మన రెండు అరచేతుల్లో గీతలు ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడతాయి

మన రెండు అరచేతుల్లో గీతలు ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడతాయి?

✳మనిషి అరచేతుల్లో గీతలు ఎవరో గీచినవి కావు. గర్భంలో శిశువు ఎదిగే క్రమంలో ఏర్పడినవే. అరచేతిలో ముడుచుకునే కీళ్లు ఎక్కువ. ఇక్కడి చర్మాన్ని, కండరాలకు దిగువ ఉండే అస్థిపంజరపు ఎముకలకు అనుసంధానం చేసే ఏర్పాటిది. ఆయా ప్రాంతాల్లో ఉండే నార కణాలు (fibrous tissue) చర్మాన్ని లోపలికి గుంజి పడతాయి. కీళ్లు మడిచే ప్రాంతాల్లో ఎక్కువగాను, మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు బలంతోను ఇవి అరచేతి చర్మాన్ని పట్టి ఉంచుతాయి. ఇవి ఉండే చోటల్లా చర్మం లోపలికి ముడుచుకోవడం వల్ల గీతల్లా కనిపిస్తాయి. మన ఇంట్లో మంచాలపై వాడే దూది పరుపులను ఓసారి గమనించండి. దూది చెదిరిపోకుండా దారంతో కుట్టి ఉంచిన చోట గాడులు ఏర్పడి ఉంటాయి కదా. అలాగే ఈ నారకణాల వల్ల చర్మం ఎముకలకు కుట్టినట్టుగా అమరి ఉంటుందన్నమాట.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv