నన్నయ సెట్‌-2019 నోటిఫికేషన్‌ విడుదల

*📚నన్నయ సెట్‌-2019 నోటిఫికేషన్‌ విడుదల*

*➡మే 7 నుంచి 9 వరకూ ప్రవేశ పరీక్షలు*

📚విశాఖలోని ఎయు ప్లాటినం జూబ్లీ హాల్లో 'నన్నయ సెట్‌-2019' నోటిఫికేషన్‌ను ఆ వర్సిటీ రెక్టార్‌ ఆచార్య పి.సురేష్‌వర్మ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో (ఎకెఎన్‌యు) చేరేందుకు ఉత్తరాంధ్ర విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసే విద్యార్థుల్లో ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు. అందుకే విశాఖలో సెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నామన్నారు. వర్సిటీ రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడేం క్యాంపస్‌లతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లో 46 అనుబంధ కళాశాలను కలిగి ఉందన్నారు.

📚వచ్చే విద్యా సంవత్సరానికిగానూ వర్సిటీలో చేరడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు నన్నయ సెట్‌-2019లో అర్హత సాధించాలన్నారు. ఆర్ట్స్‌లో 14 పిజి కోర్సులు, సైన్స్‌లో 17 పీజీ కోర్సులకు సంబంధించి 11 టెస్ట్‌లు నిర్వహిస్తున్నామన్నారు. జనరల్‌ అభ్యర్థులు రూ.500, ఎస్‌సి, ఎస్‌టి, పిహెచ్‌ అభ్యర్థులు రూ.300 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు.

📚పరీక్షలకు సంబంధించి ఫిబ్రవరి 28 నుంచే ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఏప్రిల్‌ 15 వరకూ గడువు ఉందని తెలిపారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 25వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, రాజమ హేంద్రవరం, రంపచోడవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, జంగారెడ్డిగూడెం కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

📚మే 7 నుంచి 9వ తేదీ వరకూ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్‌ 27 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు పొందవచ్చన్నారు. ఆర్ట్స్‌లో మొత్తం 2600 సీట్లు ఉండగా క్యాంపస్‌లో 280, కాకినాడ పిజి సెంటర్‌లో 210, అనుబంధ కళాశాలల్లో 2110 సీట్లున్నాయన్నారు. సైన్స్‌లో మొత్తం 3475 సీట్లు ఉండగా క్యాంపస్‌లో 307, కాకినాడలో 30, తాడేపల్లిగూడేంలో 60, అనుబంధ కళాశాలల్లో 3078 సీట్లున్నాయని చెప్పారు.

📚అనంతరం వివరాలతో కూడిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (డిఒఎ) ఆచార్య కెవి.స్వామి, డిఒఎ డాక్టర్‌ ఎం.కామేశ్వరి, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమణేశ్వరి పాల్గొన్నారు.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv