Showing posts with label Devotional. Show all posts
Showing posts with label Devotional. Show all posts
చరిత్రలో నేటి ప్రముఖ వ్యక్తి - రామకృష్ణ పరమహంస - 18 February

చరిత్రలో నేటి ప్రముఖ వ్యక్తి - రామకృష్ణ పరమహంస - 18 February

 *చరిత్రలో నేటి ప్రముఖ వ్యక్తి*


*రామకృష్ణ పరమహంస* 

(పుట్టినప్పుడు పేరు గదాధర్ ఛటోపాధ్యాయ) (ఫిబ్రవరి 18, 1836 - ఆగష్టు 16, 1886) 


*ఒక ఆధ్యాత్మిక గురువు. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం"లో ఈయన ప్రభావము చాలా ఉంది.*


*భారతదేశములో మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి, తేదీలు, ఇతర విషయాలకు తక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. కాని రామకృష్ణుని జీవితములోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు ఉన్నాయి. చాలా మంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు, ఆధారములు దొరకనిదే విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము. అతని శిష్యుడు స్వామీ శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ ఆతని జీవితచరిత్రను చాలా మటుకు రచించాడు.*


*బాల్యము*


*రామకృష్ణులకురామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ క్రీ.శ 1836, ఫిబ్రవరి 18 న పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్, చంద్రమణిదేవి. వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు. గదాధరుడు అందగాడు, బాల్యం నుండే ఇతనికి లలితకళలు, చిత్రలేఖనములో గల ప్రవేశము వలన వారి గ్రామంలో ఇతనికి మంచిపేరు ఉండేది. అయితే చదువు మీద కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించేవాడు కాదు. ప్రకృతిని ప్రేమిస్తూ, గ్రామం బయట పండ్ల తోటలలో స్నేహితులతో కలసి సమయాన్ని గడిపేవాడు. దానివలన చదువు అబ్బలేదు. పూరీకి వెళ్ళు సాధువులు వీరి గ్రామం గుండా వెళ్ళేవారు. వారు ఆ గ్రామంలో ఆగి ప్రసంగిచేటప్పుడు రామకృష్ణుడు ఎంతో శ్రద్ధగా వినేవాడు. వారికి సేవలు చేసి వారి మత వాగ్యుద్ధాలను ఆసక్తితో వినేవాడు.*


*ఉపనయనము కాగానే బ్రాహ్మణునిగా మొదటి భిక్ష, ఒక శూద్ర యువతి దగ్గర పొందుతానని అనడము చాలా మందికి ఆశ్చర్యము కలిగించింది. బ్రాహ్మణుని వద్దనే మొదటి భిక్ష పొందవలననే నియమాన్ని ఎంత వాదించినా, ఎంత మంది చెప్పినా, కన్నీరు కార్చినా వినకుండా ఆ యువతికి మాట ఇచ్చానని తాను ఆడిన మాట తప్పక ఎటువంటి బ్రాహ్మణుడవుతాడని ప్రశ్నించాడు. చివరికి ఆతని జ్యేష్ట సోదరుడు రామ్‌కుమార్ తండ్రి మరణము తరువాత అంగీకరించెను.*


*ఇంతలో కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతూ వచ్చింది. రామ్‌కుమార్ కలకత్తాలో సంస్కృత పాఠశాల నడుపుతూ, కొన్ని కుటుంబాలకు పౌరోహిత్యము చేస్తూ ఉండేవాడు. ఆ కాలములో రాణీ రాషమొణి అనే ధనిక యువతి, దక్షిణేశ్వర్ కాళీ మాత గుడి కట్టించి రామ్‌కుమార్ ను పురోహితుడుగా ఉండమని కోరింది. రామ్‌కుమార్ దానికి అంగీకరించాడు. కొంత ప్రోద్బలముతో గదాధర్ దేవతను అలంకరించడానికి ఒప్పుకున్నాడు. రామ్‌కుమార్ మరణించిన తరువాత రామకృష్ణుడు పూజారిగా బాధ్యతలను తీసుకొన్నాడు.*


*పూజారి జీవితము*


*మొదట తిరస్కరించినా తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయములో పూజలో సేవచేసేవాడు. గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తా అని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఒకవేళ సజీవ దేవతను పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానము ఇవ్వడము లేదు? అనుకొనేవాడు. ఈ ప్రశ్న ఆతనిని రాత్రి, పగలు కలచివేసింది. ఇక కాళికా దేవిని ప్రత్యక్షము కమ్మని తీవ్రమైన మొరలతో ప్రార్థించడము మొదలుపెట్టాడు. తీవ్ర భక్తిభావంలో నిమగ్నమయ్యి రేయింబవళ్ళు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు. రాత్రిళ్ళు అడవిలో కూర్చొని ప్రార్థించేవాడు. ఒకనాడు అమ్మవారి దర్శనము పొందాడు. అప్పటి నుండి నిరంతరమూ అమ్మవారి దర్శనభాగ్యం పొందేవాడు. నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు. ఇంకా తృప్తి పొందక ఇతర మతములలో పరమ సత్యమును తెలిసికొనుటకై ప్రార్థించేవాడు. కొంత మంది గురువులు ఆతని దగ్గరకు వచ్చి అన్ని మతములలో పరమ సత్యము సాక్షాత్కరించు కున్నాడని గ్రహించారు. ఈ మాట అన్ని ఊళ్ళలో వ్యాప్తి చెంది అన్ని మతముల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవారు.*


*గురువులు, సాధనలు*


*కాలక్రమంలో తోతాపురి అను నాగా సాంప్రదాయపు సాధువు వీరికి అద్వైతజ్ఞానం ఉపదేశించారు. వీరి గురువుగారు చిన్నప్పటినుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధిస్థితిని రామకృష్ణులు కేవలం మూడు రోజులలోనే పొందారు. తర్వాత భైరవీ బ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంలో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు. ఈ విధంగా భగవత్, ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం, క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు.*


*వైవాహిక జీవితము*


*కామార్పుకూర్ లో రామకృష్ణుడు దక్షిణేశ్వర్ లో అత్మజ్ఞాన అభ్యాసములతో పిచ్చివాడై పోయాడని పుకారు వచ్చింది. ఊరివారు రామకృష్ణుని తల్లితో ఆతనికి వివాహము చెయ్యమని, దానితో సంసారిక బాధ్యతలలో పడగలడని చెప్పారు. వివాహమునకు అభ్యంతరము చెప్పక పోవడమే కాకుండా, మూడు మైళ్ళ దూరములో ఉన్న జయరాంబాటి గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో పెళ్ళికూ


తురు దొరుకుతుందని చెప్పాడు. 5 ఏళ్ళ శారదా దేవితో ఆతని పెళ్ళి నిశ్చయమైనది. శారద రామకృష్ణుని మొదటి శిష్యురాలు. తాను గురువుల వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమె గ్రహణ శక్తికి మెచ్చి ఆమెను త్రిపుర సుందరి శక్తిగా పూజించడము మొదలు పెట్టాడు. ఆమెను సాక్షాత్ కాళికాదేవి లా భావించి పూజించారు. ఆమెను కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు.*


*ఆమె పరిత్యాగము రామకృష్ణుని పరిత్యాగము వలే శిష్యులందరికి ప్రస్ఫుటముగా కనపడేది. వారిద్దరి సంబంధము సామాన్య మానవులు అర్థము చేసుకోలేరని భావించేవారు. చాలా కాలము అమెతో గడిపిన తరువాత రామకృష్ణుడు వారి బంధము ఆధ్యాత్మికమైనదని నిర్ణయించారు. శిష్యులందరూ వారు దినసరి జీవితాన్ని పంచుకున్నపటికీ, ఒకరి దగ్గర ఒకరు ఉన్నపుడు మటుకు ఆధ్యాత్మికత కంటే ఏ ఇతర విషయాల పై మనస్సు పోయేది కాదని భావించేవారు. మతగురువుల జీవితాల్లో స్త్రీ, పురుషుల మధ్య ఇలా జీవితకాలమంతా ఆధ్యాత్మిక సంబంధము ఉండడము ఇంకెక్కడా కానరాదు. రామకృష్ణుని మరణానంతరము శారదా దేవి కుడా మతగురువుగా మారెను.*


ఆహారంలో 5 రకాల దోషాలు - మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన _దోషాలు యిమిడివున్నాయి

ఆహారంలో 5 రకాల దోషాలు - మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన _దోషాలు యిమిడివున్నాయి

 *ఆహారంలో 5రకాల దోషాలు*


మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన _దోషాలు యిమిడివున్నాయి_.


1.  *అర్ధ దోషం*

2.  *నిమిత్త దోషం*         

3.  *స్ధాన దోషం*

4.  *గుణ దోషం*   

5.  *సంస్కార దోషం*.


ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే 

ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు. 


1. *అర్ధ దోషం* :


ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. 

భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి 

ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.


భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.

ఆ గదిలోనే  శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. 


హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , 

ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని 

తన సంచీలో దాచేశాడు.


తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, 

తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.

మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.  


తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని 

రాత్రి ఆహారం జీర్ణమయి, 

ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత 

మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు 

అర్థం చేసుకున్నాడు.


వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, 

ఆ డబ్బును  తిరిగి ఇచ్చేశాడు. 

శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు. 


శిష్యుడు తలవంచుకొని, నన్ను క్షమించండి, స్వామి!  యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు.

అని తలవంచుకొన్నాడు.


ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో 

కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం.  

మనం న్యాయంగా సంపాదించిన దానితోనే 

ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం. 


2. *నిమిత్త దోషం* :


 మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా 

మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.


వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. 

ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి 

పడ కూడదు.


అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. 

దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే 

వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి. 


భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో 

బాణాలతో  కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే  వున్నాడు. 

ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది 

శ్రీ కృష్ణుడు వున్నారు. 

వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు.


అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది. 

ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు?  అని అనుకొన్నది.


ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు

'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, 

ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను. 


నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, 

ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, 

పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి 

నేను ఇప్పుడు పవిత్రుడినైనాను.


నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు.


చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది  

తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి నిమిత్త దోషం 'ఏర్పడుతోంది.


3. *స్ధాన దోషం* :


ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, 

అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. 

వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది.


యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు.


దుర్యోధనుడు  ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. 

కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  

తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  

ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,

అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. 

కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. 

అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. 

నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా 

సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు. 


మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి 


4. *గుణ దోషం* :


మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  

లౌకిక మాయలో పడేస్తుంది. 

స్వార్ధాన్ని పెంచుతుంది.


5. *సంస్కార దోషం* :


ఆహారం వండే వారి సంస్కారం బట్టి 

దోషం ఏర్పడుతుంది.

_సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని_ ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని 

తెచ్చి పెడుతుంది.


🙏🏻

భగవద్గీత ఎందుకు చదవాలి?

భగవద్గీత ఎందుకు చదవాలి?

📖 *భగవద్గీత ఎందుకు చదవాలి?*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

 *సంతోషంగా ఉన్నవా... భగవద్గీత చదువు.*
* బాధలో ఉన్నావా... భగవద్గీత చదువు.
* *ఏమి తోచని స్థితి లో ఉన్నావా... భగవద్గీత చదువు.*
* ఏదో గెలిచినావా... భగవద్గీత చదువు.
* *ఏదో ఓడిపోయినావా... భగవద్గీత చదువు.*
* నువ్వు మంచి చేసినావా... భగవద్గీత చదువు.
* *నువ్వు చెడు చేసినావా...భగవద్గీత చదువు.*
* నువ్వు ఏదో సాధించాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* *నువ్వు ఏది సాధించ లేక ఉన్నావా... భగవద్గీత చదువు.*
* నువ్వు చాలా ధనవంతుడవా... భగవద్గీత చదువు.
* *నువ్వు చాలా బీద వాడివా... భగవద్గీత విను.*
* నువ్వు సమాజాన్ని బ్రతికించాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* *నువ్వు ఆత్మహత్యా చేసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.*
* నువ్వు మోసం చేసినావా... భగవద్గీత చదువు.
* *నువ్వు మోసపోయినావా... భగవద్గీత చదువు.*
* నీకు అందరూ ఉన్నారా... భగవద్గీత చదువు.
* *నీవు ఒంటరివా.... భగవద్గీత చదువు.*
* నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా... భగవద్గీత చదువు.
* *నీవు వ్యాధిగ్రస్తుడవా... భగవద్గీత చదువు.*
* నీవు చాలా విద్యావంతుడవా... భగవద్గీత చదువు.
* *నీవు విధ్యాహీనుడవా... భగవద్గీత చదువు.*
* నీవు పురుషుడవా... భగవద్గీత చదువు.
* *నీవు మహిళవా... భగవద్గీత చదువు.*
* నీవు ముసలివాడివా.. భగవద్గీత చదువు.
* *నీవు యవ్వనస్తుడివా... భగవద్గీత చదువు.*
* దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా... భగవద్గీత చదువు.
* *దేవుడు లేడు అని అనుకుంటున్నావా.... భగవద్గీత చదువు.*
* ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* *పరమాత్మ తత్త్వం ఎలాంటిదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.*
* మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.
* *కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని ఉందా... భగవద్గీత చదువు.*
* ఈ శృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* *పుట్టకముందు మనము ఎవరము అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.*
* చనిపోయిన తర్వాత మనము ఏమి అవుతాము అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* *దేవుడంటే అసలు ఎవరు అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.*
* నీలో కామం, క్రోధం, లోభం, మొహం,  మధం, మాత్సర్యము వంటి అర్షడ్ వర్గాలు ఉన్నాయా... భగవద్గీత చదువు.
* *నీవు ప్రేమిస్తున్నావా... భగవద్గీత చదువు.*
* నీవు ధ్వేశిస్తున్నవా... భగవద్గీత చదువు.
* *నీలో వైరాగ్యం ఉందా... భగవద్గీత చదువు.*
* జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* *బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.*
* ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని వుందా... భగవద్గీత చదువు.
* *మోక్షం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అంటే... భగవద్గీత చదువు.*
* పంచ భూతాలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే.... భగవద్గీత చదువు.
* *ప్రకృతి, పురుషుడు, భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే... భగవద్గీత చదువు.*
* ఇక చివరగా... నీవు ఎవరు, ఎక్కడ నుండి వచ్చినావు, ఎక్కడికి పోతావు, నీవారు ఎవరు, నీ అసలు గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే....
*భగవద్గీత చదువు.*
✍🌺🌺🌺🌺🌺🌺✍

భగవధ్గీతలో ఏముంది?:
 *ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?*

గీత ఎప్పుడు పుట్టింది? భారతదేశ చరిత్రలో మహాభారత యుధ్ధం ఒక ప్రధానమైన సంఘటన భారత యుధ్ధం జరిగిన తర్వాత 36 సంవత్స రాలకు ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది!!
యుధ్ధ సమయంలో శ్రీకృష్ణుని వయస్సు 90 సం!!రాలు!! శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన నాటి నుండి కలి ప్రవేశం జరిగింది!! అంటే కలియుగం ప్రారంభమైనది!! శ్రీకృష్ణ భగవానుడు దాదాపు126 సంరాలు
జీవించి యున్నాడు!!
భారత యుధ్ధ విజయం తర్వాత ధర్మ రాజు పట్టాభిషిక్తుడైనాడు కృష్ణ నిర్యాణ వార్త విన్న తరువాత పాండవులు ద్రౌపదీ సహితంగా "మహా ప్రస్థానము" గావిస్తూ హిమాలయాలకు వెల్లారు!! అంటే యుధిష్టురుడు హస్తినాపుర సింహానముపై కూర్చుని ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా 36 వర్షాలు పాలించాడు!!
మహాభారత యుధ్ధము "కురుక్షేత్రము"లో 18రోజులుజరిగింది!!
కార్తీక అమావాస్య రోజు మహభారత యుద్ధం

ప్రారంభమైనది!! 10 రోజులు భీష్ముడు రణం
చేసి పదవరోజున నేలకొరిగాడు!!
11వ రోజున అంటె మార్గశిర శుధ్ధ ఏకాదశి నాడు సంజయుడు కురుసభలో దృతరాష్ట్రుడికి యుద్ధవిశేషాలు చెబుతూ భగవద్గీతను చెప్పాడు!! ఆవిధంగా
మొదటి సారి హస్తినాపురములోని సభలో
వున్నవారందరూ దృతరాష్ట్ర మహారాజుతో పాటు పురజనులు కూడా విన్నారు!!

కార్తీక అమావాస్యరోజు సూర్యోదయ వేళ యుద్ధము ప్రారంభానికి ముందు అపారమైన
కురు - పాండవ సేనావాహినుల మధ్యన
రథముపై చతికిలబడి నిరాశా నిస్పృహలతో
విషాధముతోబాధపడుతున్న అర్జునుని నిమిత్త మాతృనిగా చేసుకుని శ్రీకృష్ణుడు భగవానుడు మనందరికి భగవద్గీతను బోధించాడు!!
లోకానికి అందినది మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అందుకే మనం ఈరోజు "గీతాజయంతి" ని జరుపుకుంటాం!!
మనం ఇంత వరకు వ్యక్తుల జన్మదినం
జరుపుకుంటున్నాము జ్ఞాన ప్రధాయిని అయిన ఒక గ్రంథానికి జయంతి జరపటం అనేది అధ్భుతమైన విషయం!!
లక్ష శ్లోకాల మహాభారత గ్రంథంలో భీష్మ పర్వంలో 24 నుండి 41వరకు 18 అధ్యాయాలుగా వున్న భాగమే "భగవద్గీత"!!
కలియుగం ప్రారంభమై 5118 సంరాలు
గడిచాయి!! దీనికి 36 సం.రాలు కలిపితె 5154 సంవత్సరాలు!! ఇప్పుడు మనం 5155 వ గీతాజయంతిని జరుపు కుంటున్నాము!!

కృష్ణం వందే జగద్గురుమ్.
భగవధ్గీతలో 700 శ్లోకములు ఉన్నాయి. వాటిని చదవడానికి ప్రస్తుత కాలంలో ఈ యాంత్రిక జీవన విధానంలో సమయం, సహనం రెండు ఉండవు. కనుక కనీసం కొద్ది నిమిషాల ఈ పరిచయంలో తెలుసుకుంటారనే భావనచేతఈ ప్రశ్న జవాబుల రూపంలో భగవధ్గీత అంటే ఏమిటో తెలుసుకుని తరిస్తారని ఆశిస్తూ ఇవ్వడం జరిగింది.
శ్లోకం:-పార్దాయ ప్రతిబోదితాం భగవతా నారాయణేవస్వయం
వ్యాసేవ గ్రధితాం పురాణ మువివామ్ మధ్యే మహాభారతమ్
అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్
ఆంబ త్వా మమవందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్
1. భగవద్గీత ఏ పవిత్ర గ్రంధంలోనిది ?
జ. మహా భారతమునందలి భీష్మ పర్వంలో గీత వివరింప బడినది.
2. గీతలో ఎన్ని శ్లోకములు గలవు?
జ. గీతలో 700 శ్లోకములు కలవు.
3. గీతలో ఎన్ని అధ్యాయములు కలవు ?
జ. గీతలో 18 అధ్యాయములు కలవు.
4. ప్రతి అధ్యాయమునకు యివ్వబడిన ప్రత్యేక నామము ఏది?
జ. ప్రతి అధ్యాయమును యోగము అందురు.
5. గీత ఎక్కడ, ఎప్పుడు , ఎవరికి చెప్పబడినది?
జ. గీత కురుక్షేత్రంలో కౌరవ, పాండవుల యుద్దారంభంలో అర్జునునికి శ్రీ కృష్ణపరమాత్మచే చెప్పబడినది.
6. గీత ఎందుకు చెప్పబడినది?
జ. నావారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదాన్ని కలుగచేయగా విషాదయోగాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగచేయడానికి శ్రీ కృష్ణునిచే గీతాబోధ చేయబడినది.
7. గీత దీనుడైన అర్జునుని ఏవిధంగా మార్చినది?
జ. గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చింది.
8. గీత శ్లోకాలు మానవునిలోని దేనిని దూరం చేస్తాయి?
జ. గీత శ్లోకాలు మానవునిలోని శోకాన్నిదూరం చేస్తాయి.
9. గీత ధృతరాష్ట్రునికి ఎవరు చెప్పారు?
జ. గీతను ధృతరాష్ట్రునికి సంజయుడు వివరించెను.
10. గీతను ఆసమయంలో ఎందరు విన్నారు?
జ. అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు మరియు ఆంజనేయస్వామి.
11. గీతలో గల అధ్యాయముల పేర్లేమి?
జ. 1) అర్జున విషాద యోగము 2) సాంఖ్య యోగము 3) కర్మ యోగము 4) జ్ఞాన యోగము 5) కర్మసన్యాస యోగము 6) ఆత్మ సంయమ యోగము 7) విజ్ఞాన యోగము 8) అక్షర పరబ్రహ్మ యోగము 9. రాజ విద్యారాజగుహ్య యోగము 10) విభూతి యోగము 11) విశ్వరూప సందర్శన యోగము 12) భక్తి యోగము 13) క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 14) గుణత్రయ విభాగ యోగము 15) పురుషోత్తమ ప్రాప్తి యోగము 16) దైవాసుర సంపద్విభాగ యోగము 17) శ్రద్దాత్రయ విభాగ యోగము 18) మోక్ష సన్యాస యోగము
12. గీత ధర్మరాజుకిగాని, భీష్మునికిగాని బోధింపక అర్జునునికే ఏల బోధించెను?
జ. శ్రీ కృష్ణుడు అర్జునునికే గీతాబోధ చేసెను. భీష్మునికి చేయక పోవటానికి కారణం ఏమిటంటే న్యాయం, ధర్మం, పాండవుల పక్షాన ఉందని చెప్తూ అధర్మపరులైన కౌరవుల పక్షాన యుద్దం చేసారు. అలోచనకు, చెప్పేమాటకి, చేసే క్రియకి భేదం ఉన్నది. అనగా త్రికరణశుద్ది లేదు. అట్టివారు జ్ఞానబోధకు అర్హులు కారు. ధర్మరాజు ధర్మవర్తనుడే కాని అతని పశ్చాత్తాపమేకాని పూర్వతాపం లేదు. ఒక పనిచేసే ముందుగానే దాని మంచి చెడ్డలు విచారించేవాడు పూర్వతాపం కలవాడు. జూదం ఆడి ఓడిపోయి అడవులు పాలయ్యాక జరిగిన దానికి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించాడు. ముందుగా దాని పర్యావసానం ఏమిటో ఆలోచించలేదు. పూర్వతాపం లేనివారు గీతాబోధకు అర్హులు కారు. అర్జునుడు యుద్దభూమిలోకి ప్రవేశించి, తనవారినందరిని చూచి యింతమందిని చంపి ఈ రాజ్యాన్ని అనుభవించే కంటే భిక్షాటన మేలు. అందరూ చనిపోయాక ఈ రాజ్యాన్ని పాలించి ఏమి ఆనందం అనుభవించగలము? త్రిలోకాధిపత్యం యిచ్చినా నేను యుద్ధం చెయ్యలేను అని ముందుగానే విచారించాడు. తనను శిష్యునిగా చేసుకుని కర్తవ్యం బోధించమని శ్రీ కృష్ణ భగవానుని ప్రార్థించాడు. అందువలన అర్జునునికే గీతా బోధ చేయబడింది. పూర్వతాపం పరిశుద్ద హృదయమున్న వారికే కలుగును. పరిశుద్ద హృదయుడే జ్ఞానబోధకు
13. అర్జునుని శ్రీ కృష్ణుడు అనేక నామాలతో గీతలో సంబోదించాడు. అవి ఏవి? వాని భావమేమి?
జ. 1) అర్జున: - పవిత్రమైన, నిర్మలమైన మనసు గలవాడు.
2) పార్థ: - పృధివి (భూమి యొక్క) పుత్రుడు. పృధి అను పేరు కుంతీదేవికి కలదు. అంతే కాక భూమి
యొక్క పుత్రుడు అంటే ప్రపంచ మానవులందరికీ ప్రతినిధి పార్ధుడు.3) కౌంతేయ - సావధానంగా దైవబోధను వినగలిగేవాడు.
4) అనసూయ - అసూయ లేనివాడు.
5) కురునందన - కార్యమును చేయుటలో ఆనందమును అనుభవించువాడు.
6) పరంతప - యుద్దములో శత్రువులను తపింప చేయువాడు.
7) విజయ - ఎల్లప్పుడూ జయమునే పొందువాడు.
8) గుడాకేశ - యింద్రియ నిగ్రహం గలవాడు.
9) ధనంజయ - జ్ఞాన ధనమును పొందినవాడు.
10) పాండవ - పాండవరాజు కుమారుడు (తెల్లదనము) సాత్వికగుణము , నిర్మలతత్వం గలిగి పరిశుద్దమైనవాడు .
14. భోజనానికి ముందుగా రెండు శ్లోకాలు పఠించి భుజించాలని స్వామి చెప్పారు. ఆ శ్లోకాలేవి? ఎందుకు అవి పఠించాలి?
బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధిన
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రిత:
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విదమ్
ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది. ఆహారానికి పాత్రశుద్ది, పాకశుద్ది, పదార్థశుద్ది ఉండాలని స్వామి చెప్పారు. పాత్రశుద్ది మనంచేయగలం. పాకశుద్ది అంటే ఎలాంటి తలపులతో వంట చేస్తున్నారో, పదార్థశుద్ది అనగా మనం తెచ్చుకున్న పదార్ధములు మోసము చేసి తెచ్చినవో, దొంగిలించినవో మనకు తెలియదు. అన్యాయార్జన పదార్ధము అనారోగ్యాన్ని, దుర్భుద్దులను పెంచుతాయి. అందువలన ఆహారం భుజించేముందు ఆహారాన్ని దైవానికి సమర్పించి భుజిస్తే అది ప్రసాదంగా మారి దోషరహితం అయిపోతుంది. ఎట్టి తిండియో అట్టి త్రేపు. ఆహారాన్ని బట్టి ఆలోచనలు వుంటాయి. అందువలన రజో, తమో గుణ సంబంధమైన ఆహారాన్ని త్యజించి సాత్వికాహారము దైవానికి అర్పిం��
15. గీత నిత్య జీవితంలో ఏవిధంగా మనకు ఉపకరిస్తుంది?
జ. స్వామి ముఖ్యంగా 'శ్రద్దావాన్ లభతే జ్ఞానం' - 'సంశయాత్మ వినశ్యతి ' అని గీతలోని రెండు శ్లోకాల గురించి చెప్ప్తూ ఉంటారు. శ్రద్దగలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. అధ్యాత్మిక జ్ఞానానికైనా , లౌకిక జ్ఞానానికైనా శ్రద్ద చాలా అవసరం. అందువలన శ్రద్దతో ఏదైనా సాధించవచ్చని గీత బోధిస్తుంది. శ్రద్దతో నచికేతుడు ఆత్మ జ్ఞానాన్ని , ఏకలవ్యుడు ధనుర్విద్యను సాధించగలిగారు. 'సంశయాత్మా వినశ్యతి ' సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ది సాధించలేడు. గురువాక్యంపైన, దైవం పైన నమ్మకం, శ్రద్ద గలవాడే ఏదైనా సాధించగలడు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. యింతేకాక 'అద్వైష్టా సర్వభూతానాం' ఏ ప్రాణినీ ద్వేషించవద్దు. 'అనుద్వేగకరం వాక్యం' ఎవరినీ మాటలతో హింసించవద్దు. సంతుష్టస్పతతం' ఎల్లప్పుడు సంతృప్తిగా ఉండాలి. సమశ్చత్రౌ చ మిత్రేచ, శత్రువులను, మిత్రులను ఒకేవిధంగా చూడాలి. గౌరవా గౌరవాలకు, సుఖదు:ఖాలకు పొంగిపోక, కుంగిపోక ఉండాలి. యిలాంటి లక్షణాలు కలవాడు నాకు ప్రియమైన భక్తుడు అని శ్రీ కృష్ణ భగవానుడు బోధించాడు. అంటే మానవులంతా తమ నిత్య జీవితంలో ఈ లక్షణాలు అలవర్చుకుంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. వంట చెయ్యటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. అలాగే ఒక్క గీతా శ్లోకాన్ని మనం ఆచరించడానికి ప్రారంభించినా క్రమేపి అన్ని సద్గుణాలు మనలో ప్రవేశించి భగవంతునికి ప్రియమైన భక్తులం కాగలము.
16. స్వామి గీతా సారాంశాన్ని రెండు పదాల్లో వివరించారు? అవి ఏవి?వాని వివరణ ఏమి?
జ. "ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:
మామకాకి పాండవాశ్చైవ కీమ కుర్వత సంజయ: "
శ్లోకములోని మొదటి పదము ధర్మ, గీతలోని చివరి శ్లోకము
"యత్ర యోగీశ్వర: కృష్ణా యత్ర పార్థ ధనుర్థర:
శ్రీ ర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ "
చివరి శ్లోకములోని చివరి పదము మమ. మొదటి ధ
16. స్వామి గీతా సారాంశాన్ని రెండు పదాల్లో వివరించారు? అవి ఏవి?వాని వివరణ ఏమి?
జ. "ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:
మామకాకి పాండవాశ్చైవ కీమ కుర్వత సంజయ: "
శ్లోకములోని మొదటి పదము ధర్మ, గీతలోని చివరి శ్లోకము
"యత్ర యోగీశ్వర: కృష్ణా యత్ర పార్థ ధనుర్థర:
శ్రీ ర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ "
చివరి శ్లోకములోని చివరి పదము మమ. మొదటి ధర్మ, చివరిది మమ. ఈ రెండూ చేరిస్తే 'మమధర్మ' అని గీత బోదించింది. ఎవరి కర్తవ్యాన్ని, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించమని గీత ముఖ్యంగా బోధిస్తుంది. విద్యార్దులు వారికర్తవ్యాన్ని, బ్రహ్మచారులు వారికర్తవ్యాన్ని, గృహష్దులు వారి కర్తవ్యాన్ని, నవ్యానులు వారికర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎవరిమార్గాన్నివారికి బోధించేదే గీత.
17. భగవత్గీతలో పేర్కొనబడిన నాలుగు విధములైన భక్తులెవరు?
జ. ఆర్తి, అర్దార్ది, జిజ్ఞాసు, జ్ఞాని
1. ఆర్తభక్తుడు బాధలు కలిగినపుడు తనను ఆదుకొని రక్షించమని ఆర్తితో భగవంతుని ప్రార్దిస్తాడు.
2. ధన కనక వస్తు వాహనముల కోరకు, పదవి పేరు ప్రతిష్టల కోరకు, పుత్ర పౌత్రాభివృద్ది కొరకు పరితపించుచూ
ప్రార్దించువారు అర్దార్దులు.
3. జిజ్ఞాసువు: ఆత్మస్వరూపమైన పరమాత్మమ తెలుసుకోనగోరి అనేక సద్ర్గంధములతో, సదాలోచనలతో,
సద్బావములతో విచారణ నల్పుచూ సాన్నిధ్యప్రాప్తిని పొందగోరును. 4. జ్ఞాని: నిరంతరం బ్రహ్మతత్త్వమున మునిగియుండును.
18. గీత దైవ లక్షణాలను, అసుర లక్షణాలను ఏ విధంగా వివరించింది?
జ. దైవ లక్షణాలు: 1. అభయము 2. చిత్తశుద్ది 3. జ్ఞానయోగమునందుందుట 4. దానము 5. ఇంద్రియనిగ్రహం
6. యజ్ఞము 7.అధ్యయనము 8. తపస్సు 9. కపటములేకుండుట 10. అహింస 11. సత్యము 12. క్రోధములేకుండుట 13. త్యాగము 14. శాంతి 15. కౌండెములుచెప్పకుండుట 16. సమస్తప్రాణులయడల కరుణ
17.విషయములపై మనస్సు పోనీయకుండుట 18. తేజస్సు 19. క్షమ 20. ఆపత్కాలమందు దైర్యమును
వీడకుండుట 21. శుచి, శుభ్రతలు కల్గియుండుట 22. పరులకు ద్రోహముచేయకుండుట 23. మృదుస్వభావము
24. ధర్మవిరుద్ద కార్యములలో ప్రవేశింపకుండుట 25. తననుతాను పొగడుకోనకుండుట 26.తంతుల స్వభావము లేకుండుట అసుర లక్షణాలు : డంభము, గర్వము, దురభిమానము,కోపము,పరులను పిడించునట్లు మాట్లాడుట, వివేక
జ్ఞానహినత, తాను గొప్ప అను అహంకారము, హింస.
ప్రతి మానవుడు తనలోని అసుర లక్షణాలు గుర్తించి వానిని ప్రయత్నపూర్వకంగా దూరంచేసుకొని దైవ లక్షణాలు అలవర్చుకొని భగవంతునిచే ప్రేమించబడే భక్తులుగా తమను తాము తీర్చిదిద్దుకొనవలెను.
19. యోగమనగా నేమి?
జ. యోగమనగా జీవాత్మ పరమాత్మలో లీనమగుట
యోగమనగా దైవాన్ని చేర్చుమార్గము
యోగమనగా ఆనందం
సమత్వమే యోగము
చిత్త వృత్తిని విరోధించునదే యోగము
20. యింద్రియాలకు వైరాగ్యమును అలవరచాలని స్వామి చెప్పారు. కారణం ఏమిటి?
జ. గీతలో శరీరమునుండి జీవాత్మ మరొక శరీరములోనికి ప్రవేశించినపుడు తన సత్కర్మ, దుష్కర్మలను తప్ప మరేమి తీసుకొని వెళ్ళలేదు. వాయువు ఏవిధంగా ఒక ప్రదేశంలోని దుర్గంధాన్ని, సుగంధాన్ని తీసుకొని వేరొక ప్రదేశానికి వెళ్తుందో అదే విధంగా ఆత్మ కర్మఫలమునుతప్ప మరేదీ ఈ ప్రపంచం నుండిగాని, తన గృహము నుండిగాని తీసుకొని వెళ్ళలేదు. అందువలన ధన కనక వస్తువులయందు, భోగ భాగ్యముల నుండి మనసును సత్కర్మలవైపు, దైవముపైన మరల్చి ప్రాపంచిక భోగములపై వైరాగ్యమును అలవర్చుకొనవలెను. దీని ఉదాహరణకు స్వామి చిన్న కథ చెప్తారు.ఒక గృహస్దునకు ముగ్గురు మిత్రులు ఉంటారు. కోర్టులో అతనిపై కేసు విచారణ జరుగబోతుంది. తన మిత్రులను తనతో కోర్టుకువచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరతాడు. మొదటి మిత్రుడు నేను ఇంట్లో నీకేమైనా సహాయం చేస్తాగాని ఇల్లుదాటి బయటకురాను అన్నాడు. రెండవ మిత్రుడు కోర్టువరకు నీకు తోడు వస్తానుగాని లోనికి మాత్రం రాను అన్నాడు. మూడవ మిత్రుడు నేను నీతో కోర్టులోనికి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. మొదటి మిత్రుడు ధనధాన్యాది సంపదలు. రెండవ మిత్రుడు భార్య,బంధు మిత్రులు. మూడవ మిత్రుడు మనం చేసిన సత్కర్మలు.
21. స్వధర్మమంటే ఏమిటి? పర ధర్మమంటే ఏమిటి?
జ. ఆత్మ సంబంధమైన ధర్మం స్వధర్మం, పర ధర్మమంటే దేహ సంబంధమైన ధర్మం.
22. అర్జునుడి పేర్లు వల్ల వ్యక్తమయ్యే విలక్షణ వ్యక్తిత్వం ఏమిటి?
జ. గురువు వద్ద నుండి విద్యకు శిష్యుడు ఏవిధంగా ఆదర్శంగా వుండాలో అర్జునుని పై పేర్ల ద్వారా తెలుసుకోగలము.
23. "యోగం" అంటే అర్థం ఏమిటి?
జ. భగవంతునితో సం యోగము చెందుటే యోగం. అంతేకాకుండా భగవంతుని చేరే మార్గము (గమ్యము) .
24. భగవద్గీతలో యోగం ఏవిధంగా నిర్వచింపబడినది?
జ. "కర్మను కాశలమ్ యోగ:" అన్నది గీత. 
 
 
శ్రీకృష్ణతత్వం

శ్రీకృష్ణతత్వం

*శ్రీకృష్ణతత్వం*

ధర్మరాజు " భీష్మపితామహా ! నాకు శ్రీకృష్ణతత్వము గురించి తెలుసుకోవాలని ఉంది " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నారదాది మునుల వలన నేను తెలుసుకొన్నది ఇప్పుడు నీకు చెప్తాను. శ్రీకృష్ణుడే పరమాత్మ అయిన విష్ణుమూర్తి. అతడు తన వినోదము కొరకు భూమి, ఆకాశము, నీరు, వాయువు అను పంచ భూతములను కల్పించాడు. అలా కల్పించిన జలములో ఒక భవ్యమైన తల్పము మీద అతడు శయనించి ఉన్నాడు. అతడి నాభినుండి ఒక కమలము ఉద్భవించింది. ఆ పద్మము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మ తన సంకల్పంచేత ఏడుగురు మానస పుత్రులను సృష్టించాడు. వారు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు. వారిలో మరీచికి కశ్యపప్రజాపతి జన్మించాడు. కశ్యపుడి వలన దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు మొదలైన జాతులు జన్మించారు. ఆ కశ్యప ప్రజాపతి పుత్రుడు సూర్యుడు. అత్రి మహామునికి చంద్రుడు జన్మించాడు. ఈ సూర్య వంశీయులు, చంద్ర వంశీయులు అనేక సంవత్సరాలు రాజులై ఈ భూమిని పాలించారు. దేశ కాల పరిస్థితులను అనుసరించి రాజవంశస్థులు శాఖోపశాఖలై వర్ధిల్లాయి. ఆ రాజ వంశీయులు తమలో తాము కలహించుకుని విభేదించి యుద్ధములు చేసుకున్నారు. ఆ యుద్ధముల కారణంగా విష్ణువు జనక్షయం చేస్తూ వచ్చాడు. ఆ దేవదేవుడు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్దుడు అనే నాలుగు దివ్యరూపములతో దివ్యనామలతో వినోదించాడు " అని చెప్పి భీష్ముడు శ్రీకృష్ణుడిని చూపి " ధర్మనందనా ! ఈ మహాపురుషుడిని సామాన్య మానవుడిగా చూడటము మన అజ్ఞానము. శ్రీకృష్ణుడు భక్త పరాధీనుడు, తన కటాక్షవీక్షణాలతో భక్తుల కోరికలను తీరుస్తుంటాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడికి నమస్కరించాడు.