నిద్రలో ఉన్నప్పుడు తమపై 'దయ్యం'మీద పడిందని,గొంతునూ,శరీరాన్ని అదిమిపట్టడం వల్ల కాళ్ళూ చేతులూ ఆడలేదని, మాటరాలేదని అంటుంటారు. ఇది నిజమేనా?

*నిద్రలో ఉన్నప్పుడు తమపై 'దయ్యం'మీద పడిందని,గొంతునూ,శరీరాన్ని అదిమిపట్టడం వల్ల కాళ్ళూ చేతులూ ఆడలేదని, మాటరాలేదని అంటుంటారు. ఇది నిజమేనా??*
-💀
ఇది చాలామందికి నిద్రలో అనుభవం అయ్యే ఉండవచ్చు. ఈ పరిస్థితి పేరు శాస్త్రీయంగా "స్లీపింగ్ పెరాలసిస్/hypnagogia". ఇది తెలుసుకోవాలనుకుంటే నిద్ర యొక్క దశలపై కొద్దిగా అవగాహన ఉండాలి. మనిషి మెలుకువగా(Conscious state of mind) ఉన్నప్పుడు ఒక సెకను కాలంలోనే గరిష్టంగా 6 రకాల ఆలోచనలు(Average) కలిగి ఉంటాడు. నిద్రలో ప్రధాన దశలు 1.మెలుకువ(అలోచనల గజిబిజి దశ),2.ట్రాన్స్(దాదాపుగ ఆలోచనల శూన్యం), 3.గాడనిద్ర(శరీరం విశ్రాంతి దశ), 4.కలల దశ. ట్రాన్స్ దశలోని మనిషి శరీరం గాడనిద్ర దశకు ఆకర్శించబడుతుంది లేదా గుంజబడుతుంది. ఈ సంధి కాలంలో ఇక్కడే మనిషికి గట్టిగా శబ్దం గానీ, డిస్టబెన్స్ గానీ జరిగితే ట్రాన్స్ దశకు రివర్స్ గా కదిలి మెలకువ దశ కు ప్రయత్నం జరుగుతుంది. మెలకువ కు రావచ్చు. అయితే శరీరం విశ్రాంతిదశను గట్టిగా డిమాండ్ చేస్తూ సక్సెస్ అయితే మనిషి మెలుకువకు రాలేడు. ఆ సంధి దశలోనే శరీర సహకారం కోల్పోయి మాటరాక,శరీరం కదలక కొట్టుమిట్టాడుతాడు. ఇది కొన్ని సెకన్లు, నిమిశాలు కూడ ఉండవచ్చు. దీన్నే 'స్లీపింగ్ పెరాలసిస్' అంటారు. అంతే గానీ దయ్యం కాదు.
🌻🌻🌻🌻🌻🌻


EmoticonEmoticon