ఎడారిలో ఒయాసిస్ లోకి నీరెలా చేరుతుంది?

*✅ తెలుసుకుందాం ✅*

ఎడారిలో ఒయాసిస్ లోకి నీరెలా చేరుతుంది?*

✳వర్షమే పడని ఎడారిలో ఒకచోట ఒయాసిస్సు ఉండి మనుషులను , ఒంటెలను ఆదుకోవడము ఆశ్చర్యమే.  ఒయాసిస్సు లోని నీరు అక్కడిది కాదు . ఎక్కడో కురిసిన వర్షపు నీరు భూమిలోనికి ఇంకడము జరిగి ఒకచోట ఆగిపోయి భూమికి సమాంతరముగా ప్రవహిస్తుంది. అలా ఖాళీలను బట్టి భూమి లోపల నీరు చేసే ప్రవాహము వందల  కి.మీ.లు ఉండవచ్చును.అలా ప్రవహించే నీరు ఏదో ఒక ప్రదేశములో అక్కడి భూమి పొర ఎగుడు- దిగుళ్ళను బట్టి పైకి తన్నుకు వచ్చే అవకాశము ఉంటుంది. . . అలా పైకి వచ్చి ఎడారిలో ఏర్పడిన నీటి ప్రదేశమే   ఒయాసిస్సు  గా పిలువబడుతున్నది.


EmoticonEmoticon