Showing posts with label Common Entrance tests. Show all posts
Showing posts with label Common Entrance tests. Show all posts
నన్నయ సెట్‌-2019 నోటిఫికేషన్‌ విడుదల

నన్నయ సెట్‌-2019 నోటిఫికేషన్‌ విడుదల

*📚నన్నయ సెట్‌-2019 నోటిఫికేషన్‌ విడుదల*

*➡మే 7 నుంచి 9 వరకూ ప్రవేశ పరీక్షలు*

📚విశాఖలోని ఎయు ప్లాటినం జూబ్లీ హాల్లో 'నన్నయ సెట్‌-2019' నోటిఫికేషన్‌ను ఆ వర్సిటీ రెక్టార్‌ ఆచార్య పి.సురేష్‌వర్మ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో (ఎకెఎన్‌యు) చేరేందుకు ఉత్తరాంధ్ర విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసే విద్యార్థుల్లో ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు. అందుకే విశాఖలో సెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నామన్నారు. వర్సిటీ రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడేం క్యాంపస్‌లతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లో 46 అనుబంధ కళాశాలను కలిగి ఉందన్నారు.

📚వచ్చే విద్యా సంవత్సరానికిగానూ వర్సిటీలో చేరడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు నన్నయ సెట్‌-2019లో అర్హత సాధించాలన్నారు. ఆర్ట్స్‌లో 14 పిజి కోర్సులు, సైన్స్‌లో 17 పీజీ కోర్సులకు సంబంధించి 11 టెస్ట్‌లు నిర్వహిస్తున్నామన్నారు. జనరల్‌ అభ్యర్థులు రూ.500, ఎస్‌సి, ఎస్‌టి, పిహెచ్‌ అభ్యర్థులు రూ.300 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు.

📚పరీక్షలకు సంబంధించి ఫిబ్రవరి 28 నుంచే ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఏప్రిల్‌ 15 వరకూ గడువు ఉందని తెలిపారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 25వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, రాజమ హేంద్రవరం, రంపచోడవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, జంగారెడ్డిగూడెం కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

📚మే 7 నుంచి 9వ తేదీ వరకూ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్‌ 27 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు పొందవచ్చన్నారు. ఆర్ట్స్‌లో మొత్తం 2600 సీట్లు ఉండగా క్యాంపస్‌లో 280, కాకినాడ పిజి సెంటర్‌లో 210, అనుబంధ కళాశాలల్లో 2110 సీట్లున్నాయన్నారు. సైన్స్‌లో మొత్తం 3475 సీట్లు ఉండగా క్యాంపస్‌లో 307, కాకినాడలో 30, తాడేపల్లిగూడేంలో 60, అనుబంధ కళాశాలల్లో 3078 సీట్లున్నాయని చెప్పారు.

📚అనంతరం వివరాలతో కూడిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (డిఒఎ) ఆచార్య కెవి.స్వామి, డిఒఎ డాక్టర్‌ ఎం.కామేశ్వరి, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమణేశ్వరి పాల్గొన్నారు.
Andhra Pradesh Common Entrance Test - Important Dates

Andhra Pradesh Common Entrance Test - Important Dates

*🔥AP Entrance Tests-2019🔥*

*🌷AP EAMCET:*

👉అప్లికేషన్ మొదలు:26-02-2019

👉అప్లై చేయటానికి ఆఖరు తేది: 27-03-2019

👉పరీక్ష తేది : 20,21,22,23 - 04-2019

*🌷AP I-CET:*

👉అప్లికేషన్ మొదలు:27-02-2019

👉అప్లై చేయటానికి ఆఖరు తేది: 27-03-2019

👉పరీక్ష తేది : 26-04-2019

*🌷AP POLYCET:*

👉అప్లికేషన్ మొదలు: 14-03-2019

👉అప్లై చేయటానికి ఆఖరు తేది: 14-04-2019

👉పరీక్ష తేది : 27-04-2019

*🌷AP E-CET:*

👉అప్లికేషన్ మొదలు: 18-02-2019

👉అప్లై చేయటానికి ఆఖరు తేది: 27-03-2019

👉పరీక్ష తేది : 19-04-2019

*🌷ANU PGCET:*

👉అప్లికేషన్ మొదలు: 02-03-2019

👉అప్లై చేయటానికి ఆఖరు తేది: 20-04-2019

👉పరీక్ష తేది :1,2,3-05-2019

*🌷AP PGECET:*

👉అప్లికేషన్ మొదలు: 01-03-2019

👉అప్లై చేయటానికి ఆఖరు తేది: 30-03-2019

👉పరీక్ష తేది :2,3,4-05-2019

*🌷AP LAWCET:*

👉అప్లికేషన్ మొదలు: 09-03-2019

👉అప్లై చేయటానికి ఆఖరు తేది: 10-04-2019

👉పరీక్ష తేది :06-05-2019

*🌷APRJC& APRDC*

👉దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 27.3.19

*🌷Ed. cet*

👉దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 24.4.19

*🌷ఏపీ గిరిజన సంక్షేమ గురుకులల్లో ప్రవేశం(8th, inter)*

👉దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 25.3.19

*🌷ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి లో ప్రవేశం*

👉 దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 4.4.19

*🌷పాలిసెట్*

👉 దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 5.4.19

*🌷ఏపీ మోడల్ స్కూళ్ల లో ఇంటర్ అడ్మిషన్లు*

👉 దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ : 30.4.19

*🌷 APPECET*

👉 దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 24.4.19

*🌷 అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ--డిగ్రీ కి అర్హత పరీక్ష*
👉 దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 28.3.1 9

*🌷 ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం లలో ఇంటర్ ప్రవేశాలు*

👉 దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 26.3.19

*🌷 KV లలో 1వ తరగతి లో ప్రవేశం*

👉 దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 19.3.19

*🌷 KV లలో 2 మరియు ఆ పై తరగతుల కోసం ప్రవేశం*

👉 దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 2.4.19

*🌷 ECET*

👉 దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 27.3.19

*🌷 జిప్మర్ పుదుచ్చేరి*

👉 దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 12.4.19

*GSRAO GK GROUPS*

*🌷 వీ సెట్*

👉 దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 5.4.19

*🌷 గీతం*
👉 దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 30.3.19

*🌷 బిట్స్ ఫిలానీ*

👉 దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 20.3.19

*🌷 నన్నయ సెట్*

👉 దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ: 15.4.19


TS POLYCET - Telangana Polytechnic Common Entrance Test 2019 Notification

TS POLYCET - 2019

TS POLYCET - Telangana Polytechnic Common Entrance Test 2019 Notification


తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్) ప్రకటన విడుదలైంది. పరీక్ష ద్వారా 2019-20 విద్యా సంవత్సరానికిగానూ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

* అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.

* ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలి సెట్) ర్యాంకు ఆధారంగా.

* పరీక్ష తేది: ఏప్రిల్ 16

* ఆన్ లైన్ దరఖాస్తు: మార్చి 14 నుంచి ఏప్రిల్ 4 వరకు.

వెబ్ సైట్: https://polycetts.nic.in

TS POLYCET - Telangana Polytechnic Common Entrance Test 2019 Notification



Andhra Pradesh EdCET 2019 Notification

Andhra Pradesh EdCET 2019 Notification

ఏపీఎడ్సెట్-2019 బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఆంద్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఎడ్ సెట్) ప్రకటనను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విడుదల చేసింది. 

ఈ పరీక్ష ద్వారా 2019-20 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లలో ప్రవేశాలు కల్పిస్తారు. 

కోర్సు: రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్,

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. 

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆదారంగా. 

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ: 14.03. 2019 నుంచి 24.04. 2019 వరకు. 

పరీక్ష తేది: 06 05, 2019. 

వెబ్ సైట్: https:/scheap gov.in/