూర్ణ ఉద్యోగితతో 25 రంగాల్లో ఉపాధి కల్పన, నైపుణ్య పెంపుదల కృషి చేయడం
- సాంకేతికతను పెంపుదల, ఎగుమతులు, ప్రభుత్వ ఆదాయ స్థాయిని పెంచడం ఈ పథకం లక్ష్యం
- మొత్తమ్మీద భారత్ ను తయారీ కేంద్రంగా తీర్చి దిద్దాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.



17) ప్రధానమంత్రి ముద్రా యోజన
- ఈ పథకం 2015 ఏప్రిల్‌ 8న ప్రారంభమైంది.
- చిన్న వ్యాపారులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు చేయూత అందిస్తారు. అందుకోసం రూ.10లక్షల వరకు రుణాన్ని అందిస్తారు.
-మూడు రకాలుగా రుణాన్ని అందిస్తారు.
1) శిశు (రూ.50 వేల వరకు రుణం)
2) కిశోర్ ‌(రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు)
3) తరుణ్‌( రూ.5లక్షల నుంచి పది లక్షలు)

18) స్టాండప్‌ ఇండియా
- 2016 ఏప్రిల్‌ 5న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ప్రారంభించారు.
- SC, ST మహిళలకు ఈ పథకం ద్వారా రూ.10 లక్షల నుంచి ఒక కోటి వరకు రుణం మంజూరు చేస్తారు

19) స్టార్టప్ ఇండియా
- స్టార్టప్ ఇండియా కార్యక్రమం 2016 జనవరి 16న ప్రారంభమైంది.
- కొత్త కంపెనీలు, వెంచర్ల ఏర్పాటు ద్వారా ఉద్యోగాల కల్పించడం
- రూ.25 కోట్ల లోపు వార్షిక టర్నోవర్‌ కలిగిన సంస్థలకు ఈ పథకం కింద ప్రోత్సాహకాలు ఇస్తారు.

20) డిజిటల్‌ ఇండియా
- డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని 2015 జూలై 1న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు
- గ్రామీణ ప్రాంతాలను హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తారు. అలాగే గ్రామాల్లో డిజిటల్‌ లిటరసీని కలిగిస్తారు.

21) అటల్‌ పెన్షన్‌ యోజన
- 60 యేళ్ళు పైబడిన వృద్ధులకు వెయ్యి నుంచి 5 వేల రూపాయల వరకు పెన్షన్‌ను అందించడం ఈ పథకం ఉద్దేశ్యం.
-2015 మే 9న ఈ పథకాన్ని ప్రారంభించారు.
- పథకంలో చేరడానికి 18-40యేళ్ళ వాళ్ళు అర్హులు. వయసును బట్టి ప్రీమియం నిర్ణయిస్తారు.

22) ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన
- 2015 మే9న పథకం ప్రారంభమైంది. ఇది కూడా జీవిత బీమాకి సంబంధించినది
- 18-50 యేళ్ళ వయస్సున్న వారికి వర్తిస్తుంది.
- 2 లక్షల రూపాయల బీమా సదుపాయం ఉంటుంది. కల్పిస్తారు.
- బీమా ప్రీమియంగా ఏడాదికి రూ.330లు చెల్లించాలి.

23) ప్రధానమంత్రి సురక్షబీమా యోజన
- 2015లో ప్రారంభమైన ఈ పథకం ప్రమాద బీమాకి సంబంధించినది.
- ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించాలి.
- 18 - 70 యేళ్ళ వయస్సు ఈ యోజన వర్తిస్తుంది. రెండు లక్షల ప్రమాద బీమా
- వైకల్యానికి లక్ష రూపాయల బీమా ఇస్తారు.

24) శ్యాంప్రసాద్‌ ముఖర్జీ జాతీయ రూర్బన్‌ మిషన్‌
- 2016 ఫిబ్రవరి 21న చత్తీస్‌గఢ్‌లోని కురుభాత్‌ గ్రామంలో ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.
- పట్టణ ప్రాంత సౌకర్యాలను గ్రామాల్లో కూడా కల్పిస్తారు.
- మూడేళ్ళలో 300 స్మార్ట్‌ విలేజ్‌లను అభివృద్ధి చేయడమే లక్ష్యం.
- దేశంలోని గ్రామీణ-పట్టణ ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం.



EmoticonEmoticon