Indian Geography - Agriculture Practice Bits

1) భారతదేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత?

ఎ) 53%  బి) 75%  సి) 25%  డి) 65%



2. భారతదేశ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉన్న ప్రాంతం?

ఎ) భోపాల్‌ బి) కాకినాడ సి) న్యూఢిల్లీ డి) బెంగళూరు



3. భారతదేశ వరి ధాన్యాగారం అని ఏ ప్రాంతానికి పేరు?

ఎ) గంగా-సింధూ నదీ మైదానం బి) కృష్ణా-గోదావరి నదుల మైదానం

సి) తూర్పుతీర ప్రాంతం డి) కేరళ



4. వరి పంటకు అనువైన వాతావరణ పరిస్థితులు?

ఎ) ఉష్ణ, పొడి శీతోష్ణస్థితి బి) ఉష్ణ, ఆర్థ్ర శీతోష్ణస్థితి

సి) శీతల, ఆర్థ్ర శీతోష్ణస్థితి డి) శీతల, పొడి శీతోష్ణస్థితి



5. వరి పంటలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

ఎ) ఆంధ్రప్రదేశ్‌ బి) ఉత్తరప్రదేశ్‌  సి) పశ్చిమ బెంగాల్‌ డి) పంజాబ్‌



6. ‘శ్రీ’ రకం వంగడం ఏ పంటకు చెందింది?

ఎ) వేరుశనగ బి) పత్తి సి) మిరప డి) వరి



7. వరి పంటకు అనుకూలమైన నేల?

ఎ) నల్లనేల బి) ఒండ్రు నేల సి) ఎర్ర నేల డి) ఇసుక నేల



8. మనదేశంలో వరి తరవాత ఎక్కువగా పండిస్తున్న పంట?

ఎ) గోధుమ బి) జొన్న సి) మొక్కజొన్న డి) బార్లీ



9. ‘సూపర్‌ రైస్‌’ను కనుగొన్నది?

ఎ) స్వామినాథన్‌ బి) గురగోవింద్‌ కుష్‌ సి) రామన్‌ డి) ఎం.పి.శర్మ



10. గోధుమ పంటకు కావాల్సిన ఉష్ణోగ్రత?

ఎ) 5-10 డిగ్రీల సెల్సియస్‌ బి) 15-20 డిగ్రీల సెల్సియస్‌

సి) 25 డిగ్రీల సెల్సియస్‌ డి) 35 డిగ్రీల సెల్సియస్‌



11. భారతదేశంలో అత్యధిక గోధుమ ఉత్పాదకత ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది?

ఎ) ఉత్తరప్రదేశ్‌ బి) పంజాబ్‌ సి) హర్యానా డి) బెంగాల్‌



12. గోధుమ పంటను విస్తారంగా పండి స్తున్న రాష్ట్రం?

 ఎ) ఉత్తరప్రదేశ్‌ బి) పంజాబ్‌ సి) హర్యానా డి) రాజస్థాన్‌



13. మనదేశంలో మొదట హరిత విప్లవం ఎప్పుడు జరిగింది?

ఎ) 1952-55 బి) 1955-56 సి) 1967-68 డి) 1970-72



14. హరిత విప్లవ ప్రభావం ఆహార పంటల్లోని దేనిపై ఎక్కువ చూపింది?

ఎ) వరి బి) గోధుమ సి) జొన్న డి) మొక్కజొన్న



15. మనదేశంలో హరిత విప్లవ ప్రభావానికి గురికాని పంట?

ఎ) గోధుమ బి) జొన్న సి) పప్పుదినుసులు డి) వరి



16. కింది వారిలో హరిత విప్లవంతో సంబంధం ఉన్న వ్యక్తి?

ఎ) కె.ఎం.మున్షి బి) బాబా ఆమ్టే సి) సి.వి.రామన్‌ డి) ఎం.ఎస్‌.స్వామినాథన్‌



17. ఐ.ఆర్‌.-8 అనేది ఏ పంటకు సంబంధించింది?

ఎ) గోధుమ బి) వరి సి) చెరుకు డి) పొగాకు



18. మొక్క జొన్న ఏ రకమైన పంట?

ఎ) ఖరీఫ్‌ బి) రబీ సి) వేసవి పంట డి) ఎ, బి



19. భారత్‌లో పత్తి ఉత్పత్తి అత్యధికంగా ఉన్న రాష్ట్రం?

ఎ) ఆంధ్రప్రదేశ్‌ బి) గుజరాత్‌ సి)మహారాష్ట్ర డి) ఉత్తర ప్రదేశ్‌



20. కిందివాటిలో భూసారాన్ని ఎక్కువగా హరించే పంట?

ఎ) చెరకు బి) పత్తి సి) మిరప డి) పొగాకు



21. మనదేశంలో పప్పుధాన్యాల్లో అధికంగా పం డించేది?

ఎ) పెసర్లు బి) శనగలు సి) కందులు డి)మినుములు



22. వేరుశనగ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

ఎ)కర్ణాటక బి)ఆంధ్రప్రదేశ్‌ సి)గుజరాత్‌ డి)మహారాష్ట్ర



23. దేశంలో పశువుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రం?

ఎ) బీహార్‌ బి) ఉత్తర ప్రదేశ్‌ సి)గుజరాత్‌ డి) ఆంధ్రప్రదేశ్‌



24. పొగాకు అధికంగా పండే రాష్ట్రం?

ఎ) బెంగాల్‌ బి) బీహార్‌ సి) ఒడిశా డి) ఆంధ్రప్రదేశ్‌



25. భారతదేశంలో తేయాకు ఉత్పత్తిలో అగ్ర స్థానంలో ఉన్న రాష్ట్రం?

ఎ) అసోం బి) బీహార్‌ సి) కేరళ డి) కర్ణాటక



26. ఆముదాల ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

ఎ) తెలంగాణ బి) బీహార్‌ సి) మహారాష్ట్ర డి) ఆంధ్రప్రదేశ్‌



27. ‘షుగర్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’ ఏది?

ఎ) హర్యానా బి) ఉత్తర ప్రదేశ్‌ సి) బీహార్‌ డి) ఒడిశా



28. జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

ఎ) అసోం బి) మధ్యప్రదేశ్‌ సి) మహారాష్ట్ర డి) పశ్చిమ బెంగాల్‌



29. కాఫీని అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?

ఎ) కేరళ బి) తమిళనాడు సి) కర్ణాటక డి) ఒడిశా



30. నూనె గింజలు అధికంగా పండించే రాష్ట్రం?

ఎ) రాజస్థాన్‌ బి) గుజరాత్‌ సి) మహారాష్ట్ర డి) తమిళనాడు



31. మాంసంతో సమానమైన ప్రోటీన్‌ శాతం కలిగిన పంట కిందివాటిలో?

ఎ) జొన్న బి) మొక్క జొన్న సి) సోయాచిక్కుడు డి) పెసర్లు



32. ‘స్పైస్‌ గార్డెన్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఏ రాష్ట్రానికి పేరు?

ఎ) తమిళనాడు బి) కేరళ సి) కర్ణాటక డి) మహారాష్ట్ర



33. గోల్డెన్‌ ఫైబర్‌ ఆఫ్‌ ఇండియా అని దేనికి పేరు?

ఎ) చెరకు బి) మొక్కజొన్న సి) జనపనార డి) పత్తి



34. మనదేశంలో పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

ఎ) మహారాష్ట్ర బి) కర్ణాటక సి) కేరళ డి) జమ్మూకాశ్మీర్‌



35. భారత వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

ఎ) మైసూర్‌ బి) తిరువనంతపురం సి) కటక్‌ డి) కోల్‌కత్తా



36. కేంద్ర మామిడి పరిశోధన కేంద్రం ఎక్కడుంది?

ఎ) నూజివీడు బి) బెంగళూరు సి) అహ్మదాబాద్‌ డి) లక్నో



37. పోడు వ్యవసాయం నేటికీ ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం?

ఎ) ఒడిశా బి) బీహార్‌ సి) చత్తీస్‌గఢ్‌ డి) బెంగాల్‌



38. క్షీర విప్లవ పితామహుడు ఎవరు?

ఎ) రామనాథ్‌ కృష్ణన్‌ బి) వర్గీస్‌ కురియన్‌

సి) ఎం.ఎస్‌.స్వామినాథన్‌ డి) కె.ఎం.మున్షి



39. ‘యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతం?

ఎ) ఢిల్లీ బి) లక్నో సి) చెన్నై డి) హైదరాబాద్‌



40. సెంట్రల్‌ షీప్‌ బ్రీడింగ్‌ ఫార్మ్‌ ఎక్కడుంది?

ఎ) డార్జిలింగ్‌ బి) హిస్సార్‌ సి) ఊటీ డి) లక్నో



41. సముద్ర చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

ఎ) గుజరాత్‌ బి) తమిళనాడు సి) కేరళ డి) కర్ణాటక



42. మనదేశంలో ముత్యపు చిప్పలు అధికంగా లభ్యమయ్యే తీర ప్రాంతం ఏది?

ఎ) ధనుష్కోటి బి) కన్యాకుమారి సి) ట్యుటికోరన్‌ డి) గోవా

సమాధానాలు

1) ఎ 2) సి 3) బి 4) బి 5) సి 6) డి 7) బి 8) ఎ 9) బి 10) బి 11) బి 12) ఎ 13) సి



14) బి 15) సి 16) డి 17) ఎ 18) ఎ 19) బి 20) డి 21) బి 22) సి 23) బి 24) డి 25) ఎ



26) ఎ 27) బి 28) డి 29) సి 30) బి 31) సి 32) బి 33) సి 34) బి 35) సి  36) డి





37) ఎ 38) బి 39) సి 40) బి 41) సి 42) సి

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv