అండమాన్‌లో మూడు దీవుల పేరు మార్పు

*🔴అండమాన్‌లో మూడు దీవుల పేరు మార్పు*


పోర్ట్‌ బ్లెయిర్‌ (అండమాన్‌ నికోబార్‌): అండమాన్‌ నికోబార్‌ దీవుల సముదాయంలోని మూడు దీవుల పేర్లను మార్చారు. పోర్ట్‌ బ్లెయిర్‌ పర్యటన సందర్భంగా ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ఈ దీవుల పేర్లను ప్రకటించారు. ద రోస్‌ ఐలాండ్‌ దీవిని నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ ద్వీప్‌గా, ద నెయిల్‌ ఐలాండ్‌ను షాహీద్‌ ద్వీప్‌, హావ్‌లాక్‌ ఐలాండ్‌ను స్వరాజ్‌ ద్వీప్‌ అని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా సుభాశ్‌ చంద్రబోస్‌ మొదటిసారి జాతీయ జెండా ఎగుర వేసి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వీటి పేర్లను మార్చారు. ఈ సందర్భంగా ప్రధాని రూ.75 నాణేన్ని, నేతాజీ స్మారక స్టాంపును కూడా విడుదల చేశారు. పోర్ట్‌ బ్లెయిర్‌లో డీమ్‌డీ నేతాజీ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతామని ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. అంతకుముందు మెరీనా పార్కుకు చేరుకున్న ప్రధాని 150 అడుగుల పొడవైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సుభాశ్‌ చంద్రబోస్‌ విగ్రహానికి పూలతో నివాళి అర్పించారు.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv