ఒక వ్యక్తి యొక్క వేలి ముద్రలను ఎలా గుర్తిస్తారు?*

ఒక వ్యక్తి యొక్క వేలి ముద్రలను ఎలా గుర్తిస్తారు?*


✳వేలి ముద్రలను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. డిజిటల్‌ పద్ధతిలో పనిచేసే ఇది వేలిముద్రల సమాచారాన్ని వివిధ కోణాల్లో సేకరించి కంప్యూటర్‌లో భద్రపరుస్తుంది. ఈ పరికరానికి ఉండే సెన్సార్‌ ముందు చేతి వేళ్లను ఉంచుతారు. అందులో ఉండే మైక్రోచిప్‌లో ఉష్ణశక్తికి స్పందించే ఒక పొర ఉంటుంది. ఇది దాదాపు 14,000 ప్రతిబింబాలను నమోదు చేయగలుగుతుంది. చేతి వేళ్లలోని స్వల్పమైన ఉష్ణశక్తి హెచ్చుతగ్గులను సైతం ఈ యంత్రం గుర్తించి వాటిని అనేక అంశాలుగా నమోదు చేస్తుంది. వేలిముద్రల్లో ఉండే రేఖల ఎత్తుపల్లాలన్నీ ఒక వరస క్రమంలో నమోదు అవుతాయి. ఇలా ఒక వేలిముద్ర ప్రతిబింబం ద్వారా దాదాపు 50 నుంచి 100 అంశాలకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. పరికరంలో ఉండే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ఈ అంశాలన్నింటినీ సక్రమమైన రీతిలో అమర్చి ఒక సమగ్రమైన ప్రతిబింబాన్ని కంప్యూటర్‌ తెరపై ప్రదర్శించేలా ఏర్పాటు ఉంటుంది. సేకరించిన సమాచారాన్నంతటినీ డిజిటల్‌ కోడ్‌ రూపంలో భద్రపరుస్తారు.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv