Daily Current Affairs in Telugu 22.09.2018


01) ఈనెల 27న శాసన మండలి సమావేశం జరుగుతోంది. గతంలో శాసనసభ రద్దయినా మండలి సమావేశాలు ఎప్పుడెప్పుడు కొనసాగాయి ?

*జ: ఎప్పుడూ కొనసాగలేదు. ఇదే మొదటిసారి*
*(నోట్: నిబంధనల ప్రకారం మండలి ఒక సమావేశానికి మరో సమావేశానికి మధ్య 6 నెలల లోపు ఉండాలి. అందుకే సమావేశం జరుగుతోంది )*

02) రాష్ట్ర ఎన్నికల సంఘంలో సంయుక్త ముఖ్య ఎలక్టోరల్ అధికారిగా ఎవరిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది ?

*జ: ఆమ్రపాలి ( ప్రస్తుతం GHMC అదనపు కమిషనర్ గా పనిచేస్తున్నారు )*

03) ఆంధ్ర బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్, CEO గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?

*జ: జె. పకిరిసామీ*

04) రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ శిల్పాచార్యుడు ఎక్కా యాదగిరి రావుకి గౌరవ డాక్టరేట్ ప్రకటించిన యూనివర్సిటీ ఏది ?

*జ: గీతం యూనివర్సిటీ*

05) యాసంగి పెట్టుబడి కోసం రైతులకు రెండో విడత రైతు బంధు చెక్కులు ఎప్పటి నుంచి పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది ?సైదేశ్వర రావు

*జ: 2018 అక్టోబర్ 2 నుంచి*

06) రాష్ట్రంలో అటవీ ప్రాంతాల్లో గడ్డి మైదానాలు పెంచాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదట ఏయే టైగర్ రిజర్వ్ లో గడ్డి మైదానాలను పెంచనున్నారు ?*

*జ: కవ్వాల్, అమ్రామాద్ టైగర్ రిజర్వ్ లో*

07) ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) పేరుతో వస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ను ప్రధాని నరేంద్ర మోడీ 2018 సెప్టెంబర్ 23న ఎక్కడ ప్రారంభించనున్నారు ?

*జ: జార్ఖండ్ రాజధాని రాంచీలో*

08) 2018-19లో భారత వృద్ది రేటు ఎంతగా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది ?

*జ.: 7.8శాతం*

09) సొంతంగా వెహికిల్ నడిపే యజమానికి వర్తించే తప్పనిసరి వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ మొత్తాన్ని ఎంతకు పెంచుతూ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార మండలి ( IRDA) ఆదేశాలు జారీ చేసింది ?

*జ: రూ.15 లక్షలు* *( ప్రీమియం రూ.750 చెల్లించాలి)*

10) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఛైర్మన్ గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?

*జ: అనిల్ కుమార్ చౌదరి*

11) విశాఖ ఉక్కు సీఎండీగా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?

*జ: పి.కె.రత్*

12) దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ( జీవిత చరిత్ర) తో మూవీ రాబోతుంది. ఆ మూవీ పేరేంటి ?

*జ: ది ఐరన్ లేడీ*
*(నోట్: పేపర్ టేల్ పిక్చర్స్ పతాకంపై ప్రియదర్శిని ఈ సినిమాని నిర్మిస్తున్నారు )*

13) 2018 సంవత్సరానికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఎవరెవరికి ప్రకటించారు ?

*జ: విరాట్ కోహ్లీ, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను*

14) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన వియత్నాం అధ్యక్షుడు ఎవరు ?

*జ: ట్రాన్ డాయ్ క్వాంగ్*

15)  ఇటీవల పెప్సికో CEO బాధ్యతలనుండి వైదొలిగిన మహిళా పారిశ్రామికవేత్త ఎవరు?

*జ: ఇంద్రానూయి*

16)  ఇయాన్ నురిమాన్  ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచారు?

*జ: 18వ ఆసియా క్రీడల్లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడు*

18)  ప్రస్తుత సిక్కీం రాష్ట్ర గవర్నర్ ఎవరు?

*జ: గంగాప్రసాద్*

19)  తెలంగాణ రాష్ట్ర నూతన అడ్వకేట్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు?

*జ: బండా శివానంద ప్రసాద్*

20)  ట్రాయ్ ఛైర్మన్ గా మరోసారి ఎవరు నియమితులయ్యారు?

*జ: రాంసేవక్ శర్మ*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv