AP EAM CET 2019 Notification Details
*20న ఏపీ ఎంసెట్-2019 నోటిఫికేషన్*
ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్-2019కి ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 26 నుంచి నెల రోజులపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. రూ. 500 అపరాధ రుసుంతో మార్చి 28 నుంచి ఏప్రిల్ 4 వరకు.. రూ. వెయ్యి అపరాధ రుసుంతో ఏప్రిల్ 9 వరకు దరఖాస్తుకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది.
రూ. 5వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 14 వరకు, రూ. 10వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ 16 నుంచి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఏప్రిల్ 20, 21, 22, 23 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్ష.. ఏప్రిల్ 23, 24 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష ఉంటుందని తెలిపింది. మే 5న ఫలితాలు వెల్లడించనుంది.
EmoticonEmoticon