వైర్లెస్ ఫోన్లు, మైక్రోఫోన్లలో మనం మాట్లాడితే ఎలా వినిపిస్తుంది?*
✳వైర్‌లెస్ ఫోన్లను కార్డ్‌లెస్ ఫోన్లు అని కూడా అంటారు. వింటూ, మాట్లాడే హేండ్‌సెట్‌కు మనం నంబరు డయల్ చేసే బేస్‌సెట్‌కు మధ్య విద్యుత్ తీగ ఉంటే అది మామూలు ఫోను. ఈ రెండు సాధనాల మధ్య తీగలేవీ లేకుండా బేస్‌సెట్‌నుంచి దూరంగా హేండ్‌సెట్‌ను పట్టుకుని గదిలో మనం అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడగలిగితే ఆ వ్యవస్థను కార్డ్‌లెస్ ఫోను అంటారు. ఇందులో హేండ్‌సెట్‌కు, బేస్‌సెట్‌కు మధ్య రేడియో తరంగాల ద్వారాగానీ, సూక్ష్మతరంగాల ద్వారాగానీ సమాచార రవాణా డిజిటల్ పద్ధతి అనే ఎలక్ట్రానిక్ ప్రక్రియ ద్వారా వీలవుతుంది. అందుకే హేండ్‌సెట్‌లోను, బేస్‌సెట్‌లోను రెంటిలో విద్యుచ్ఛక్తిని ఇచ్చే బ్యాటరీ ఉండాలి. సాధారణంగా బేస్‌సెట్‌ను ఏదైనా అడాప్టర్ ద్వారా ఇంట్లో స్విచ్ బోర్డు ద్వారా ప్రత్యక్ష విద్యుత్తు (dc)ని అందిస్తారు. హేండ్‌సెట్‌లో రీఛార్జబుల్ బ్యాటరీలు ఉంటాయి. బేస్‌సెట్‌కే సెల్‌ఫోన్ వైరును కలపడం వల్ల అక్కడ్నించి మనం మాట్లాడే మాటలు తిరిగి విద్యుత్తు ప్రవాహ సంకేతాలుగామారి స్పీకర్లలో అధిక స్థాయిలో శబ్దాన్ని ఇస్తాయి.

EmoticonEmoticon