భారతదేశ భౌగోళిక శాస్త్రం - అక్షాంశాలు – రేఖాంశాలు- మాదిరి ప్రశ్నలు
1) అక్షాంశాలు రేఖాంశాలను మొదట
గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు?
జ: హిప్పార్కస్ (ఆస్ట్రలోబ్
అనే పరికరాన్ని రూపొందించాడు)
2) భూమిపై గల అక్షాంశాలలో అతి
పెద్దది ఏది?
జ: భూ మధ్యరేఖ
3) ఉత్తర దక్షణ ధృవాలను కలుపుతూ
భూమధ్యరేఖను ఖండిస్తూ గీయబడిన అర్ద వృత్తాలను ఏమంటారు?
జ: రేఖాంశాలు
4) ప్రపంచంలోఎక్కువ కాల మండలాలు
గల దేశం ఏది?
జ: ఫ్రాన్స్ (12)
5) ప్రపంచంలో సూర్యుడు మొదటగా
ఉదయించే దేశం ఏది?
జ: జపాన్
6) ప్రపంచంలో సూర్యుడు చివరగా
అస్తమించే దేశం ఏది?
జ: అమెరికా (అలస్కా)
7) గ్రీనిచ్ దగ్గర సూర్యుడు
నడినెత్తిన ప్రకాశించినపుడు పగలు 12 గంటలు చూపే గడియారాన్ని ఏమంటారు?
జ: కాలమాపకం
8) కాల మాపకాన్ని ఎవరు ఏ సంవత్సరంలో
కనుగొన్నారు?
జ: జాన్ హరిసన్ 1737.
9) 0 డిగ్రీ అంక్షాంశం అంటే
ఏంటి ?
జ: భూమధ్య రే
10) 23 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం,
దక్షిణ అక్షాంశం ఏది ?
జ: ఉత్తర అక్షాంశం - కర్కట రేఖ,
దక్షిణ అక్షాంశం - మకర రేఖ
11) 66 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం,
దక్షిణ అక్షాంశం ఏవి ?
జ: ఉత్తర - ఆర్కిటిక్ వలయం,
దక్షిణం - అంటార్కిటిక్ వలయం
12) అంతర్జాతీయ దిన రేఖ అని
దేన్ని పిలుస్తారు ?
జ: 180 డిగ్రీల తూర్పు పశ్చిమ
రేఖాంశాన్ని
13) 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారు
?
జ: గ్రీనిచ్ రేఖాంశం ( ప్రధాన
రేఖాంశం)
14) అంతర్జాతీయ దిన రేఖ పసిఫిక్
మహాసముద్రం గుండా ప్రయాణించేటప్పుడు ఏ జలసంధిని ఖండిస్తుంది ?
జ: బేరింగ్ జలసంధి
15) గ్రీనిచ్ రేఖ ప్రయాణించే
దేశాలు ఏంటి ?
జ: బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్,
అల్జీరియా, మాలి, బర్మినోపోసో, ఘనా
16) భారత్ కాలమానం 82 1/2 డిగ్రీల
తూర్పు రేఖాంశం ఆధారంగా నిర్ణయించారు. అయితే ఇది గ్రీనిచ్ కాలమానం కంటే ఎన్ని కంటే
ముందు ఉంటుంది ?
జ: ఐదున్నర గంటలు
17) ఏయే దేశాలు 82 1/2 డిగ్రీల
తూర్పు రేఖాంశాన్ని ప్రమాణికంగా తీసుకున్నాయి ?
జ: భారత్, నేపాల్, శ్రీలంక
EmoticonEmoticon