Story behind Bicycle invention in Telugu

*🌏 సైకిల్‌ పుట్టుక! 🌏*

సైకిల్‌కు తొలిరూపం ముందు చక్రం కలిగిన ఒక చెక్క గుర్రం అని తెలుసా! దీనిని 1790 ప్రాంతంలో ఫ్రాన్స్‌లో రూపొందించారు.

అప్పటికి ఇంకా పెడల్స్‌ రానందువల్ల దానిని కాళ్లతోనే నెట్టుకుంటూ వెళ్లవలసి వచ్చేది.

1817లో బారన్‌ కార్ల్‌ వాన్‌ డ్రైస్‌ అనే జర్మనీకి చెందిన వ్యక్తి దీని స్టీర్‌ చేయగల ముందు చక్రాన్ని తయారుచేశాడు.

1839లో స్కాట్‌లాండ్‌కు చెందిన కిర్క్‌ పాట్రిక్‌ మాక్‌మిల్లన్‌ అనే అతను మొదటిసారిగా పెడల్స్‌ను తయారుచేశాడు.

 తొలిదశలో తయారైన సైకిళ్లన్నింటికీ ముందు చక్రం చాలా పెద్దగా ఉండేది.

ముందు చక్రం ఎంత పెద్దగా ఉంటే సైకిల్‌ అంత వేగంగా వెళుతుందని నమ్మేవారు.

1880లో ఇంగ్లాండ్‌లో మొదటిసారి ‘సేఫ్టీ బైస్కిల్‌ను కనుగొన్నారు. ఈ సైకిల్‌కు చైన్‌, సమాన చక్రాలున్నాయి. తరువాత సంవత్సరంలో న్యుమాటిక్‌ టైర్లు, రెండు, మూడు స్పీడ్‌ హబ్‌ గేర్లు, డీరెయిలర్‌ గేర్లను కనుగొన్నారు.

1970ల వరకు ఈ డీరెయిలర్‌ గేర్లే సైకిల్‌ డిజైన్లలో గొప్ప ఆవిష్కరణ. ఆ తరువాత కాలంలో వీటి ప్రాధాన్యత తగ్గింది.గతంలో సైకిల్‌ తొక్కేవారు ముందుకు వంగి కూర్చోవాల్సి వచ్చేది.

 కానీ ఇప్పుడు కొద్దిగా వెనక్కి వాలి కూర్చొని పెడల్స్‌ తొక్కేందుకు వీలుగా సైకిల్‌ను రూపొందించారు.

స్త్రీల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన జార్జియానా టెర్రీ సైకిల్‌ ముందు చక్రం చిన్నగా ఉంటుంది.

వెనక చక్రంలోని ఫోర్క్‌ యాంగిల్‌ మార్పు చేయడం వల్ల దాన్ని తొక్కేవారు సౌకర్యంగా తొక్కగలుగుతున్నారు.


no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv