*🌏 వ్యోమగాముల దుస్తుల సంగతేంటి? - స్పేస్ సూట్ ఎలా పని చేస్తుంది? - 🌏*
అంతరిక్షం, అంతరిక్ష స్థావరాల్లో ఉష్ణోగ్రతలు, వాతావరణ పీడనాలు, రసాయనిక సంఘటనలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి.
ఉదాహరణకు మనం భూమి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరం దాటి వెళ్తే మన శరీరంలో ఉన్న నీరు మన దేహ ఉష్ణోగ్రత దగ్గరే బాష్పీభవనం అవుతుంది.
శరీరపు చర్మం ఉబ్బి బెలూన్‌లాగా మారి పగిలిపోతాం. చంద్రోపరితలం మీద ఓ వైపు అత్యధికంగా సుమారు 125 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది.
అత్యల్పంగా -170 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుంది. కొన్ని గ్రహాల వాతావరణంలో విషవాయువులు ఉంటాయి. అంతరిక్ష ప్రయోగశాలల రిపేర్ల కోసం వెళ్తే అక్కడ ప్రమాదవశాత్తు తేలికపాటి ఉల్కలు చాలా వేగంగా వచ్చి బుల్లెట్ల మాదిరి శరీరాన్ని ఛిద్రం చేయగలవు.
కాబట్టి ఇలాంటి గడ్డు స్థితిగతుల్ని ఎదుర్కొనేలా అంతరిక్ష వస్త్రాలు ఉండాలి. పైగా అంతరిక్షంలో ఓజోన్ ఉండదు కాబట్టి విపరీతమైన ఉధృతిలో అతినీలలోహిత కిరణాల దారి కూడా ఉంటుంది. వాడాల్సిన విధానాన్ని బట్టి అంతరిక్ష దుస్తులను వివిధ పదార్థాలు, భంగిమలతో తయారు చేస్తారు.
సాధారణంగా సిలికాన్, ఆస్బెస్టాస్ ఆధారిత పోగులలో చాలా పొరలు, లోహ జాయింట్లు ఉండేలా శిరస్త్రాణాలు (హెల్మెట్లు), పై దుస్తులు ఉంటాయి. వీటికి అవసరాన్ని బట్టి వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల్ని, ఆక్సిజన్ సిలిండర్లను అమరుస్తారు. చాలా వరకు పదార్థాల రసాయనిక తత్త్వాన్ని గోప్యంగా ఉంచుతారు.

EmoticonEmoticon