బ్యాండ్ ఎయిడ్‌ను కనిపెట్టిందెవరు?

బ్యాండ్ ఎయిడ్‌ను కనిపెట్టిందెవరు?


✳బ్యాండ్ ఎయిడ్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం-మనకు ఏ కాస్త దెబ్బ తగిలినా, బ్లేడుకోసుకున్నా, రక్తం వచ్చినా వెంటనే బ్యాండ్ ఎయిడ్ చుట్టుకుంటుంటాం.

బ్యాండ్ ఎయిడ్‌ను సృష్టించిన వ్యక్తి పేరు 'ఎర్లే డిక్సన్' ఈయన 'జాన్సన్ అండ్ జాన్సన్' కంపెనీ ( అమెరికా) లో ఉద్యోగం చేసేవాడు. అయితే ఈయన భార్య ఇంట్లో వంట చేసేటప్పుడు తరచుగా చేయి కోసుకోవడం, కాల్చుకోవడం వంటి ప్రమాదాలకు గురయ్యేది. అప్పట్లో తెగిన, కాలిన గాయాలకు దూదితో కట్టు కట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఇది చాలా టైము పట్టే తతంగం. డిక్సన్ తన భార్యకు పదే పదే కట్టు కట్టలేక సులభంగా ఉండే 'బ్యాండ్ ఎయిడ్' ను 1920 లో కనిపెట్టాడు. నడిమధ్యలో దూది ఉండి, సులభంగా అంటుకుపోయే ఈ టేప్‌ను తయారు చేశాక డిక్సన్‌కు ఇంట్లో కష్టాలు తీరాయి. ఈ సంగతి 'జాన్సన్ అండ్ జాన్సన్' వాళ్ళతో డిక్సన్ చర్చించాడు. ఇతని ఆలోచనను మెచ్చిన ఆ సంస్థ 'బ్యాండ్ ఎయిడ్' తయారు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బ్యాండ్ ఎయిడ్ ఎంత ఆదరణ పొందుతుందో అందరికీ తెలిసిందే. చూశారా! ఒక చిన్న ఆలోచన డిక్సన్‌తో పాటు అందరికీ ఎంత మేలు చేసిందో...

బ్యాండ్ ఎయిడ్‌ను కనిపెట్టిందెవరు?

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv