గెలాక్సీలు ఢీకొంటే ఏమవుతుంది?
🔲ప్రశ్న : గెలాక్సీలు ఢీకొంటాయా? అలా ఢీకొంటే ఏమవుతుంది?
- జి.లిఖిత, శ్రీవెంకటేశ్వర బాలకుటీర్, గుంటూరు
- పి.సిద్ధార్థ చౌదరి, త్రివేణి టాలెంట్ పాఠశాల, ఆల్వాల్
జవాబు : రోడ్డు మీద రెండు వాహనాలు గుద్దుకున్నట్లో, క్రీడల్లో ఇద్దరు మల్లయుద్ధ ఆటగాళ్లు ఢీకొట్టుకున్నట్లో, గాలిలో అణువులు పరస్పరం గుద్దుకున్నట్టో గెలాక్సీలు ఉన్నఫళాన గుద్దుకోవు. అయితే కాలమనే కొలామానాన్ని ప్రక్కన బెడితే రెండు గెలాక్సీలు పరస్పర ఆకర్షణకు లోనయి, ఒకే గెలాక్సీగా మారడం అరుదేమీ కాదు. వంపు తిరిగిన పళ్లతో ఉన్నట్టుగా సైకిల్ గేరు చక్రంలాగా ఉండే ఒక గెలాక్సీ అంచుల పళ్లు మరో గెలాక్సీ అంచు పళ్లతో ఆకర్షణకు గురికావొచ్చును. అలా ఆకర్షణకు గురయి కొన్ని వేల సంవత్సరాల తర్వాత అవి పరస్పరం పరిభ్రమించుకొంటూ దగ్గరకు వస్తాయి. సింహరాశి (Constellation of Leo) గుండా హబుల్ టెలిస్కోప్ ద్వారా 2017 ప్రాంతంలో NGC 3447A, NGC 3447B అనే రెండు నక్షత్ర రాశులు(galaxies) కమ్రేపీ దగ్గరవుతున్నట్టు గుర్తించారు. ఈ జంటను NGC3447అంటారు. ఈ జంట గెలాక్సీలు మనకు సుమారు 6 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక కాంతి సంవత్సరం అంటే ఎంత దూరమో ఇదే శీర్షికలో పలుసార్లు తెలుసుకున్నాము. నూతన పాఠకుల కోసం మళ్లీ విశదపరుస్తాను. కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని ఒక కాంతి సంవత్సరం (Light Year) అంటారు. ఒక సెకనుకి కాంతి శూన్యంలో సుమారు 3 లక్షల కి.మీ. దూసుకుపోతుంది. ఆ లెక్కన నిమిషానికి 180 లక్షల కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. గంటకు 10800 లక్షల (లేదా 108 కోట్ల) కి.మీ. ప్రయాణిస్తుంది. ఒక్క రోజులో 2592 కోట్ల కి.మీ. ప్రయాణిస్తుంది. ఆ లెక్కన 365 (వాస్తవానికి 365.25) రోజులకు కాంతి శూన్యంలో సుమారు 94607 లక్షల కోట్ల (94607000000000000) కి.మీ. ప్రయాణిస్తుంది. ఈ దూర ప్రయాణాన్నే ఒక కాంతి సంవత్సరం అంటాము. ఇలాంటివి 6 కోట్ల ప్రమాణ దూరంలో NGC 3447 వుందన్నమాట. చిట్టెలుక లాగా ఉన్న జంట గెలాక్సీ ఒకటుంది. దాని పేరే చిట్టెలుక నక్షత్రరాశి ద్వయం(Mice Galaxies). దీన్ని పటంలో చూడవచ్చు. ఇవి NGC 4676A, NGC 4676B అన్నమాట. ఇవి మనకు 29 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో వున్నట్టు 2002 సంవత్సరంలో కనుగొన్నారు. ఇందులో ఒకదానికి ఎలుకలాగ తోక (ఇవన్నీ కోట్లాది నక్షత్రాలన్నమాట) లాగా వుండడం వల్ల దీన్ని చిట్టెలుక గెలాక్సీ అంటున్నారు. ఈ NGC 4676A, NGC 4676B కి మధ్య కృష్ణబిలాలు (Black Holes) చెరొకటి ఉన్నాయి. ఆ రెండు కృష్ణబిలాల మధ్య దూరం కొన్ని లక్షల కాంతి సంవత్సరాలుంటుంది. మనం 2002 నాడు చూసిన చిత్రం 29 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే అర్థం ఏమిటంటే ఆ విధమైన రూపు రేఖలు అక్కడ 29 కోట్ల సంవత్సరాల కిందటిదన్నమాట. అప్పటికి ఈ భూమ్మీద మానవజాతి కూడా పుట్టలేదు. మరి ఇపుడు (ఇప్పుడు, ఈ క్షణంలో) అవి ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం మరో 30 కోట్ల సంవత్సరాలు ఎదురు చూడాలి. సుమారు 4 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నNGCK 1512 అనే బుల్లి గెలాక్సీ NGCK 1512 అనే దీర్ఘ వృత్తాకార గెలాక్సీ చుట్టూ సుమారు 68 వేల కాంతి సంవత్సరాల ఆవల తిరుగుతున్నట్టు తెలుస్తోంది. (68 వేల సంవత్సరాల క్రితం అన్నమాట) ఈ జంట మనకు సుమారు 4 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో వుంది. మన స్వంత పాలపుంత నక్షత్రరాశి (Milkway Galaxy) చుట్టూ ధృవాల మీదుగా సాజిటేరియస్ డ్వార్ఫ్ స్ఫెరాయిడల్ గెలాక్సీ (Sagittarius Dwarf Spheroidal Galaxy) పరిభ్రమిస్తున్నట్లు 1994 సంవత్సరంలో గుర్తించారు. దీని వ్యాసం సుమారు 10000 కాంతి సంవత్సరాలుంటుంది. ఇది మనకు సుమారు 70 వేల కాంతి సంవత్సరాల దూరంలో వుంది.
ఇంకా ఇలాంటి ఉదాహరణలు ఎన్నో వున్నాయి. అసలు విషయమేమిటంటే విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. నిశ్చలం అంతకన్నా కాదు. పరస్పర విరుద్ధ భావనలు విశ్వంలో ఎల్లఎడలా రివాజు. కలవాలనుకొంటూ, విడిగా వుంటూ ఇందులో ఏదో ఒక విషయం ప్రబలం కావడం వల్ల గెలాక్సీలు విడివిడిగా గానీ లేదా కలుసుకుంటున్నట్టు గానీ వుంటున్నాయి. గెలాక్సీలు రెండు కాల క్రమేణా పరస్పరాకర్షణకు గురయితే కొన్ని వేల సంవత్సరాల తర్వాత అవి రెండూ కలిసిపోయి ఒకే నక్షత్రరాశిగా మారే అవకాశాలు ఎక్కువ. పటంలో ఈ విషయాన్ని కూడా 4 దశల్లో చూపాను.

EmoticonEmoticon