*✅ తెలుసుకుందాం ✅*
*🛰రోదసిలోకి మొదటి ఉపగ్రహాన్ని ఎప్పుడు పంపించారు? ప్రస్తుతం ఎన్ని ఉపగ్రహాలున్నాయి?*
✳1957 అక్టోబరులో సోవియట్ యూనియన్ ఒక రాకెట్‌ను ఉపయోగించి మొట్ట మొదటి మానవ నిర్మిత ఉపగ్రహాన్ని రోదసిలోకి, భూమి చుట్టూ ఉండే కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
దీంతో అప్పటి వరకు అంతరిక్ష ప్రయోగాల్లో తామే ముందున్నామనుకున్న అమెరికాకు కొంత నిరుత్సాహం, దిగులు ఏర్పాడ్డాయి. అలా రష్యా ప్రయోగించిన స్పుత్నిక్ 1 రోదసిలో 57 రోజుల పాటు బీప్ -బీప్ శబ్దాలు చేసి చివరకు వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయింది.
అమెరికన్లు వారి మొదటి ఉపగ్రహమైన ఎక్స్‌ప్లోరర్ 1ని రోదసిలోకి ప్రవేశపెట్టడానికి 1958 జనవరి వరకు పట్టింది. ఇది శాస్త్రీయ ఉపగ్రహంగా పేరుగాంచింది. ఎందుకంటే ఇది భూమి చుట్టూ ఉండే శక్తిమంతమైన విద్యుదావేశ కణాలతో కూడిన ‘వాన్ ఎలెన్’ వికిరణ పట్టీలను కనిపెట్టింది.
1957 నుంచి ఇప్పటి వరకు సుమారు ఆరు వేలకుపైగా ఉపగ్రహాల్ని వేరు వేరు దేశాలు రోదసిలోకి ప్రవేశపెట్టాయి. వీటిలో సుమారు 3,200 ఇప్పటికే భూమి చుట్టూ తమ తమ కక్ష్యల్లో తిరుగుతున్నాయి. వీటిలో దాదాపు 1200 మాత్రమేపనిచేస్తున్నాయి.మిగిలినవి వ్యర్థంగానే తిరుగుతున్నాయి.

EmoticonEmoticon