ఫ్రిజ్‌ల్లో ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చే చిన్న పెట్టెలాంటి ఫ్రీజర్‌ను పైభాగంలోనే అమరుస్తారు. దాన్ని ఫ్రిజ్‌కు కింది భాగంలో ఎందుకు పెట్టరు?

*✅ తెలుసుకుందాం ✅*


*🔴ఫ్రిజ్‌ల్లో ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చే చిన్న పెట్టెలాంటి ఫ్రీజర్‌ను పైభాగంలోనే అమరుస్తారు. దాన్ని ఫ్రిజ్‌కు కింది భాగంలో ఎందుకు పెట్టరు?*

✳రిఫ్రిజిరేటర్‌లో సులభంగా ఆవిరయ్యే ఫ్రియాన్‌ (Freon) అనే ద్రవ పదార్థాన్ని సన్నని తీగ చుట్టల ద్వారా ప్రవహింపజేస్తారు. ఈ ద్రవాన్ని 'రెఫ్రిజిరెంట్‌' అంటారు. ఈ ద్రవం ఫ్రిజ్‌లో ఉండే పదార్థాల వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది. ఫ్రిజ్‌లో చల్లదనాన్ని కలుగజేస్తుంది. ఆవిరిగా మారే ఫ్రియాన్‌ తిరిగి ఫ్రిజ్‌లోని కండెన్సర్‌ ద్వారా పీడనానికి గురై మళ్లీ ద్రవంగా మారుతుంది. ఇది తిరిగి ద్రవరూపాన్ని పొందేటప్పుడు అది అంతకు ముందు గ్రహించిన వేడి ఫ్రిజ్‌ వెనక భాగం నుంచి బయటకు పోతుంది. ఫ్రిజ్‌లోని పదార్థాలలోని వేడిని గ్రహించి ఆవిరిగా మారిన ఫ్రియాన్‌ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఆవిరిగా మారిన దాని సాంద్రత (density)తక్కువ కావడంతో ఆ ఆవిరి ఫ్రిజ్‌ పైభాగానికి పయనిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల ఫ్రిజ్‌లో చల్లదనం ఏర్పడి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్షియస్‌కు తగ్గుతుంది. ఫ్రీజర్‌ను ఫ్రిజ్‌ అడుగు భాగంలో అమరుస్తే అక్కడ ఉష్ణోగ్రత మరీ తగ్గడం వల్ల వెలువడే ఉష్ణకిరణాలు పైవైపు ప్రయాణించి అక్కడ అంతకు ముందు చల్లబడిన పదార్థాల ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అందువల్లనే ఫ్రీజర్‌ను పైభాగంలోనే అమరుస్తారు. అక్కడ వెలువడిన ఉష్ణకిరణాలు అక్కడి నుంచే బయటకు వెలువడుతాయి.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv