రెఫ్రిజరేటర్ తలుపును తెరిచి ఉంచితే గది చల్లబడుతుందా?

ప్రశ్న: రెఫ్రిజరేటర్ తలుపును తెరిచి ఉంచితే గది చల్లబడుతుందా?



జవాబు: రెఫ్రిజరేటర్తలుపును తెరిచి ఉంచితే గది చల్లబడదు సరి కదా అంతకు ముందు కన్నా వేడెక్కుతుంది. రెఫ్రిజరేటర్లో సులభంగా ఆవిరయ్యే ఫ్రియాన్అనే ద్రవ పదార్థాన్ని బోలుగా ఉండే సన్నని తీగ చుట్టల ద్వారా ప్రవహింపచేస్తారు. ద్రవాన్ని 'రెఫ్రిజరెంట్‌' అంటారు. ద్రవం ఫ్రిజ్లో ఉండే పదార్థాల వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది. ఫ్రిజ్లో చల్లదనాన్ని కలుగచేస్తుంది. ఆవిరిగా మారే ఫ్రియాన్తిరిగి ఫ్రిజ్లో ఉండే కండెన్సర్లో పీడనానికి గురయి, మళ్లీ ద్రవంగా మారుతుంది. ఇది తిరిగి ద్రవరూపాన్ని పొందేటపుడు అది అంతకు మునుపు ఫ్రిజ్లో గ్రహించిన వేడి ఫ్రిజ్వెనుక భాగం నుంచి బయటకుపోతుంది. ఇపుడు ఫ్రిజ్తలుపును తీసి ఉంచితే వేడి ఫ్రిజ్వెనుక భాగం నుంచి కాకుండా విశాలంగా ఉన్న ముందు భాగం నుంచి బయటకు రావడంతో గది వేడెక్కుతుంది.
రెఫ్రిజరేటర్ తలుపును తెరిచి ఉంచితే గది చల్లబడుతుందా?


no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv