వ్ర వంచంలో లిఖించబడిన వ్రతి రాజ్యాంగానికి సాధారణ మరియు విశిష్ట లక్షణాలు ఉంటాయి. రాజ్యాంగ రచనా సమయానికి ఆ దేశంలో నెలకొనివున్న రాజకీయ, సాంసృతిక, చారిత్రక పరిస్థితులు ఈ లక్షణాలలో చోటు చేసుకుంటాయి. అలాంటి లక్షణాలు భారత రాజ్యాంగంలో కూడా చాలా ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత శ్రేష్టమైన, ఉత్తమమైన రాజ్యాంగంగా అభివర్ణించవచ్చు. రాజ్యాంగంలో పొందుపరచిన వివిధ అంశాలను పరిశీలిస్తే రాజ్యాంగ విశిష్టత, ప్రత్యేకత స్పష్టమవుతుంది. ఆ ప్రత్యేక లక్షణాలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు
అతి పెద్ద లిఖిత రాజ్యాంగం:
ప్రపంచ లిఖిత రాజ్యాంగాలలో అతి పెద్ద రాజ్యాంగం. సుదీర్ఘ స్వభావాన్ని రాజ్యాంగంలో ఉన్న ప్రకరణలు, భాగాలు, షెడ్యూల్లు రూపంలో గుర్తిస్తారు. రాజ్యాంగము అమలులోకి వచ్చే సమయానికి, అనగా 1950 జనవరి 26 నాటికి 395 ప్రకరణాలు 22 భాగాలు,మరియు 8 షెడ్యూళ్ళు ఉండేవి. ప్రస్తుతము 465 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. వీటి సంఖ్య కాలానుగుణంగా మారుతూ ఉంటుంది.
కొత్తగా చేర్చిన ప్రకరణల సంఖ్య 92 కాగా, తొలగించబడిన ప్రకరణల సంఖ్య 22 (వీటి గురించి వివరణ రాజ్యాంగ సవరణ ఛాప్టర్లో చూడండి).
గమనిక ముసాయిదా రాజ్యాంగంలో, అనగా రాజ్యాంగపరిషత్తు ఆమోదించకముందు 315 ప్రకరణలు, 8 షెడ్యూల్స్ ఉండేవి
ప్రత్యేక వివరణ:
పాఠకులు ప్రకరణల సంఖ్యకు సంబంధించి ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా ఒక కొత్త ప్రకరణ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆంగ్ల అక్షరాలయిన "ABCD" ల రూపంలో సూచిస్తారు. అంతేకాని వాటికి ప్రత్యేక సంఖ్యను ఇవ్వరు. అలాగే తొలగించబడిన ప్రకరణను ఖాళీగా ఉంచుతారు. ప్రకరణల సంఖ్యను సర్దుబాటు చెయ్యరు. ఉదాహరణకు నిబంధన 31 లోని ఆస్థి హక్కును తొలగించారు. అయితే ఆ తరువాత నిబంధన 31లో చేర్చిన అంశాలను 31A,31B,31C లుగా గుర్తిస్తారు. కనుక మౌలిక రాజ్యాంగంలోని నిబంధనల సంఖ్యల వారిగా 395కు మించదు. ఇదే పద్ధతి భాగాలకు కూడా వర్తిస్తుంది. అయి క్రొత్తగా చెర్చిన ప్ర S
కలుపుకుంటే మొత్తం నిబంధనల సంఖ్య వస్తుంది. ఈ క్రింది విధంగా వీటిని గుర్తుంచుకోవచ్చు
EmoticonEmoticon